T20 World Cup 2021: ఆస్ట్రేలియాకు కష్టమే.. సెమీ ఫైనల్‌కు వెళ్లేది ఆ నాలుగు జట్లే! ఆకాశ్‌ చోప్రా జోస్యం!!

T20 World Cup 2021's 4 Semi Finalists - Aakash Chopra Predicts || Oneindia Telugu

ముంబై: ఐసీసీ టీ20 ప్రపంచకప్‌ 2021కు సమయం దగ్గరపడుతోంది. అక్టోబరు 17 నుంచి నవంబరు 14 వరకూ యూఏఈ, ఒమన్ వేదికగా మెగా టోర్నీ మ్యాచులు జరగనున్నాయి. భారత్‌లో కరోనా వ్యాప్తి నేపథ్యంలో టోర్నీ యూఏఈకి తరలిపొయిన విషయం తెలిసిందే. ప్రపంచకప్‌ కోసం ఇప్పటికే అన్ని దేశాలు తమ జట్లను ప్రకటించగా.. టోర్నీ విజేత గురించి అప్పుడే చర్చ మొదలైంది. తమ ఫేవరెట్‌ జట్ల బలాబలాలు, గెలిచేందుకు వారికి గల అర్హతల గురించి ఫ్యాన్స్‌ సోషల్‌ మీడియా వేదికగా డిబేట్లు పెడుతున్నారు. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ క్రికెటర్‌, స్టార్ కామెంటేటర్‌ ఆకాశ్‌ చోప్రా తన ఫేవరేట్ జట్లను ప్రకటించాడు.

సెమీ ఫైనల్‌కు వెళ్లేది ఆ జట్లే

సెమీ ఫైనల్‌కు వెళ్లేది ఆ జట్లే

ఆకాశ్‌ చోప్రా సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉంటాడన్న సంగతి తెలిసిందే. ఆయనకు సొంతంగా ఓ యూట్యూబ్ ఛానెల్ కూడా ఉంది. ఈ క్రమంలో #AskAakash పేరిట ట్విటర్‌లో మంగళవారం ఆయన అభిమానులతో ముచ్చటించాడు. ఈ సందర్భంగా అభిమానులు ఆయనకు ప్రశ్నల వర్షం కురిపించారు. మీ అంచనా ప్రకారం ప్రపంచకప్‌ 2021 సెమీ ఫైనల్‌కు చేరే నాలుగు జట్లు ఏవి అని ఓ అభిమాని ప్రశ్నించగా.. 'భారత్, పాకిస్తాన్‌, ఇంగ్లండ్‌, వెస్టిండీస్' అని ఆకాశ్‌ చోప్రా సమాధానమిచ్చాడు. నిజానికి ఈసారి భారత్, ఇంగ్లండ్‌, వెస్టిండీస్ జట్లు అన్ని విభాగాల్లో మంచి సమతూకంతో ఉన్నాయి. బ్యాట్స్‌మన్‌, బౌలర్, ఆల్‌రౌండర్‌లతో నిండిఉన్నాయి.

ధోనీ లెజెండ్‌

ధోనీ లెజెండ్‌

టీ20 ప్రపంచకప్‌ 2021 నేపథ్యంలో టీమిండియా స్పిన్‌ విభాగంలో ఎవరెవరికి చోటు దక్కుతుందని ఆకాశ్‌ చోప్రాని మరొక అభిమాని అడగ్గా.. 'రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్‌, రాహుల్ చహర్‌ లేదా వరుణ్‌ చక్రవర్తి' అని జవాబిచ్చాడు. ఆకాశ్‌ చోప్రా చెప్పినట్టు జడేజాకు చోటు ఖాయం అయినా.. అశ్విన్‌ ఉండడం మాత్రం కాస్త కష్టమే. ఐపీఎల్ స్టార్ అయిన అక్షర్‌ పటేల్‌కు మెండుగా అవకాశాలు ఉన్నాయి. భారీ హిట్టింగ్ చేయగలగడం అతడికి కలిసి రానుంది. చహర్‌ లేదా వరుణ్‌లలో ఒక్కరి మాత్రమే చోటు దక్కనుంది. ఇక టీమిండియా మాజీ కెప్టెన్‌, టీ20 ప్రపంచకప్‌ జట్టు మెంటార్‌ ఎంఎస్‌ ధోనీ గురించి రెండు పదాల్లో వర్ణించమని ఇంకొకరు అడగ్గా.. 'జీనియస్‌, లెజెండ్‌' అని ఆకాశ్‌ పేర్కొన్నాడు.

