న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

స్పెయిన్‌ మాస్టర్స్‌: శ్రీకాంత్‌కు జయరామ్ షాక్.. క్వార్టర్స్‌లో సైనా, సమీర్‌

Saina Nehwal and Sameer Verma enter Barcelona Spain Masters quarterfinals, Srikanth Out

బార్సిలోనా: భారత స్టార్‌ షట్లర్‌ కిడాంబి శ్రీకాంత్‌ పేలవ ఫామ్‌ కొనసాగుతోంది. టోక్యో ఒలింపిక్స్ బెర్తే లక్ష్యంగా బార్సిలోనా స్పెయిన్ మాస్టర్స్ బరిలోకి దిగిన ఈ మాజీ వరల్డ్ నంబర్ వన్ రెండో రౌండ్‌లోనే పరాజయం పాలై టోర్నీ నుంచి నిష్క్రమించాడు.

ఒలింపిక్స్ ఆశలు సంక్లిష్టం..

ఒలింపిక్స్ ఆశలు సంక్లిష్టం..

భారత్‌కే చెందిన సహచర ఆటగాడు అజయ్‌ జయరామ్‌ అతనికి షాకిచ్చాడు. అజయ్ జయరామ్‌తో పాటు తమ తమ మ్యాచ్‌ల్లో గెలిచిన సమీర్ వర్మ, సైనా నెహ్వాల్ క్వార్టర్ ఫైనల్‌కు దూసుకెళ్లారు. గురువారం జరిగిన పురుషుల సింగిల్స్ రెండోరౌండ్‌లో 12వ ర్యాంకర్ శ్రీకాంత్‌ 6-21, 17-21తో 68వ ర్యాకర్ జయరామ్ చేతిలో ఖంగుతిన్నాడు. వరల్డ్ టూర్ స్థాయిలో శ్రీకాంత్‌పై జయరామ్‌కు ఇది తొలి విజయం. ఈ ఓటమితో టోర్నీ నుంచి నిష్క్రమించిన శ్రీకాంత్ ఒలింపిక్స్ ఆశలను మరింత సంక్లిష్టం చేసుకున్నాడు.

స్వ‌యం కృతాప‌రాధ‌ం.. దొంగ‌గా మారిన స్టార్ క్రికెటర్

సమీర్, సైనా ముందంజ..

సమీర్, సైనా ముందంజ..

మరో మ్యాచ్‌లో సమీర్‌ వర్మ 21-14, 16-21, 21-15తో కై షాఫెర్‌ (జర్మనీ)పై పోరాడి గెలిచి క్వార్టర్స్‌ చేరాడు.

మహిళల సింగిల్స్ రెండో రౌండ్‌లో సైనా నెహ్వాల్‌ 21-10, 21-19తో మరియా ఉలిటినా (ఉక్రెయిన్‌)పై అలవోక విజయాన్నందుకుంది. దీంతో రియో ఒలింపిక్స్‌లో మరియా చేతిలో ఎదురైన ఓటమికి సైనా బదులు తీర్చుకున్నట్లైంది. క్వార్టర్స్‌లో బుసానన్‌ (థాయ్‌లాండ్‌)తో తలపడనుంది.

ముగిసిన డబుల్స్ పోరాటం..

ముగిసిన డబుల్స్ పోరాటం..

మరోవైపు.. మహిళల డబుల్స్‌లో సిక్కిరెడ్డి-అశ్విని ద్వయం.. మిక్స్‌డ్‌ డబుల్స్‌లో సిక్కిరెడ్డి-ప్రణవ్‌ చోప్రా జోడీ ప్రత్యర్థుల చేతిలో ఓడి ప్రీక్వార్టర్స్‌లోనే వెనుదిరిగారు. ప్రిక్వార్టర్స్‌లో ప్రణవ్ జెర్రీ చోప్రా-సిక్కిరెడ్డి జోడీ 16-21, 21-17, 11-21తో షెవాన్ జెమీలై-సూన్ హౌల్ గౌ జోడీ చేతిలో ఓడి టోర్నీ నుంచి వైదొలిగింది.

Story first published: Friday, February 21, 2020, 9:45 [IST]
Other articles published on Feb 21, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X