ఫోటోలు: ఉపరాష్ట్రపతిని కలిసి పీవీ సింధు: షటిల్ బ్యాట్ అందజేత

హైదరాబాద్: భారత స్టార్ షట్లర్, తెలుగుతేజం పీవీ సింధు మన దేశానికి గర్వకారణమని భారత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు. ఇటీవలే జరిగిన వరల్డ్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో పీవీ సింధు స్వర్ణం గెలిచి చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే.
ఫోటో: అనుష్కలో ఎంత మార్పు!: కోహ్లీసేనతో ఫోటో దిగలేదు
ఈ నేపథ్యంలో సింధు తన కుటుంబసభ్యులతో కలిసి శనివారం ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడిని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. సింధు వెంట ఆమె తల్లిదండ్రులు కూడా ఉన్నారు. ఈ సందర్భంగా ఆమెను వెంకయ్య అభినందించారు. ఈ సందర్భంగా వెంకయ్య నాయుడు సింధుపై ప్రశంసల వర్షం కురిపించారు.
"పీవీ సింధు మన దేశానికి గర్వకారణం. ఆమె దేశంలోని యువకులందరికీ ఆదర్శం. భవిష్యత్తులో ఇలాంటి ఎన్నో విజయాలను అందుకోవాలి" అని ఆయన ఆకాంక్షించారు. ఈ క్రమంలో సింధు ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడికి షటిల్ బ్యాట్‌ని అందించారు. గత ఆదివారం జరిగిన ప్రపంచ సీనియర్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ (బీడబ్ల్యూఎఫ్) మహిళల సింగిల్స్ ఫైనల్లో పీవీ సింధు చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే.
ప్రపంచ ఐదో ర్యాంకర్ సింధు 21-7, 21-7తో ప్రపంచ నాలుగో ర్యాంకర్ నొజోమి ఒకుహారా (జపాన్)పై విజయం సాధించింది. సింధు కేవలం 38 నిమిషాల్లో ఒకుహారాను మట్టికరిపించింది. ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో స్వర్ణ పతకం గెలిచిన తొలి భారతీయురాలిగా సింధు రికార్డుల్లోకి ఎక్కింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications