క్లే కోర్టు సీజన్‌కు ఫెదరర్ దూరం: నాదల్ సంచలన వ్యాఖ్యలు

Posted By:
World Number 1 Rafael Nadal Takes a Dig at Roger Federer for Skipping Clay Court Season

హైదరాబాద్: ఈ ఏడాది క్లే కోర్టులో రోజర్ ఫెదరర్ ఆడనని చెప్పడాన్ని టెన్నిస్‌ వరల్డ్ నంబర్‌వన్ రఫెల్ నాదల్ తప్పుబట్టాడు. క్లే కోర్టుపై తనతో ఆడటానికి రోజర్ ఫెదరర్ భయపడతాడని, అందుకే ఇలా ఆడకుండా తప్పించుకుంటున్నాడని రఫెల్ నాదల్ సంచలన వ్యాఖ్యలు చేశాడు.

మాంటె కార్లో మాస్టర్స్ టోర్నీతో ఈ ఏడాది క్లే కోర్టు సీజన్ ప్రారంభం కాబోతుంది. ఈ ఏడాది క్లే కోర్టు సీజన్‌కు దూరంగా ఉంటానన్న ఫెదరర్ నిర్ణయంపై తాజాగా నాదల్ మాట్లాడుతూ 'మట్టి కోర్టులో నాతో ఐదు సెట్ల పాటు ఫైట్ చేయడానికి ఇష్టపడతానని అతను ఎన్నోసార్లు చెప్పాడు. దీంతో ఈసారి రోలాండ్ గారోస్‌లో ఆడతాడని అనుకున్నా. కానీ మళ్లీ ఆడనని ప్రకటించాడు. అక్కడే నాకు కొన్ని అనుమానాలు ఉన్నాయి' అని నాదల్ అన్నాడు.

వరుసగా రెండో ఏడాది కూడా ఫెదరర్ క్లే కోర్టు సీజన్‌కు దూరం కానున్నాడు. గాయం కారణంగా చాలా రోజులుగా టెన్నిస్‌కు దూరంగా ఉన్న రఫెల్ నాదల్ ఈ మాంటె కార్లోతో మళ్లీ కోర్టులో అడుగుపెట్టబోతున్నాడు. మాంటె కార్లో మాస్టర్స్ ట్రోఫీని రఫెల్ నాదల్ ఇప్పటివరకు పది సార్లు గెలిచాడు. మరోవైపు ఈ క్లే కోర్టులో రోజర్ ఫెదరర్‌పై నాదల్ మెరుగైన రికార్డుని కలిగి ఉన్నాడు.

క్లే కోర్టులో నాదల్ ఇప్పటివరకు 53 టైటిల్స్ గెలిచాడు. ఇక, ఫ్రెంచ్ ఓపెన్‌ విషయానికి వస్తే రఫెల్ నాదల్‌కు తిరుగులేని రికార్డు ఉంది. ఫ్రెంచ్ ఓపెన్‌లో వీరిద్దరి మధ్య 15 మ్యాచులు జరగ్గా నాదల్ 13 మ్యాచ్‌ల్లో విజయం సాధించాడు. గతేడాది క్లే కోర్టు సీజన్‌కు దూరంగా ఉన్న ఫెదరర్ ఆ తర్వాత గ్రాస్‌కోర్టు సీజన్‌కు తిరిగి రావడం వింబుల్డన్ నెగ్గడం తెలిసిందే.

Story first published: Tuesday, April 17, 2018, 14:26 [IST]
Other articles published on Apr 17, 2018

Mykhel బ్రేకింగ్ అలర్ట్స్ పొందండి