న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

అమ్మా డోంట్ వర్రీ.. నా కోసం అబ్బాయిలు క్యూ కడతారు: నిఖత్ జరీన్

Nikhat Zareen says My mother was crying and said no one would marry me
అమ్మకి అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చిన నికత్ జరీన్*sports | Telugu OneIndia

హైదరాబాద్: కామన్వెల్త్ గేమ్స్‌లో భారత బాక్సింగ్ క్వీన్, తెలంగాణ ముద్దు బిడ్డ నిఖత్ జరీన్ సత్తా చాటింది. ఖతర్నాక్ పంచ్‌తో ఎదురైన ప్రత్యర్థినల్లా మట్టికరిపిస్తూ.. కామన్వెల్త్ గేమ్స్‌లో పోటీపడ్డ మొదటి సారే గోల్డ్ మెడల్ సాధించి శభాష్ అనిపించింది. ఆదివారం జరిగిన మహిళల 50 కేజీల టైటిల్ ఫైట్‌లో 26 ఏళ్ల నిఖత్ 5-0తో నార్నర్న్ ఐర్లాండ్‌కు చెందిన కార్లీమెక్‌నాల్‌‌ను చిత్తుగా ఓడించింది.

ఆడిన అన్ని బౌట్స్‌లో ఏకపక్ష విజయాలు సాధించిన జరీన్ తుదిపోరులోనూ అదే జోరు కొనసాగిస్తూ ఆడుతూ పాడుతూ బంగారం తెచ్చింది. సంప్రదాయ ముస్లిం కుటుంబం నుంచి వచ్చిన నిఖత్.. చిన్నప్పుడు జరిగిన ఓ సంఘటనను తాజాగా గుర్తు చేసుకుంది. తాజాగా ఓ నేషనల్ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పెళ్లి గురించి తన తల్లి తెగ ఆందోళనకు గురైందని చెప్పింది.

పెళ్లి ఎవరూ చేసుకోరని..

పెళ్లి ఎవరూ చేసుకోరని..

బాక్సింగ్ నేర్పించవద్దని తన తండ్రిని ఒత్తిడి చేసిందని పేర్కొంది. ‘చుట్టుపక్కల వాళ్లు మన అమ్మాయి గురించి నానా రకాలుగా మాట్లాడుతున్నారు. నిఖత్‌‌కు బాక్సింగ్ నేర్పిస్తూ తప్పుచేస్తున్నామని అందరూ అంటున్నారు. ఇది ఇలాగే కొనసాగితే మన అమ్మాయికి పెళ్లి కాదు. తనను పెళ్లి చేసుకోవడానికి ఎవరూ రారు.'అని 12 ఏళ్ల వయసులో తన తల్లి ఆందోళనకు గురైందని నిఖత్ తెలిపింది. అయితే తన తండ్రి మాత్రం నచ్చజెప్పాడని, ఏదో రోజు నిఖత్ ప్రపంచం మాట్లాడుకునేలా చేస్తుందని తెలిపాడని గుర్తు చేసుకుంది.

 అబ్బాయిలు క్యూ కడతారు..

అబ్బాయిలు క్యూ కడతారు..

కొద్దిరోజుల తర్వాత తనతోనే బాక్సింగ్ వద్దని, ఎవరు పెళ్లి చేసుకోరని తన తల్లి చెప్పిందని నిఖత్ తెలిపింది. ‘నిఖత్.. నువ్వు ఇలా బాక్సింగ్ అంటూ ఊర్లు పట్టుకుని తిరిగితే నీకు పెళ్లి ఎలా అవుతుంది.? నిన్ను ఎవరు చేసుకుంటారు. సంప్రదాయాలకు విరుద్ధంగా ఉంటే నిన్ను చేసుకోవడానికి ఎవరొస్తారని నన్ను ప్రశ్నించింది. దానికి నేను.. అమ్మా నువ్వు నా పెళ్లి గురించి మరిచిపో.. టెన్షన్ పెట్టుకోకు. నాకు పేరు వచ్చిందనుకో.. నా కోసం పెళ్లి కొడుకులు మన ఇళ్ల ముందు క్యూ కడతారని చెప్పా'అని నిఖత్ చెప్పుకొచ్చింది.

2024 పారిస్ ఒలింపిక్స్‌లో స్వర్ణం గెలవడమే తన లక్ష్యమని నిఖత్ తెలిపింది. ‘జనవరి నుంచి తీరిక లేకుండా ఛాంపియన్‌షిప్‌లలో పోరాడుతూ.. శిక్షణ పొందుతున్నాను. అయితే, ఇప్పుడు నేను ఈ క్షణాన్ని ఆస్వాదించాలనుకుంటున్నాను. ఇప్పటివరకు నా విజయానికి ఎప్పుడూ సంబరాలు జరుపుకోలేదు. అయితే.. ఈసారి కాస్త విశ్రాంతి తీసుకోని ఈ విజయాన్ని ఎంజాయ్‌ చేద్దాం అనుకుంటున్నా.' అని నిఖత్‌ స్వర్ణం నెగ్గాక చెప్పింది.

 అమ్మకు బర్త్‌డే గిఫ్ట్‌..

అమ్మకు బర్త్‌డే గిఫ్ట్‌..

నిఖత్ మూడు రోజుల క్రితం.. తన తల్లి పుట్టినరోజున ఆమెతో ​​ఉండాలనుకున్నా కుదరలేదు. కానీ ఇప్పుడు కామన్వెల్త్‌లో గెలిచిన గోల్డ్‌ మెడల్‌ని బహుమతిగా ఇవ్వడం ద్వారా ఆ లోటును భర్తీ చేయాలని భావిస్తోంది. పతకాల వేడుక నుంచి తిరిగి వచ్చిన తర్వాత జరీన్ తన కోచ్ భాస్కర్ భట్ మెడలో మెడల్‌ వేసి ఆశీస్సులు తీసుకోవడం విశేషం. "బితియా హై మేరీ. మా బంధం తండ్రీ కూతుళ్ల లాంటిది. ఇంతకంటే మంచి అనుభూతి మరొకటి ఉండదు" అని భట్ తెలిపాడు.

Story first published: Monday, August 8, 2022, 15:53 [IST]
Other articles published on Aug 8, 2022
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X