IPL 2021: రిషబ్ పంత్ నిరూపించుకున్నా.. తిరిగొస్తే శ్రేయస్‌ అయ్యరే ఢిల్లీ కెప్టెన్!!

IPL 2021 : Rishabh Pant అగ్రస్థానంలో నిలబెట్టినా Shreyas Iyer నే DC Captain || Oneindia Telugu

ముంబై: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021లో శ్రేయస్‌ అయ్యర్‌ తిరిగి ఢిల్లీ క్యాపిటల్స్‌కు సారథ్యం వహించే అవకాశం ఉందని టీమిండియా మాజీ క్రికెటర్‌, కామెంటేటర్ ఆకాశ్ చోప్రా అంచనా వేశారు. గాయంతో టోర్నీకి దూరమై.. కోలుకొని తిరిగొస్తే జట్టులోకి తీసుకోకూడదన్న నియమమేమీ లేదన్నారు. సారథిగా రిషబ్ పంత్ నిరూపించుకున్నా.. తిరిగొస్తే అయ్యరే ఢిల్లీ కెప్టెన్ అని ఆకాశ్ చోప్రా పేర్కొన్నారు. కరోనా కేసులు పెరగడంతో మార్చి 4న అనూహ్య ప‌రిస్థితుల్లో ఐపీఎల్ 2021ను బీసీసీఐ నిరవధిక వాయిదా వేసింది. ఐపీఎల్ 2021లో ఆగిపోయేసమయానికి 29 మ్యాచులే పూర్తయ్యాయి.

అగ్రస్థానంలో ఢిల్లీ

అగ్రస్థానంలో ఢిల్లీ

గాయం కారణంగా శ్రేయస్‌ అయ్యర్‌ ఐపీఎల్ 14వ సీజన్‌కు దూరమైన సంగతి తెలిసిందే. తాజా సీజన్‌కు ముందు ఇంగ్లండ్‌తో గత మార్చిలో జరిగిన వన్డే సిరీస్‌లో బౌండరీ లైన్ వద్ద ఫీల్డింగ్ చేస్తూ శ్రేయాస్ గాయపడ్డాడు. భుజం స్థానభ్రంశం కావడంతో.. ఐపీఎల్‌, కౌంటీ క్రికెట్‌కు దూరమయ్యాడు. దాంతో యువ రిషబ్ పంత్‌కు ఢిల్లీ పగ్గాలు అప్పజెప్పింది ఆ జట్టు యాజమాన్యం. కొన్ని పొరపాట్లు చేసినా.. పంత్‌ జట్టును సమర్థంగా నడిపించాడు. 6 విజయాలతో 12 పాయింట్లతో పట్టికలో అగ్రస్థానంలో ఢిల్లీని నిలబెట్టాడు. నాయకత్వ లోపాలను కూడా త్వరగానే సరిదిద్దుకున్నాడు. దాంతో శ్రేయస్‌ తిరిగొస్తే అతడికి సారథ్యం ఇస్తారా లేదా అన్న సందిగ్ధం నెలకొంది.

తిరిగొస్తే అయ్యర్‌కు సారథ్యం

తిరిగొస్తే అయ్యర్‌కు సారథ్యం

శ్రేయస్‌ తిరిగొస్తే అతడికి సారథ్యం ఇస్తారా లేదా అని సోషల్‌ మీడియాలో ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు ఆకాశ్ చోప్రా ఇలా సమాధానం ఇచ్చాడు. 'కచ్చితంగా అయ్యరే ఢిల్లీ కెప్టెన్.. అందులో సందేహమే లేదు. గాయం నుంచి కోలుకొని తిరిగొస్తే అయ్యర్‌కు సారథ్యం ఇస్తారు. మూడో స్థానంలో కూడా బ్యాటింగ్‌ చేస్తాడు. అప్పుడు షిమ్రన్ హెట్‌మైయిర్‌, మార్కస్ స్టోయినిస్‌, కాగిసో రబాడతో కలిసి అన్రిచ్ నోర్జ్

