న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

రెండున్నర కిలోమీటర్లు వరదల్లో ఈదాడు.. బాక్సింగ్‌లో పతకం గెలిచాడు

Karnataka floods: Boxer swims 2.5 km in floodwater for championship, wins silver

బెంగళూరు: పట్టుదల ఉంటే మనిషి ఏదైనా సాదించగలడని ఓ కర్ణాటక యువకుడు నిరూపించాడు. ఆ యువకుడు తన ప్రాణాలను సైతం ఫణంగా పెట్టి తన ఆశయం కోసం పెద్ద సాహసాన్ని చేసాడు. ఇదిలా ఉంటే.. ఆ యువకుడు రెండున్నర కిలోమీటర్లు వరదలో ఈదాడు సరే!!. మరి బాక్సింగ్‌లో పతకం గెలవడం ఏంటని అందరూ ఆశ్చర్యపోతున్నారా?. అసలు విషయం ఏంటంటే.

<strong>కన్నీంటి పర్యంతమైన సెరెనా విలియమ్స్‌.. ఎందుకో తెలుసా?</strong>కన్నీంటి పర్యంతమైన సెరెనా విలియమ్స్‌.. ఎందుకో తెలుసా?

భారీ వర్షాలు:

భారీ వర్షాలు:

కర్ణాటకలోని బెలగావి సమీపంలోని మన్నూరు గ్రామానికి చెందిన నిషాన్‌ మనోహర్‌ (19) బాక్సింగ్‌ ఛాంపియన్‌ కావాలని ఎప్పటి నుండో కలలు కానేవాడు. దేశ వ్యాప్తంగా ఎక్కడ పోటీలు నిర్వహించినా వెళ్ళేవాడు. ఆగస్టు 7 నుంచి బెంగళూరులో జరిగే రాష్ట్రస్థాయి బాక్సింగ్‌ పోటీల్లో పాల్గొనాలని మనోహర్‌ నిశ్చయించుకున్నాడు. అయితే గత వారం రోజులుగా కర్ణాటకలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మనోహర్‌ గ్రామంలోనూ భారీగా కురవడంతో వరదలు పోటెత్తుతున్నాయి. దీంతో బస్సులు, ఆటోలు నడవకపోవడంతో బెంగళూరు పోటీలకు వెళ్లడానికి వీలు లేకుండాపోయింది.

వరదల్లో ఈదుతూ:

వరదల్లో ఈదుతూ:

మనోహర్‌ బెంగళూరు వెళ్లే రైలును చేరుకోవాలంటే ఈత కొట్టడం తప్ప మరో ప్రత్యామ్నాయం లేదు. ఇక బాక్సింగ్‌ సమానును ఓ ప్లాస్టిక్ సంచిలో మూటగా కట్టి వీపుకు తగిలించుకుని వరదల్లో ఈత కొట్టడానికి సిద్దమయ్యాడు. మనోహర్‌తో పాటు అతని తండ్రి కూడా సిద్దమయ్యాడు. 45 నిమిషాల్లోనే రెండున్నర కిలోమీటర్లు ఈదుకుంటూ రోడ్డును చేరుకున్నారు. అక్కడ పోటీలకు వెళ్తున్న తమ బృంద సభ్యులతో కలిసి బెంగళూరు వెళ్ళాడు. అక్కడి బాక్సింగ్‌ పోటీల్లో పాల్గొన్న మనోహర్‌.. వెండి పతకాన్ని దక్కించుకున్నాడు.

సిద్ధార్థ్‌ దేశాయ్‌ విఫలం.. బంగాల్‌తో టైటాన్స్‌ మ్యాచ్‌ టై

ఆదర్శంగా నిలుస్తాడు:

ఆదర్శంగా నిలుస్తాడు:

'అసౌకర్య పరిస్థితులలో బంగారు పతకం సాధించలేకపోయా' అని మనోహర్‌ తెలిపాడు. అంతేకాదు బెంగళూరు పోటీలకు రావడానికి ఎదుర్కొన్న ఇబ్బందులను కూడా వివరించాడు. మనోహర్‌ బృంద మేనేజర్‌ గజేంద్ర త్రిపాఠి మాట్లాడుతూ... 'ఎన్ని కష్టాలు ఎదురైనా మనోహర్‌ పోటీల్లో బాగా రాణించాడు. అతడు అందరికి ఆదర్శంగా నిలుస్తాడు. వచ్చే ఏడాది తప్పకుండా బంగారు పతకం సాధిస్తాడు' అని ధీమా వ్యక్తం చేసాడు.

Story first published: Tuesday, August 13, 2019, 10:43 [IST]
Other articles published on Aug 13, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X