న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పీబీఎల్‌లో ప్రత్యేక ఆకర్షణగా కొత్తగా పెళ్లయిన సైనా-కశ్యప్‌ జోడీ

Saina, Kashyap feel marriage will help improve their game

హైదరాబాద్: రెండు రోజుల క్రితం ప్రీమియర్‌ బ్యాడ్మింటన్‌ లీగ్‌ (పీబీఎల్‌) నాలుగో సీజన్ ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ టోర్నీలో పలు దేశాలకు చెందిన స్టార్ ప్లేయర్లు సందడి చేస్తున్నా.. కొత్తగా పెళ్లయిన సైనా, కశ్యప్‌ జంట ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది.

డిసెంబర్ 14న వివాహా బంధంతో ఒక్కటైన సైనా, కశ్యప్

డిసెంబర్ 14న వివాహా బంధంతో ఒక్కటైన సైనా, కశ్యప్

డిసెంబర్ 14న సైనా నెహ్వాల్, పారుపల్లి కశ్యప్‌ వివాహా బంధంతో ఒక్కటయ్యారు. కుటుంబ సభ్యులు, అతికొద్దిమంది అతిధులు, ఫ్యామిలీ ఫ్రెండ్స్ సమక్షంలో శుక్రవారం ఈ ఇద్దరి పెళ్లి హైదరాబాద్‌లో ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. వివాహం జరిగిన వెంటనే పీబీఎల్ టోర్నీ ప్రారంభం కావడంతో నేరుగా బరిలోకి దిగారు.

పూణెపై విజయం సాధించి బోణీ కొట్టిన అవాధె వారియర్స్

 పెళ్లి గురించిన విషయాలను

పెళ్లి గురించిన విషయాలను

ఈ సందర్భంగా వీరిద్దరూ తమ పెళ్లి గురించిన విషయాలను పంచుకున్నారు. మూడు ముళ్ల బంధంతో ఒక్కటి కావడం తమ ఆటను మరింతగా మెరుగుపరుస్తుందని సైనా-కశ్యప్‌ జోడీ ఆశాభావం వ్యక్తం చేసింది. సైనా మాట్లాడుతూ "ఒకరి గురించి ఒకరికి బాగా తెలుసు. గతంలో ఆట పరంగా ఎదురవుతున్న ఇబ్బందులపై సలహాలను ఇచ్చిపుచ్చుకునే వాళ్లం. కానీ భార్యాభర్తల బంధం మా అవగాహనను సరికొత్త స్థాయికి తీసుకెళ్లింది" అని చెప్పింది.

పెళ్లి తంతుని ఎంజాయ్ చేశానన్న సైనా నెహ్వాల్

పెళ్లి తంతుని ఎంజాయ్ చేశానన్న సైనా నెహ్వాల్

పెళ్లి తంతు అనగానే తొలుత కష్టమనిపించినా, ఆ తర్వాత ఎంజాయ్‌ చేశానని సైనా పేర్కొంది. పెళ్లి తర్వాత ఇద్దరం కలసి ఆడడానికి పీబీఎల్‌ కంటే మంచి ఈవెంట్‌ లేదని సైనా తెలిపింది. ఇక, కశ్యప్ మాట్లాడుతూ ఇద్దరి మధ్య మంచి కెమిస్ట్రీ ఉన్నా.. అది ప్రేమగా ఎప్పుడు రూపుదిద్దుకుందో తమకే తెలియలేదని చెప్పుకొచ్చాడు. దాని తర్వాత వివాహం గురించి పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేకుండా పోయిందని అన్నాడు.

నార్త్‌ ఈస్ట్రన్‌ వారియర్స్‌కు కెప్టెన్‌గా సైనా

నార్త్‌ ఈస్ట్రన్‌ వారియర్స్‌కు కెప్టెన్‌గా సైనా

పీబీఎల్‌లో నార్త్‌ ఈస్ట్రన్‌ వారియర్స్‌కు సైనా నెహ్వాల్ కెప్టెన్‌గా ఉండగా పారుపల్లి కశ్యప్ అవధె వారియర్స్ జట్టు తరుపున ప్రాతనిథ్యం వహిస్తున్నాడు. పీబీఎల్ నాలుగో సీజన్ మొత్తం 23 రోజుల పాటు ఐదు వేదికల్లో మ్యాచ్‌లు జరుగనున్నాయి. ఇందులో అహ్మదాబాద్, పుణే తొలిసారి ఆతిథ్యం ఇవ్వనున్నాయి. బెంగళూరులో జనవరి 13న జరిగే ఫైనల్‌తో టోర్నీ ముగియనుంది.

Story first published: Tuesday, December 25, 2018, 13:53 [IST]
Other articles published on Dec 25, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X