న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

BWF World Tour Finals 2021: శుభారంభం దక్కలేదు.. ఫస్ట్ మ్యాచ్‌లోనే సింధు, శ్రీకాంత్ ఓటమి!

PV Sindhu suffers defeat in first outing after close-fought battle against Tai Tzu-ying

బ్యాంకాక్‌: కరోనా తర్వాత మొదలైన బ్యాడ్మింటన్ టోర్నీలు.. తెలుగు ప్లేయర్లకు కలిసి రావడం లేదు. సుదీర్ఘ విరామం తర్వాత బరిలోకి దిగి.. అంచనాలు అందుకోలేకపోతున్నారు. ప్రతిష్టాత్మక వరల్డ్‌ టూర్‌ ఫైనల్స్‌ బ్యాడ్మింటన్‌ టోర్నీలో భారత స్టార్‌ షట్లర్లు పీవీ సింధు, కిడాంబి శ్రీకాంత్‌లకు శుభారంభాన్ని అందుకోలేకపోయారు. బుధవారం మొదలైన ఈ మెగా ఈవెంట్‌లో మహిళల, పురుషుల సింగిల్స్‌ తొలి రౌండ్‌ లీగ్‌ మ్యాచ్‌ల్లోనే ఇద్దరికీ ఓటమి ఎదురైంది. మహిళల సింగిల్స్‌ గ్రూప్‌ 'బి'లో ప్రపంచ ఏడో ర్యాంకర్, ప్రస్తుత వరల్డ్‌ చాంపియన్‌ సింధు 21-19, 12-21, 17-21తో ప్రపంచ నంబర్‌వన్‌ తై జు యింగ్‌ (చైనీస్‌ తైపీ) చేతిలో పరాజయం పాలైంది.

హోరా హోరీ..

హోరా హోరీ..

59 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సింధు తొలి గేమ్‌ లో గెలిచినా ఆ తర్వాత అదే జోరు కనబర్చలేకపోయింది. రెండో గేమ్‌లో వరుసగా ఐదు పాయింట్లు కోల్పోయి 0-5 తో వెనుకబడిన సింధు ఆ తర్వాత కోలుకోలేకపోయింది. నిర్ణాయక మూడో గేమ్‌ ఆరంభంలో ఇద్దరు ప్రతి పాయింట్‌ కోసం పోరాడటంతో ఆట హోరాహోరీగా సాగింది. ఒకదశలో సింధు 13-14తో తై జు యింగ్‌ ఆధిక్యాన్ని ఒక పాయింట్‌కు తగ్గించింది. ఈ దశలోనే తై జు వరుసగా మూడు పాయింట్లు సాధించి 17-13తో ఆధిక్యంలోకి వెళ్లింది. చివరిదాకా ఈ ఆధిక్యాన్ని కాపాడుకున్న తై జు యింగ్‌ విజయాన్ని ఖాయం చేసుకుంది.

అనవసర తప్పిదాలతో..

అనవసర తప్పిదాలతో..

ఇక పురుషుల సింగిల్స్‌ గ్రూప్‌ 'బి' మ్యాచ్‌లో ప్రపంచ మాజీ నంబర్‌వన్‌ శ్రీకాంత్‌ 21-15, 16-21, 18-21తో ప్రపంచ మూడో ర్యాంకర్‌ ఆండెర్స్‌ ఆంటోన్సెన్‌ (డెన్మార్క్‌) చేతిలో ఓటమి చవిచూశాడు. 77 నిమిషాల పాటు జరిగిన ఈ మ్యాచ్‌లో శ్రీకాంత్‌ కీలకదశలో తప్పిదాలు చేశాడు. నిర్ణాయక మూడో గేమ్‌లో 17-16తో ఆధిక్యంలోకి వెళ్లిన శ్రీకాంత్‌ ఈ దశలో వరుసగా నాలుగు పాయింట్లు సమర్పించుకొని తేరుకోలేకపోయాడు. తై జు యింగ్‌ చేతిలో సింధుకిది 13వ ఓటమికాగా... ఆంటోన్సెన్‌ చేతిలో శ్రీకాంత్‌కు రెండో పరాజయం.

 సెమీఫైనల్ ఆశలు..

సెమీఫైనల్ ఆశలు..

నేడు(గురువారం) జరిగే రెండో రౌండ్‌ లీగ్‌ మ్యాచ్‌ల్లో ప్రపంచ మాజీ చాంపియన్‌ ఇంతనోన్‌ రచనోక్‌ (థాయ్‌లాండ్‌)తో సింధు... వాంగ్‌ జు వె (చైనీస్‌ తైపీ)తో శ్రీకాంత్‌ ఆడతారు. సెమీఫైనల్‌ ఆశలు సజీవంగా ఉండాలంటే ఈ మ్యాచ్‌ల్లో సింధు, శ్రీకాంత్‌ గెలవాల్సి ఉంటుంది. ఓడిన తన ఆటపై సింధు సంతృప్తి వ్యక్తం చేసింది. మ్యాచ్ అనంతరం మాట్లాడుతూ.. 'మ్యాచ్‌ బాగా జరిగింది. ఏ పాయింట్‌ కూడా సులువుగా రాలేదు. మూడో గేమ్‌లో ఇద్దరి మధ్య పాయింట్ల అంతరం ఒక పాయింట్‌కు చేరుకుంది కూడా. అయితే ర్యాలీల సందర్భంగా రెండుసార్లు నా రాకెట్‌ స్ట్రింగ్స్‌ దెబ్బతినడం తుది ఫలితంపై ప్రభావం చూపింది' అని సింధు వ్యాఖ్యానించింది.

Story first published: Thursday, January 28, 2021, 9:07 [IST]
Other articles published on Jan 28, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X