న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

PV Sindhu:ఒలింపిక్స్ తర్వాత గ్లామర్ డోస్ పెంచిన బ్యాడ్మింటన్ స్టార్! లేటేస్ట్ పిక్స్ ఇవే!

PV Sindhu Latest Glamorous

హైదరాబాద్: టోక్యో ఒలింపిక్స్ విజయం తర్వాత భారత బ్యాడ్మింటన్ స్టార్, బ్రాంజ్ మెడలిస్ట్ పీవీ సింధు గ్లామర్ డోస్ పెంచింది. ప్రస్తుతం విశ్వక్రీడల విజయాన్ని ఆస్వాదిస్తున్న ఈ తెలుగు తేజం.. వరుసగా సన్మాన కార్యక్రమాలు అందుకుంటూ దిగ్గజాల ప్రశంసలు పొందుతూ బిజీగా గడుపుతోంది. ఈ క్రమంలోనే తన అందంపై కూడా కొంచెం ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ వేదికగా సింధు షేర్ చేసిన ఫొటోలే ఈ విషయాన్ని తెలియజేస్తున్నాయి. ఈ ఫొటోల్లో సింధు చీరకట్టులో కనిపించి అభిమానులను కనువిందు చేసింది. గ్లామర్ డోస్ పెంచి మరీ సింధు ఫొటో షూట్ తీయించుకున్నట్లు ఫొటోలు చూస్తే అర్థమవుతోంది. ఈ ఫొటోలు నెట్టింట హల్‌‌చల్ చేస్తున్నాయి. పెళ్లి కోసమే ఫొటో షూటా? అంటూ అభిమానులు సరదాగా కామెంట్ చేస్తున్నారు.

సమంత ఫిదా..

మరికొందరూ సినిమాల్లో ఏమైనా ఎంట్రీ ఇస్తారా? అని ప్రశ్నిస్తున్నారు. ఇంకొందరేమో బ్యూటీ సంబంధించిన ప్రొడక్ట్స్‌కు ప్రచారకర్తగా ఉండనున్నారేమోనని కామెంట్ చేస్తున్నారు. సింధు చీరకట్టుకు మాములు అభిమానులే కాకుండా సెలెబ్రిటీలు ఫీదా అవుతున్నారు. సౌతిండియన్ స్టార్ హీరోయిన్ అక్కినేని సమంత సైతం సింధు చీరకట్టకు ముగ్దురాలైంది. ఆమె ఫొటోలకు లవ్ సింబల్స్‌తో కామెంట్ చేసింది. ఇవేకాకుండా పలు సన్మాన కార్యక్రమాల్లో పాల్గొనే విషయంలోనూ సింధు తన డ్రెస్సింగ్ విషయంలో ప్రత్యేక శ్రద్ద తీసుకుంటుంది. తన అభినయంతో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది.

మెగాస్టార్‌తో మెరిసిన తెలుగు తేజం..

తాజాగా టాలీవుడ్ మెగా స్టార్ చిరంజీవి ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమంలో పాల్గొన్న సింధు మోడర్న్‌లుక్‌లో మెరిసింది. ఈ కార్యక్రమానికి అలనాటి తారలంతా హాజరవ్వగా.. సింధు తన డ్రెస్సింగ్‌తో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ప్రస్తుతం ఈ కార్యక్రమానికి సంబంధించిన సింధు ఫొటోలు వైరల్‌గా మారాయి. ఒలింపిక్స్ విజయం తర్వాత సింధు మేడమ్ గ్లామర్ డోస్ పెంచిందంటూ అభిమానులు కామెంట్ చేస్తున్నారు.

చైనా ప్లేయర్‌ను ఓడించి..

టోక్యో ఒలింపిక్స్ బ్రాంజ్ మెడల్ ఫైట్‌లో సింధు 21-13, 21-15 తేడాతో వరుస సెట్లలో చైనా ప్లేయర్ హి బింగ్జియావోను చిత్తు చేసింది. దాంతో వరుసగా రెండో ఒలింపిక్స్‌లో పతకం సాధించిన భారత తొలి మహిళా క్రీడాకారిణిగా సింధు రికార్డుకెక్కింది. 2016 రియో ఒలింపిక్స్‌లో సింధు రజత పతకం సాధించిన విషయం తెలిసిందే. సెమీఫైనల్లో ఓడినప్పటికీ ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకుండా పట్టుదలతో ఆడిన తెలుగు తేజం బ్రాంజ్ మెడల్ పోరులో ఘన విజయాన్ని అందుకుని త్రివర్ణ పతాకాన్ని రెపరెపలాడించింది.

ప్రధానితో ఐస్‌క్రీమ్..

ప్రధానితో ఐస్‌క్రీమ్..

వారం క్రితం(ఆగస్టు 16) టోక్యో ఒలింపిక్స్‌ 2020 క్రీడాకారులకు ప్రధాని మోదీ తన నివాసంలో అల్పాహార విందును ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ప్రతి అథ్లెట్లతో ప్రధాని ప్రత్యేకంగా ముచ్చటించారు. చాలా సమయం ఆటగాళ్లతో గడిపారు. పతకాలు తెచ్చిన వారినే కాకుండా అత్యుత్తమ ఆటతీరు కనబరిచిన వారిని, మెగా క్రీడల్లో ఆడిన అథ్లెట్లను ఆయన అభినందించారు. ముందుగా ఇచ్చిన మాట ప్రకారం షట్లర్ పీవీ సింధుకు ఐస్‌క్రీం, జావెలిన్ త్రోయ‌ర్ నీరజ్‌ చోప్రాకు చుర్మా తినిపించారు. టోక్యో ఒలింపిక్స్‌లో భారత్‌కు రికార్డు స్థాయిలో ఏడు మెడల్స్ వచ్చాయి. జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా స్వర్ణం గెలవగా.. వెయిలిఫ్ట‌ర్ మీరాభాయి చాను, రెజ్లర్ రవి దహియా రజత పతకాలు సాధించారు. భారత పురుషుల హాకీ టీమ్, పీవీ సింధు, బాక్సర్ లవ్లీనా, రెజ్లర్ బజరంగ్ పునియా కాంస్యపతకాలు అందుకున్నారు.

Story first published: Saturday, August 21, 2021, 21:31 [IST]
Other articles published on Aug 21, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X