తుది జట్టులో ఆడతాడు. ఇప్పటికే ఢిల్లీ పటిష్టంగా ఉంది. ప్రస్తుతం పట్టికలో అగ్రస్థానంలో ఉంది. శ్రేయస్‌ రాకతో మరింత బలం పుంజుకుంటుంది. టోర్నీకి దూరమయ్యాక తిరిగి రావొద్దన్న నిబంధనలు ఎక్కడా లేవు. అతడు ఫిట్‌నెస్‌ సాధిస్తే కచ్చితంగా పునరాగమనం చేస్తాడు' అని ఆకాశ్ బదులిచ్ఛాడు.

భారత్‌ మైండ్‌గేమ్స్‌ ఆడడం నేనెప్పుడూ చూడలే..ఇన్నాళ్ల తర్వాత పైన్‌ మాట్లాడటం ఆశ్చర్యమే!అతని మాట ఎవరు వింటారు?

డైవ్ చేయగా

డైవ్ చేయగా

ఇంగ్లండ్‌తో గత మార్చిలో జరిగిన వన్డే సిరీస్‌లో భాగంగా మొదటి మ్యాచులో బౌండరీ లైన్ వద్ద ఫీల్డింగ్ చేస్తూ శ్రేయాస్ అయ్యర్ గాయపడ్డాడు. బౌండరీకి వెళ్తున్న బంతిని అడ్డుకునే క్రమంలో శ్రేయాస్ డైవ్ చేయగా.. అతని శరీర బరువు మొత్తం ఎడమ భుజంపై పడిపోయింది. దాంతో ఫిజియో సూచన మేరకు వెంటనే మైదానం వీడిన అయ్యర్.. ఆ తర్వాత సిరీస్‌కు దూరమయ్యాడు. ఆపై భుజానికి సర్జరీ చేయించుకుని ఐపీఎల్ 2021 సీజన్‌కి కూడా దూరమైపోయాడు. భారత్ జట్టు జులైలో శ్రీలంక పర్యటనకి వెళ్లనుండగా.. అయ్యర్‌‌ కెప్టెన్‌గా ఎంపికవబోతున్నట్లు వార్తలు వచ్చాయి. కానీ గాయం నుంచి ఇంకా పూర్తిగా కోలుకోని అయ్యర్.. సెలక్షన్‌కి అందుబాటులో ఉండటం లేదని బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు. అతడు పూర్తిగా కోలుకునేందుకు కనీసం 5-6 వారాల సమయం పడుతుందని సమాచారం.

సెప్టెంబర్‌లో మిగిలిన సీజన్‌:

సెప్టెంబర్‌లో మిగిలిన సీజన్‌:

ఐపీఎల్ 2021లో మొత్తం 60 మ్యాచ్‌లకు గాను.. లీగ్ ఆగిపోయేసమయానికి 29 మ్యాచులే పూర్తయ్యాయి. ఒకవేళ ఐపీఎల్ 2021లోని మిగతా మ్యాచులు జరగకపోతే.. బీసీసీఐ 2500 కోట్లు నష్టపోనుందని స్వయంగా బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీనే తెలిపారు. ఈ నేపథ్యంలో సీజన్‌ను తిరిగి నిర్వహించే సమయం, వేదిక గురించి బీసీసీఐ యోచిస్తోంది. అక్టోబర్‌లో టీ20 ప్రపంచకప్‌నకు బీసీసీఐ ఆతిథ్యమివ్వాల్సి ఉంది. కావున అంతకంటే ముందే సెప్టెంబర్‌లో మిగిలిన సీజన్‌ను నిర్వహించే వీలుంది. అప్పటికి అయ్యర్ కోలుకుని జట్టు పగ్గాలు అందుకోనున్నాడు.

For Quick Alerts
Subscribe Now
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
Story first published: Friday, May 14, 2021, 12:52 [IST]
Other articles published on May 14, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X