
థామస్ కప్‌తో..
ప్రతిష్టాత్మక థామస్ కప్ గెలవడం భారత బ్యాడ్మింటన్‌లో చారిత్రాత్మక ఘట్టం. గతంలో ఎన్నిసార్లు ప్రయత్నించినా దక్కని ఈ టైటిల్.. ఈ సారి వరించింది. చైనా, ఇండోనేషియా కోటలను భారత ఫురుషుల బ్యాడ్మింటన్ టీమ్ బద్దలు కొట్టింది. కిదాంబి శ్రీకాంత్ కెప్టెన్సీలో తొలిసారి థామస్ కప్ గెలవడంతో పాటు ప్లేయర్లు తమ ఆట స్థాయిని పెంచుకున్నారు. శ్రీకాంత్‌తో పాటు హెచ్‌ఎస్ ప్రణయ్ అద్భుత ఆటతో ఆకట్టుకున్నాడు. యంగ్ సెన్సేషన్ లక్ష్యసేన్ తొలి సూపర్ 500 టైటిల్, కామన్వెల్త్ గోల్డ్ మెడల్‌తో పాటు, రెండు వరల్డ్ టూర్ టైటిల్స్‌తో సత్తా చాటాడు. తొలిసారి కామన్వెల్త్(గోల్డ్), వరల్డ్ చాంపియన్‌షిప్(బ్రాంజ్) మెడల్స్‌తో పాటు మరో 3 టైటిళ్లతో డబుల్స్ స్టార్స్ సాత్విక్, చిరాగ్ పేరు తెచ్చుకున్నారు.

సైనా, కశ్యప్‌కు కలిసి రాలేదు..
బర్మింగ్‌హామ్ కామన్వెల్త్‌లో భారత షట్లర్లు ఓవరాల్‌గా మూడు గోల్డ్ సహా 6 మెడల్స్‌తో సరికొత్త చరిత్రకు నాంది పలికారు. అయితే శ్రీకాంత్ మాత్రం బ్రాంజ్‌తో సరిపెట్టుకోవడమే లోటుగా అనిపించింది. వ్యక్తిగత టైటిల్ లేకున్నా ప్రణయ్ నిలకడైన ఆటతో ఆకట్టుకున్నాడు. ఈ సీజన్ తన చివరి పోరులో ఒలింపిక్ చాంప్, వరల్డ్ నెంబర్ వన్ అక్సెల్సెన్‌పై నెగ్గడం ప్రణయ్ కెరీర్‌లో మరిచిపోలేని విజయం. వరల్డ్ మాజీ నెంబర్ వన్ సైనా, కశ్యప్, సాయిప్రణీత్‌కు ఈ ఏడాది కలిసి రాలేదు.

జూనియర్ల జోరు..
2022లో జూనియర్ షట్లర్లు కూడా జోరు చూపెట్టారు. వరల్డ్ జూనియర్ చాంపియన్‌షిప్‌లో శంకర్ సిల్వర్ మెడల్‌తో పాటు బాయ్స్‌లో నంబర్1గా నిలిచాడు. తస్నిమ్ మిర్ గర్ల్స్‌లో నంబర్ వన్ ర్యాంక్ సాధించింది. 14 ఏళ్ల వయసులో ఉన్నతి హుడా బీడబ్ల్యూఎఫ్ టైటిల్(ఒడిశా ఓపెన్)నుగెలుచుకుంది.