న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IPL 2022: నో మోరీస్, నో బట్లర్.. రాజస్థాన్ రాయల్స్ రిటైన్ చేసుకునేది ఆ నలుగురినే!

4 players which Rajastan Royals should retain for IPL 2022
IPL Mega Auction 2022 : Rajasthan Royals Might Retain These 4 Players For IPL 2022 | Oneindia Telugu

హైదరాబాద్: ఐపీఎల్ 2021 సీజన్ పూర్తవ్వకముందే వచ్చే ఏడాది జరిగే క్యాష్ రిచ్ లీగ్‌పై సందడి నెలకొంది. ఎందుకంటే కొత్తగా రెండు జట్లు చేరికతో మెగా వేలం జరగనుంది. ఈ క్రమంలో జట్లన్నీ మారనున్నాయి. దాంతో తమ అభిమాన జట్లలో వచ్చే మార్పులు, ఫేవరేట్ ఆటగాళ్లు మారే జట్లు ఎంటనే ఆసక్తి ప్రతీ క్రికెట్ అభిమానిలో నెలకొంది. అటు భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) కూడా ఐపీఎల్ 2022 సీజన్‌కు సంబంధించిన ప్రణాళిలకను పూర్తి చేసింది. నయా టీమ్స్ విక్రయాల నుంచి మెగా వేలం నిర్వహించే దానిపై విధివిధానాలను రూపొందించింది.

రిటెయిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్లేయర్ల విషయంలోనూ బీసీసీఐ క్లారిటీ ఇచ్చింది. ప్రతి ఫ్రాంచైజీ నలుగురు ప్లేయర్లను మాత్రమే రిటెయిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేసుకునే‌ అవకాశం ఉంటుందని తెలిపింది. అధికారికంగా ప్రకటించికపోయినా.. విధివిధానాలపై బోర్డు ఓ బ్లూ ప్రింట్ రెడీ చేసిందని బీసీసీఐ వర్గాలు పేర్కొన్నాయి. రిటైన్ పాలసీ తాజా నిబంధనల ప్రకారం ముగ్గురు ఇండియన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ఒకరు ఫారిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్లేయర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌. లేదంటే ఇద్దరు ఇండియన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ఇద్దరు ఫారిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్లేయర్లను అంటిపెట్టుకోవచ్చు.

నో మోరీస్.. నో బట్లర్..

నో మోరీస్.. నో బట్లర్..

ఐపీఎల్ 2022 మెగా ఆక్షన్‌ను అడ్వాంటేజ్‌‌గా తీసుకోవాలని రాజస్థాన్ రాయల్స్ భావిస్తోంది. సీజన్ ప్రారంభంలో టైటిల్ గెలిచిన ఆ జట్టు ఆ తర్వాత మళ్లీ తమ స్థాయిని ప్రదర్శించలేకపోయింది. గత రెండు సీజన్లలోనైతే దారుణంగా 7, 8వ స్థానాల్లో నిలిచింది. పూర్తిగా ఓవర్‌సీస్ ప్లేయర్లే ఉండటం.. సరైన దేశవాళీ ఆటగాళ్లు లేకపోవడం ఆ జట్టు ఫలితాలపై ప్రభావం చూపింది. దాంతో ఈ సారైన సమతూకమైన జట్టును ఎంచుకోవాలని భావిస్తోంది. ఇక రిటైన్ పాలసీ ప్రకారం ఆ జట్టు కేవలం ఇద్దరు ఓవర్‌సీస్ ప్లేయర్లనే తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. దాంతో ఐపీఎల్ 2021 వేలంలో రూ.16.25 కోట్లు రికార్డు ధరకు కొనుగోలు చేసిన మోరీస్‌కు మొండి చేయ్యే ఎదురు కానుంది. అంతేకాకుండా స్టార్ ఓపెనర్ జోస్ బట్లర్, డేవిడ్ మిల్లర్ల సేవలను కూడా ఆ జట్టు కోల్పోనుంది.

సంజూ శాంసన్..

సంజూ శాంసన్..

ఆ జట్టు ఇద్దరు ఓవర్‌సీస్ ప్లేయర్స్, స్వదేశీ ఆటగాళ్లను రిటైన్ చేసుకోనుంది. తొలి ఆటగాడిగా తమ కెప్టెన్ సంజూ శాంసన్‌ను తీసుకోనుంది. ఐపీఎల్ స్టార్ అయిన సంజూ శాంసన్‌ను వదులుకునే సాహసం రాజస్థాన్ రాయల్స్ చేయకపోవచ్చు. నిలకడలేమి ఆట ప్రతికూలంగా ఉన్నా.. తనదైన రోజున సంజూను ఆపడం ఎవరి వల్ల కాదు. ప్రతీ సీజన్‌లో అతను తన మార్క్ పెర్ఫామెన్స్ చూపిస్తాడు. కెప్టెన్‌గా కూడా అతను సత్తా చాటాడు.అతని సారథ్యంలో రాజస్థాన్ 7 మ్యాచ్‌ల్లో 3 గెలిచి 4 ఓడింది. బ్యాటింగ్ కూడా సంజూ సత్తా చాటాడు. 7 మ్యాచ్‌ల్లో 46.19 సగటుతో 277 రన్స్ చేశాడు. ఇందులో ఓ సెంచరీ ఉంది. గత మూడు సీజన్లలో 375, 342, 441 రన్స్ చేశాడు. ఈ లెక్కన రిటైన్ జాబితాలో అతనికి చోటు ఖాయం.

