న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పూణెపై విజయం సాధించి బోణీ కొట్టిన అవాధె వారియర్స్

PBL: Awadhe Warriors edges out Pune 7 Aces in a thriller

ముంబై: ప్రీమియర్‌ బ్యాడ్మింటన్‌ లీగ్‌ నాలుగో సీజన్‌లో అవధె వారియర్స్‌ శుభారంభం చేసింది. సోమవారం పుణె 7 ఏసెస్ జట్టుతో హోరాహోరీగా సాగిన మ్యాచ్‌లో 4-3 స్కోరుతో విజయం సాధించి టోర్నీలో తొలి విజయాన్నందుకుంది. 3-3 స్కోరుతో సమంగా ఉన్న దశలో ఒత్తిడిని తట్టుకుని మిక్స్‌డ్ డబుల్స్‌లో అశ్విని పొన్నప్ప, మథియాస్ జోడీ 15-8,11-15,15-12 స్కోరుతో పుణె జోడీ వ్లాదిమిర్ ఇవనోవ్, లినే మార్క్ జోడీని ఓడించి అవధె జట్టుకు గెలుపు సాధించి పెట్టారు. తొలిమ్యాచ్‌లో హైదరాబాద్ హంటర్స్ చేతిలో ఓడి పోయిన పుణె జట్టుకు ఇది వరుసగా రెండో పరాజయం.

బీవెన్‌ జాంగ్‌పై విజయం సాధించి ఆధిక్యాన్ని

బీవెన్‌ జాంగ్‌పై విజయం సాధించి ఆధిక్యాన్ని

పుణెకిది వరుసగా రెండో ఓటమి. తొలి పురుషుల సింగిల్స్‌ మ్యాచ్‌ను అవధె వారియర్స్‌ ట్రంప్‌ మ్యాచ్‌గా ఎన్నుకుంది. ఆ మ్యాచ్‌లో సన్‌ వాన్‌ హో 15-14, 15-7 తేడాతో లెవర్‌డెజ్‌పై గెలుపొంది జట్టుకు ఆధిక్యాన్ని అందించాడు. పురుషుల డబుల్స్‌లో యాంగ్ లీ, క్రిస్టియాన్ మథియాస్ జోడీ 15-12,15-14 స్కోరుతో పుణె 7 ఏసెస్ జోడీ వ్లాదిమిర్ ఇవనోవ్, మథియాస్ బోను ఓడించారు. దీంతో ఇరుజట్లూ 2-2 స్కోరుతో సమంగా నిలిచాయి. పుణె 7 ఏసెస్‌ ట్రంప్‌ మ్యాచ్‌గా ఎన్నుకున్న మహిళల సింగిల్స్‌ మ్యాచ్‌లో మారీన్‌ 15-13, 15-9తో బీవెన్‌ జాంగ్‌పై విజయం సాధించి ఆధిక్యాన్ని 2-3కు తగ్గించింది.

పీబీఎల్: ఢిల్లీపై ముంబై 5-0తో ఘన విజయం, సైనా జట్టుకు నిరాశే

పురుషుల సింగిల్స్‌లో లక్ష్యసేన్ స్కోరుతో

పురుషుల సింగిల్స్‌లో లక్ష్యసేన్ స్కోరుతో

తొలిమ్యాచ్‌లో హైదరాబాద్ హంటర్స్ చేతిలో పుణె ఓడిన విషయం తెలిసిందే. తొలుత మ్యాచ్‌లో పుణె 7 ఏసెస్‌దే ఆధిపత్యం. మహిళల సింగిల్స్‌లో అవధె జట్టు షట్లర్ బీవెన్ జాంగ్‌ను 15-13,15-9 స్కోరుతో వరుసగేముల్లో కరోలినా మారిన్ ఓడించింది. ఈ సీజన్ తొలి మ్యాచ్‌లో పీవీ సింధు చేతిలో ఓటమితో ఎంతో ఒత్తిడితో రెండో మ్యాచ్‌లో బరిలోకి దిగిన మారిన్ తన పూర్తిస్థాయి సత్తాను ప్రదర్శించింది. బీవెన్ జాంగ్ ఎంత ప్రయత్నించినా.. మారిన్ జోరును అడ్డుకోవడంలో విఫలమైంది. కాగా, పురుషుల సింగిల్స్‌లో భారత యువ షట్లర్ లక్ష్యసేన్ 15-11,15-8 స్కోరుతో ప్రపంచ 27వ ర్యాంకర్ డాంగ్ కున్ లీని చిత్తు చేశాడు.

అవధె వారియర్స్ జట్టు సీజన్‌లో బోణీ

అవధె వారియర్స్ జట్టు సీజన్‌లో బోణీ

దీంతో పుణె ఏసెస్ జట్టు 3-0 పాయింట్ల ఆధిక్యంతో విజయం దిశగా సాగింది. ఇక్కడ నుంచి కథ అడ్డం తిరిగింది. పురుషుల సింగిల్స్‌లో భాగంగా ప్రపంచ 5వ నంబర్ ఆటగాడు సన్ వాన్ హో ఆడే మ్యాచ్‌ను అవధె వారియర్స్ జట్టు ట్రంప్ మ్యాచ్‌గా ఎంచుకుంది. జట్టు అంచనాలకు తగినట్లుగానే బ్రైస్ లావెర్డెజ్‌పై 15-14,15-7 స్కోరుతో సన్ విజయం సాధించిపెట్టాడు. ట్రంప్ మ్యాచ్‌లో విజయంతో అవధె జట్టుకు 2 పాయింట్లు సమకూరాయి. కీలకమైన మిక్స్‌డ్ డబుల్స్ మ్యాచ్‌లో విజయం నమోదు చేసిన అవధె వారియర్స్ జట్టు సీజన్‌లో బోణీ కొట్టింది.

హైదరాబాద్‌లో బ్యాడ్మింటన్‌ సందడి

హైదరాబాద్‌లో బ్యాడ్మింటన్‌ సందడి

పీబీఎల్‌ హైదరాబాద్‌ అభిమానుల్ని అలరించేందుకు సిద్ధమైంది. మంగళవారం నుంచి డిసెంబరు 28 వరకు గచ్చిబౌలి స్టేడియంలో పీబీఎల్‌ సందడి చేయనుంది. మంగళవారం పీవి సింధు కెప్టెన్సీలోని డిఫెండింగ్‌ ఛాంపియన్‌ హైదరాబాద్‌ హంటర్స్‌.. సుంగ్‌ హ్యున్‌ నేతృత్వంలోని చెన్నై స్మాషర్స్‌తో తలపడుతుంది.

Story first published: Tuesday, December 25, 2018, 10:41 [IST]
Other articles published on Dec 25, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X