న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఐపీఎల్‌లో అత్యధిక 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌'లు అందుకుంది వీరే.. భారత్ నుంచి ఇద్దరు!!

5 players with the most Man of the Match awards in IPL history

హైదరాబాద్: టీ20 ఫార్మాట్ అన‌గానే అంద‌రికీ బ్యాట్స్‌మెన్ ధ‌నాధాన్ ఆట‌తీరే గుర్తుకువస్తుంది. కొత్త కొత్త షాట్ల‌తో బ్యాట్స్‌మెన్ ఆకట్టుకుంటారు. పొట్టి ఫార్మాట్ వ‌చ్చాక అనేక కొత్త షాట్లు అభిమానుకుల ఆనందాన్ని క‌లిగిస్తున్నాయి. ఇక ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) మరో నాలుగు రోజుల్లో ప్రారంభం కానుంది. ఈ లీగ్ కోసం కోట్ల మంది అభిమానులు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో బ్యాట్స్‌మెన్ మరోసారి అలరించేందుకు సిద్ధంగా ఉన్నారు. అయితే ఐపీఎల్‌లో అత్యధికంగా 'ప్లేయ‌ర్ ఆఫ్ ది మ్యాచ్'లు అందుకున్న బ్యాట్స్‌మన్‌ల జాబితా ఓసారి పరిశీలిస్తే...

గేల్@1

గేల్@1

ఐపీఎల్ టోర్నమెంట్ చరిత్రలో అత్యధికంగా మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులను అందుకున్న ఆటగాడు క‌రేబియ‌న్ స్టార్, యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్. 125 ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడిన గేల్.. ఇప్ప‌టివ‌ర‌కు 21 మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు గెలుచుకున్నాడు. ఐపీఎల్‌లో గేల్ ఆరు సెంచ‌రీలు, 11 అర్థ సెంచ‌రీలు చేశాడు. మొద‌ట ఆర్‌సీబీ త‌ర‌పున ఆడిన గేల్‌.. ఇప్పుడు కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జ‌ట్టుకు ఆడుతున్నాడు. 2018లో పంజాబ్ రూ.2 కోట్ల‌కు కొనుగోలు చేసింది.

డివీలియ‌ర్స్‌- 20

డివీలియ‌ర్స్‌- 20

క్రిస్ గేల్ త‌రువాత రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) స్టార్ ప్లేయ‌ర్ ఏబీ డివిలియ‌ర్స్ ఉన్నాడు. ఏబీ 20 ప్లేయ‌ర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు గెలుచుకున్నాడు. 142 ఐపీఎల్ ఇన్నింగ్స్ ఆడిన డివిలియ‌ర్స్.. ఇప్ప‌టివ‌ర‌కు 20 ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ ట్రోఫీలను అందుకున్నాడు. డివిలియర్స్ మూడు సెంచరీలు, 16 అర్ధ సెంచరీలు చేశాడు. ఏబీ అంతలా రాణించినా.. ఆర్‌సీబీ ఇప్ప‌టివ‌ర‌కు ఐపీఎల్ ట్రోఫీ గెలువ‌లేక‌పోయింది.

వార్న‌ర్@3

వార్న‌ర్@3

అత్యధిక ప్లేయ‌ర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు గెలుచుకున్న జాబితాలో సన్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ కెప్టెన్ డేవిడ్ వార్న‌ర్ మూడో స్థానంలో ఉన్నాడు. 17 ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ ట్రోఫీలను అతడు అందుకున్నాడు. వార్న‌ర్ మొత్తం 126 మ్యాచ్‌లు ఆడి 4706 పరుగులు చేశాడు. ఇందులో 44 హాఫ్ సెంచ‌రీలు, 4 సెంచ‌రీలు చేశాడు. అవార్డులు అందుకున్న సమయంలో 14 హాఫ్ సెంచ‌రీలు, మూడు సెంచ‌రీలు చేశాడు.

ధోనీ-17

ధోనీ-17

చెన్నై సూపర్ కింగ్స్ సారథి ఎంఎస్ ధోనీ కూడా ఐపీఎల్ చరిత్రలో 17 ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ ట్రోఫీలను గెలుచుకున్నాడు. చెన్నై సూపర్ కింగ్స్ కోసం మహీ చాలాసార్లు మ్యాచ్ విన్న‌ర్‌గా నిలిచాడు. 190 ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడిన ధోనీ.. 23 అర్ధ సెంచరీలు కొట్టాడు. చెన్నైకి ఫినిషర్ పాత్రలో 4-7 స్థానాల్లో బ్యాటింగ్ చేసినా.. 4432పరుగులు చేశాడు.

రోహిత్@5

రోహిత్@5

ఐపీఎల్ టోర్నీలో అత్యధిక ప్లేయ‌ర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు గెలుచుకున్న జాబితాలో ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ ఐదవ స్థానంలో ఉన్నాడు. ఇప్ప‌టివ‌ర‌కు 183 ఐపీఎల్ ఇన్నింగ్స్‌లు ఆడిన రోహిత్.. 17 మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు గెలుచుకున్నాడు. ఇక ఐపీఎల్ కెరీర్‌లో ఒక సెంచరీ, 14 అర్ధ సెంచరీలు చేశాడు. ఐదు ఐపీఎల్ టైటిళ్లతో రోహిత్ శర్మ అత్యంత విజ‌య‌వంత‌మైన కెప్టెన్‌గా పేరు తెచ్చుకున్నాడు. లీగ్ చరిత్రలో 129 మంది ఆటగాళ్లు ఈ అవార్డుల‌ను అందుకున్నారు. టాప్-5లో ఇద్దరు భారత ఆటగాళ్లు ఉన్నారు.

RCB: బ్యాటింగ్, ఫీల్డింగ్‌పై విరాట్ కోహ్లీ ఫోకస్.. ఫొటోలు చూస్తే.. !!

Story first published: Tuesday, September 15, 2020, 13:22 [IST]
Other articles published on Sep 15, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X