భారత టీ20 ప్రపంచకప్‌ జట్టు

భారత టీ20 ప్రపంచకప్‌ జట్టు

విరాట్‌ కోహ్లీ (కెప్టెన్‌), రోహిత్‌ శర్మ (వైస్‌ కెప్టెన్‌), కేఎల్‌ రాహుల్‌, సూర్యకుమార్‌ యాదవ్‌, రిషబ్‌ పంత్‌ (వికెట్‌కీపర్‌), ఇషాన్‌ కిషన్‌ (వికెట్‌ కీపర్‌), హార్ధిక్‌ పాండ్యా, రవీంద్ర జడేజా, రాహుల్‌ చహర్‌, రవిచంద్రన్‌ అశ్విన్‌, అక్షర్‌ పటేల్‌, వరుణ్‌ చక్రవర్తి, జస్ప్రీత్ బుమ్రా, భువనేశ్వర్‌ కుమార్‌, మహ్మద్‌ షమీ.

స్టాండ్‌ బై ప్లేయర్స్‌: శ్రేయస్‌ అయ్యార్‌, శార్దూల్‌ ఠాకూర్‌, దీపక్‌ చహార్‌.

IPL 2021: కోహ్లీసేన జెర్సీ మారింది.. కేవలం ఆ ఒక్క మ్యాచుకే! కారణం ఏంటంటే!!

ఇంగ్లండ్ టీ20 ప్రపంచకప్‌ జట్టు

ఇంగ్లండ్ టీ20 ప్రపంచకప్‌ జట్టు

ఇయాన్ మోర్గాన్ (కెప్టెన్), మొయిన్ అలీ, జోనాథన్ బెయిర్‌స్టో, సామ్ బిల్లింగ్స్, జోస్ బట్లర్, సామ్ కరన్, క్రిస్ జోర్డాన్, లియామ్ లివింగ్‌స్టోన్, డేవిడ్ మలన్, టైమల్ మిల్స్, అదిల్ రషీద్, జాసన్ రాయ్, డేవిడ్ విల్లీ, క్రిస్ వోక్స్, మార్క్ వుడ్.

స్టాండ్‌ బై ప్లేయర్లు: టామ్ కరన్, లియామ్ డాసన్, జేమ్స్ విన్స్.

పాకిస్తాన్ టీ20 ప్రపంచకప్‌ జట్టు

పాకిస్తాన్ టీ20 ప్రపంచకప్‌ జట్టు

బాబర్ అజమ్ (కెప్టెన్), షాదాబ్ ఖాన్ (వైస్‌ కెప్టెన్‌), మహ్మద్ హఫీజ్, ఆసిఫ్ అలీ, అజమ్ ఖాన్, హారిస్ రౌఫ్, హసన్ అలీ, ఇమాద్ వసీం, ఖుష్దీల్ షా, మొహమ్మద్ హస్నైన్, మహ్మద్ నవాజ్, మహమ్మద్ రిజ్వాన్ (వికెట్ కీపర్), మొహమ్మద్ వసీం, షాహిన్ అఫ్రిది, సోహైబ్ మక్సూద్.

స్టాండ్‌ బై ప్లేయర్స్‌: ఫఖర్ జమాన్, ఉస్మాన్ ఖదీర్, షానవాజ్ దహని

వెస్టిండీస్ టీ20 ప్రపంచకప్‌ జట్టు

వెస్టిండీస్ టీ20 ప్రపంచకప్‌ జట్టు

కీరన్ పొలార్డ్ (కెప్టెన్‌), నికోలస్ పూరన్ (వైస్‌ కెప్టెన్‌), క్రిస్ గేల్, ఫాబియన్ అలెన్, డ్వేన్ బ్రావో, రోస్టన్ చేజ్, ఆండ్రీ ఫ్లెచర్, షిమ్రన్ హెట్‌మైర్, ఎవిన్ లూయిస్, ఒబేడ్ మెక్కాయ్, రవి రాంపాల్, ఆండ్రీ రసెల్‌, లెండెల్ సిమన్స్, ఒషానే థామస్, హెడెన్‌ వాల్ష్‌ జూనియర్‌.

స్టాండ్‌ బై ప్లేయర్లు: జాసన్‌ హోల్డర్‌, డారెన్‌ బ్రావో, షెల్డన్‌ కాట్రెల్‌, ఏకేల్ హోసిన్.

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
Story first published: Tuesday, September 14, 2021, 16:37 [IST]
Other articles published on Sep 14, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X