ఫోటో: అనుష్కలో ఎంత మార్పు!: కోహ్లీసేనతో ఫోటో దిగలేదు

హైదరాబాద్: కోహ్లీ నాయకత్వంలోని టీమిండియా ప్రస్తుతం వెస్టిండిస్ పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. భారత్, వెస్టిండిస్ జట్ల మధ్య శుక్రవారం జమైకా వేదికగా రెండో టెస్టు ప్రారంభమైంది. అయితే, ఈ టెస్టుకు ముందు కోహ్లీ నాయకత్వంలోని టీమిండియా జమైకాలో భారత హైకమిషనర్ సేవ్లానాయక్ ఇచ్చిన విందుకు హాజరైంది.
అయితే, ఈ విందుకు కోహ్లీతో పాటు హాజరైన బాలీవుడ్ నటి, అతడి భార్య అనుష్క శర్మ హాజరయ్యారు. విందు సమయంలో అనుష్క శర్మ ఉల్లాసంగా, ఉత్సాహంగా గడుపుతూ అక్కడి అధికారులతో కరచాలనం చేసింది. అనంతరం భారత హైకమిషనర్ అధికారులతో దిగిన ఫోటో షూట్‌లో మాత్రం అనుష్క శర్మ పాల్గొనలేదు.
యుఎస్ ఓపెన్: హలెప్ ఔట్, పిన్న వయస్కురాలిగా కోరీ గాఫ్ రికార్డు

పెద్ద కారణమే
దీని వెనుక పెద్ద కారణమే ఉంది. గతేడాది టీమిండియా ఇంగ్లాండ్‌లో పర్యటించిన సంగతి తెలిసిందే. ఆ పర్యటనలో లండన్‌లోని హైకమిషన్ కార్యాలయం కోహ్లీసేనకు విందు ఏర్పాటు చేసింది. భారత జట్టులోని ఆటగాళ్లతో పాటు కోచ్, సహాయ సిబ్బంది ఈ విందుకి హాజరవగా.. కెప్టెన్ కోహ్లీతో పాటు అతని భార్య అనుష్క శర్మ కూడా అక్కడికి వెళ్లింది.

ఫొటో తీసుకునే సమయంలో
అయితే ఫొటో తీసుకునే సమయంలో కోహ్లీ, అనుష్క శర్మ మొదటి వరుసలో నిలబడగా.. వైస్ కెప్టెన్ అజ్యింకె రహానే నాలుగో వరుసలో నిలబడ్డాడు. దీంతో అభిమానులు టీమిండియా మేనేజ్‌మెంట్‌పై ఫైర్ అయ్యారు. అనుష్క శర్మకి ఇచ్చిన గౌరవం కూడా భారత్ జట్టు వైస్ కెప్టెన్‌కి ఇవ్వరా? అని తీవ్ర విమర్శలు గుప్పించారు.

అనుష్క ఏమన్నా టీమిండియా వైస్ కెప్టెనా?
"అనుష్క ఏమన్నా టీమిండియా వైస్ కెప్టెనా? జట్టులో ఆమె ఎందుకు ఉంది?" అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు. ఈ వివాదంపై చివరకు బీసీసీఐ కూడా వివరణ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి తలెత్తింది. "భారత హైకమిషన్.. క్రికెటర్లను, వారి బంధువులను ఆహ్వానించింది. ఫొటో దిగే సమయంలో ఆటగాళ్లు ప్రొటోకాల్‌ను అతిక్రమించలేదు" అని పేర్కొంది.

వివాదానికి తావివ్వకూడదనే
రహానే విషయానికొస్తే అతను ఇష్టప్రకారమే వెళ్లి వెనక నిలబడ్డాడని బీసీసీఐనే నేరుగా చెప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. చివరికు లండన్‌లోని భారత హైకమిషన్ సైతం ఇది అధికారిక విందు కాదని చెప్పడంతో వివాదం సద్దుమణిగింది. మళ్లీ అలాంటి వివాదానికి తావివ్వకూడదనే ఉద్దేశ్యంతో ఈ సారి అనుష్క ఫొటో దిగలేదని తెలుస్తోంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications