85 ఏళ్ల వయసులో రిటైర్మెంట్ ప్రకటించిన వెస్టిండీస్ ఫాస్ట్ బౌలర్!!

లండన్: ఒక క్రికెటర్ గరిష్టంగా 40 ఏళ్ల వయసు వరకు క్రికెట్ ఆడుతారు. లేదా ఇంకో రెండుమూడేళ్లు కొనసాగుతారు. ఆ తర్వాత మాత్రం రిటైర్మెంట్ ప్రకటించేస్తారు. కానీ వెస్టిండీస్ ఫాస్ట్ బౌలర్ సెసిల్ రైట్ దాదాపు 85 ఏళ్ల వయసులో ఎట్టకేలకు క్రికెట్‌కు వీడ్కోలు పలికారు. రెండు వారాల్లో 85వ వసంతంలోకి అడుగు పెడుతుండటంతో క్రికెట్‌కు గుడ్ బై చెపుతున్నట్టు ప్రకటించారు. రైట్ సెప్టెంబర్ 7న చివరి మ్యాచ్ ఆడి వీడ్కోలు తీసుకుంటారు.

గ్యారీ సోబర్స్‌కు ప్రత్యర్థిగా:
ఫాస్ట్ బౌలరైన రైట్.. మొదట బార్బడోస్‌తో మ్యాచ్‌లో జమైకాకు ప్రాతినిధ్యం వహించాడు. వెస్టిండీస్ దిగ్గజం గ్యారీ సోబర్స్‌కు ప్రత్యర్థిగా కూడా తలపడ్డాడు. అయితే 1959లో ఇంగ్లాండ్ వెళ్లి సెంట్రల్ లాంకాషైర్ తరపున ఆడాడు. కాబోయే భార్య ఎనిడ్‌ను కలిసిన తరువాత అక్కడే ఉండాలనుకున్నాడు. ఇక ఎనిద్‌ను పెళ్లాడి ఇంగ్లాండ్‌లోనే స్థిరపడ్డాడు. వీరికి ఓ కుమారుడు ఉన్నాడు.

కెరీర్ చాలా బాగుంది:
సుదీర్ఘ కాలంగా క్రికెట్ ఆడటానికి గల కారణాలను రైట్ తెలిపారు. రైట్ మాట్లాడుతూ... 'కెరీర్ చాలా బాగుంది. ఇంత సుదీర్ఘంగా కొనసాగడానికి కారణాలేంటో నాకు తెలుసు. కానీ వాటిని మీకు చెప్పను. నచ్చిన ప్రతి ఆహారాన్ని తినేవాడిని. మద్యం ఎక్కువగా తాగను. సందర్భానుసారంగా ఎప్పుడో ఓసారి ఒక బీర్ తీసుకుంటా. ఎప్పుడూ ఫిట్‌గా ఉంటా' అని రైట్ పేర్కొన్నారు. సెప్టెంబర్ 7న పెన్నీ లీగ్‌లో అప్పర్‌మిల్ తరఫున స్ప్రింగ్‌హెడ్‌పై మ్యాచ్ ఆడి రైట్ వీడ్కోలు తీసుకుంటారు.

60 ఏళ్ల కెరీర్‌లో 7000 వికెట్లు:
'ఈ మధ్య కాలంలో నా వయసును సాకుగా చూపి ప్రాక్టీస్ చేయడం లేదు. అయితే ఇంట్లో కూర్చొని ఖాళీగా టీవీ చూడటం నాకిష్టం ఉండదు. బయటకెళ్లి ఏదో ఓ పని చేయడం ఇష్టం' అని రైట్ తెలిపారు. వెస్టిండీస్ దిగ్గజాలు వివ్ రిచర్డ్స్, గ్యారీ సోబర్స్, జోయెల్ గార్నర్, ఫ్రాంక్ వోరెల్‌తో కలిసి రైట్ ఆడారు. తన 60 ఏళ్లకు పైగా కెరీర్‌లో 7000కు పైగా వికెట్లు తీశాడు. ఒకానొక సమయంలో ఐదు సీజన్లలో 538 వికెట్లు తీసి సంచలనం సృష్టించారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications
దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్.. మిథాలీకి చోటు దక్కేనా?