న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఎక్కువగా ఆలోచించట్లేదు.. ఒలింపిక్స్‌కు అర్హత సాధించడమే ప్రధాన లక్ష్యం

My main target is to qualify for olympics says Sai praneeth

హైదరాబాద్: వీలయినన్ని ఎక్కువ టోర్నీలు గెలవాలి. ఒలింపిక్స్‌కు అర్హత సాధించడమే నా ప్రధాన లక్ష్యం. అంతకు మించి ఎక్కువగా ఆలోచించట్లేదు అని తెలుగుతేజం భమిడిపాటి సాయి ప్రణీత్‌ పేర్కొన్నారు. ప్రపంచ బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షిప్‌ పురుషుల విభాగంలో 36 ఏళ్ల నిరీక్షణ తర్వాత ప్రణీత్‌ భారత్‌కు పతకం అందించిన విషయం తెలిసిందే. జాతీయ క్రీడల దినోత్సవం రోజు అర్జున అవార్డు అందుకోనున్న సాయి ప్రణీత్‌ తాజాగా మీడియాతో మాట్లాడారు.

ఛాంపియన్‌షిప్‌ కోసం సింధు జిమ్‌లో ఎలాంటి వర్కౌట్లు చేసిందంటే!! (వీడియో)ఛాంపియన్‌షిప్‌ కోసం సింధు జిమ్‌లో ఎలాంటి వర్కౌట్లు చేసిందంటే!! (వీడియో)

పదేళ్ల కష్టం:

పదేళ్ల కష్టం:

'ఈ సంవత్సరం బాగా సాగింది. కొన్ని పెద్ద మ్యాచ్‌లలో విజయం సాధించా. అర్జున అవార్డు కోసం బుధవారం ఢిల్లీకి కూడా వెళుతున్నా. చాలా సంతోషంగా ఉంది. అయితే చాంపియన్‌షిప్‌లో పతకం గెలవడం మరింత ఆనందాన్ని ఇస్తోంది. ప్రకాష్‌ పదుకోన్‌ సార్‌ తర్వాత ప్రపంచ చాంపియన్‌షిప్‌ పతకం నాకు దక్కడం అదృష్టంగా భావిస్తున్నా. దీని వెనుక పదేళ్ల కష్టం దాగి ఉంది' అని ప్రణీత్‌ తెలిపారు.

 సాధించావ్‌ సాయి:

సాధించావ్‌ సాయి:

'2015లో గాయాలబారిన పడి కొంతకాలం ఆటకు దూరంగా ఉన్నప్పుడు ఆందోళన పడ్డా. ఆ సమయంలో అమ్మానాన్నలు, కోచ్‌ గోపీచంద్‌ నన్ను ఉత్తేజపరిచారు. వారిచ్చిన ప్రోత్సాహంతోనే మెడల్‌ సాధించే స్థాయికి చేరుకున్నా. చాలా మంది అభినందించారు. కానీ.. క్వార్టర్స్‌లో విజయం సాధించగానే గోపీ సార్ 'సాధించావ్‌ సాయి' అన్న మాటే నాకు బెస్ట్‌ కాంప్లిమెంట్‌. సాధారణంగా గోపీ సార్‌ ప్రశాంతంగా ఉంటారు. క్వార్టర్స్‌ మ్యాచ్‌ సాగుతున్నప్పుడు మాత్రం చాలా ఉద్వేగంగా కనిపించారు' అని ప్రణీత్‌ పేరొన్నారు.

మొమోటా ఆధిపత్యానికి చెక్ పెడతాం:

మొమోటా ఆధిపత్యానికి చెక్ పెడతాం:

'సెమీస్ మ్యాచులో ఎలాంటి ఒత్తిడికి లోనుకాలేదు. ఎందుకంటే ఈ ఏడాదే మొమోటాతో రెండుసార్లు తలపడ్డా. అంతర్జాతీయ పోటీల్లో దాదాపు ప్రధాన టోర్నీలు అన్ని మొమోటానే గెలుస్తున్నాడు. మాకంటే అతడు మెరుగ్గా ఆడుతున్నాడు. సింధు, సైనా ఎలాగైతే యమగూచి, తైజు యింగ్‌ మీద పైచేయి సాధించారో.. నేను, శ్రీకాంత్‌ కూడా మొమోటా ఆధిపత్యానికి చెక్ పెడతాం. ఇది త్వరలోనే జరుగుతుంది' అని ప్రణీత్‌ అన్నారు.

85 ఏళ్ల వయసులో రిటైర్మెంట్‌ ప్రకటించిన వెస్టిండీస్ ఫాస్ట్ బౌలర్!!

ఒలింపిక్స్‌కు అర్హత సాదించాలి:

ఒలింపిక్స్‌కు అర్హత సాదించాలి:

'ఒలింపిక్స్‌కు అర్హత సాధించడమే నా ప్రధాన లక్ష్యం. అంతకు మించి ఎక్కువగా ఆలోచించట్లేదు. అయితే వీలయినన్ని ఎక్కువ టోర్నీలు గెలవాలి. నా స్నేహితులు రెండు టోర్నీలు గెలిస్తే.. నేను మరింత శ్రమించాలి. ప్రస్తుతం నా దృష్టి అంతా మంచి ప్రదర్శన చేసి ఒలింపిక్స్‌కు అర్హత సాదించాలి. అంతకు మించి ఎక్కువగా ఆలోచించట్లేదు' అని ప్రణీత్‌ చెప్పుకొచ్చారు.

Story first published: Wednesday, August 28, 2019, 13:31 [IST]
Other articles published on Aug 28, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X