న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Wimbledon 2021: 39 ఏళ్ల వ‌య‌సులో రోజ‌ర్ ఫెద‌ర‌ర్ అరుదైన రికార్డు.. ఓపెన్ ఎరాలో ఒకేఒక్కడు!!

Wimbledon 2021: Roger Federer Becomes The Oldest Player In Open Era To Reach Quarter Finals

లండన్: ఎనిమిదిసార్లు ఛాంపియన్‌, టెన్నిస్ దిగ్గజం రోజర్‌ ఫెదరర్‌ (స్విట్జర్లాండ్‌) అరుదైన రికార్డు నెలకొల్పాడు. వింబుల్డ‌న్ ఓపెన్ ఎరాలో 39 ఏళ్ల వ‌య‌సులో క్వార్ట‌ర్స్‌కు చేరిన తొలి ఆట‌గాడిగా ఫెద‌ర‌ర్ రికార్డు నెలకొల్పాడు. వింబుల్డ‌న్ 2021లో ఇట‌లీకి చెందిన లోరెంజో సొనేగాపై గెలిచి ఈ ఘనత అందుకున్నాడు. 1968లో ఓపెన్ ఎరా ప్రారంభమైనప్పటి నుంచి వింబుల్డన్ క్వార్టర్ ఫైనల్‌కు చేరుకున్న అతి పెద్ద వయసు ఆట‌గాడు ఫెద‌ర‌రే. మరో ఐదు వారాలు అయితే ఫెదరర్‌కు 40వ పడిలోకి అడుగెడతాడు.

సోమ‌వారం జ‌రిగిన ప్రిక్వార్టర్స్ మ్యాచ్‌లో రోజర్‌ ఫెద‌ర‌ర్ 7-5, 6-4, 6-2 స్కోర్ తేడాతో లోరెంజో సొనేగా (ఇట‌లీ)పై అల‌వోక విజ‌యం సాధించాడు. 39 ఏళ్ల ఫెద‌ర‌ర్.. వింబుల్డ‌న్ టోర్నీలో ఆర‌వ సీడ్‌గా బ‌రిలోకి దిగాడు. మోకాలి స‌ర్జ‌రీ కారణంగా ఇటీవ‌ల పెద్ద‌గా ఆట‌ను ప్ర‌ద‌ర్శించ‌లేక‌పోతున్న ఫెద‌ర‌ర్.. త‌న ఫెవ‌రేట్ గ్రాస్‌ కోర్టుపై మాత్రం చెల‌రేగిపోతున్నాడు. వింబుల్డ‌న్‌లో రికార్డు స్థాయిలో 18వ సారి ఫెద‌ర‌ర్ క్వార్ట‌ర్స్‌కు చేరాడు.

Sri Lanka vs India: మనీశ్‌, సూర్యకుమార్‌ హాఫ్ సెంచరీలు.. ధావన్ సేనపై భువీ జట్టుదే విజయం!!Sri Lanka vs India: మనీశ్‌, సూర్యకుమార్‌ హాఫ్ సెంచరీలు.. ధావన్ సేనపై భువీ జట్టుదే విజయం!!

2 గంటల 11 నిమిషాల పాటు సాగిన ఈ మ్యాచ్​లో రోజర్‌ ఫెదరర్​​కు ప్రత్యర్థి లోరెంజో సొనేగా నుంచి మొదట్లో కాస్త ప్రతిఘటన ఎదురైంది. తొలి సెట్​లో 5-5తో ఇరువురు సమానంగా ఉన్నప్పుడు వర్షం ప్రారంభమైంది. దీంతో మ్యాచ్ 20 నిమిషాలు నిలిచిపోయింది. అనంతరం కోర్టులోకి దిగిన ఫెడెక్స్.. వెనక్కి తిరిగి చూడలేదు. పాత ఫెదరర్​ను గుర్తుకుతెచ్చాడు. తనలో ఇంకా సత్తా తగ్గలేదని చాటి చెప్పాడు. చివరి రెండు సెట్లను సునాయాసంగా గెలిచి మ్యాచును సొంతంచేసుకున్నాడు. క్వార్ట‌ర్స్‌లో ఫెడెక్స్ డానియల్ మెద్వెదెవ్​, లేదా హుబెర్ట్​ హుర్కాజ్తో తలపడనున్నాడు.

కెనడియన్ ఫెలిక్స్ అగర్ అలియాసిమ్ చేతిలో 6-4, 7-6 (6), 3-6, 3-6, 6-4తో జ్వెరెవ్ పోరాడి ఓడిపోయాడు. ఐదు సెట్ల పటు హోరాహోరీగా మ్యాచ్ సాగింది. రెండుసార్లు డిఫెండింగ్‌ ఛాంపియన్‌, టాప్‌ సీడ్‌ నొవాక్‌ జకోవిచ్‌ (సెర్బియా) 12వసారి క్వార్టర్‌ ఫైనల్లోకి ప్రవేశించాడు. సోమవారం జరిగిన ప్రిక్వార్టర్‌ ఫైనల్లో జొకోవిచ్‌ 6-2, 6-4, 6-2తో గారిన్‌ (చిలీ)పై గెలిచాడు. మేజర్‌ టోర్నీల్లో క్వార్టర్‌ ఫైనల్‌లో అడుగుపెట్టడం జొకోవిచ్‌కు ఇది 50వ సారి.

Story first published: Tuesday, July 6, 2021, 12:49 [IST]
Other articles published on Jul 6, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X