 బెన్ స్టోక్స్

బెన్ స్టోక్స్

రాజస్థాన్ రాయల్స్ రిటైన్ చేసుకోబోయే రెండో ఆటగాడు బెన్ స్టోక్స్. వరల్డ్ బెస్ట్ ఆల్‌రౌండర్ అయిన బెన్ స్టోక్స్‌ను ఏ జట్టు వదులుకోదు. విధ్వంసకర బ్యాటింగ్‌తో పాటు కచ్చితమైన బౌలింగ్ చేసే స్టోక్స్ ఏ జట్టుకైనే అవసరమే. దురదృష్టవశాత్తు అతను ఐపీఎల్ 2021‌లో ఒకే మ్యాచ్ ఆడినప్పటికీ గతేడాది అద్భుతంగా రాణించాడు. 8 మ్యాచ్‌ల్లో 285 రన్స్ చేశాడు. ఇందులో ఓ సెంచరీతో పాటు హాఫ్ సెంచరీ కూడా ఉంది. ప్రపంచ క్రికెట్‌లో దుమ్మురేపుతున్నస్టోక్స్‌ను వదులుకునే సాహసం రాజస్థాన్ చేయదు.

చేతన్ సకారియా..

చేతన్ సకారియా..

యువ పేసర్ చేతన్ సకారియాను కూడా రాజస్థాన్ రాయల్స్ తీసుకునే అవకాశం ఉంది. ఈ సీజన్‌తోనే ఐపీఎల్ కెరీర్ ప్రారంభించిన సకారియా సూపర్ బౌలింగ్‌తో ఆకట్టుకున్నాడు. ఆల్‌టైమ్ గ్రేట్ ధోనీ వికెట్ పడగొట్టాడు. ఎంతో మెచ్యూర్‌గా బౌలింగ్ చేయడమే కాకుండా.. మైమరిపించే ఫీల్డింగ్‌తో ఆకట్టుకున్నాడు. ఐపీఎల్ 2021లో ఏడింటికి ఏడు మ్యాచ్‌లు ఆడిన ఈ యువ పేసర్ 7 వికెట్లు పడగొట్టాడు. ఫస్ట్ మ్యాచ్‌లోనే 3 వికెట్లు పడగొట్టాడు. ఈ పెర్ఫామెన్స్‌తో టీమిండియా పిలుపు కూడా అందుకున్నాడు. ప్రస్తుతం శ్రీలంక పర్యటనలో ఉన్న అతను అంతర్జాతీయ అరంగేట్రం గురించి ఎదురు చూస్తున్నాడు. టీమిండియా భవిష్యత్తు బౌలర్‌గా కనిపిస్తున్న అతన్ని రాజస్థాన్ రిటైన్ చేసుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

జోఫ్రా ఆర్చర్..

జోఫ్రా ఆర్చర్..

ఇంగ్లండ్ స్టార్ పేసర్ జోఫ్రా ఆర్చర్‌ను కూడా రాజస్థాన్ రాయల్స్ వదులుకోలేదు. వరల్డ్ బెస్ట్ బౌలర్ అయినటువంటి ఆర్చర్.. లోయరార్డర్‌లో ధాటిగా బ్యాటింగ్ కూడా చేయగలడు. టీ20 క్రికెట్‌కు సరిగ్గా సరిపోయే ప్లేయర్. అలాంటి ఆర్చర్‌ను అన్నీ జట్లు కోరుకుంటాయి. గాయంతో ఈ సీజన్ ఫస్టాఫ్ మ్యాచ్‌లకు దూరమైనా గత సీజన్‌లోనే ఐపీఎల్ కెరీర్ ప్రారంభించి అద్భుతంగా రాణించాడు. 14 మ్యాచ్‌ల్లో 20 వికెట్లు తీశాడు. ఎంతో భవిష్యత్తు ఉన్న ఆర్చర్‌ను రాజస్థాన్ వదులుకునే సాహసం చేయదు. కానీ గాయాలతో సతమతమై క్రికెట్ ఆడలేని పరిస్థితి ఉంటే

మాత్రం అతనికి బదులు బట్లర్‌ను రిటైన్ చేసుకోవచ్చు.

Story first published: Thursday, July 15, 2021, 16:14 [IST]
Other articles published on Jul 15, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X