న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Wimbledon 2021 Day 2: గట్టెక్కిన ఫెడరర్.. గాయంతో వైదొలిగిన సెరెనా.. బార్టీ బోణీ!

Wimbledon 2021 Day 2: Serena retires through injury, Federer and Barty survives scare

లండన్‌: వింబుల్డన్‌ గ్రాండ్‌స్లామ్‌ టెన్నిస్‌ టోర్నీలో టాప్‌ సీడ్‌ ఆష్లే బార్టీ శుభారంభం చేయగా.. మాజీ చాంపియన్‌ రోజర్‌ ఫెడరర్‌, నాలుగో సీడ్‌ అలెగ్జాండర్‌ జ్వెరెవ్‌, ఆండ్రే రుబలేవ్‌, కరోలినా ప్లిస్కోవా, కెర్బర్‌ రెండో రౌండ్‌కు చేరుకున్నారు. అమెరికా టెన్నిస్‌ దిగ్గజం సెరెనా విలియమ్స్‌ గాయంతో తొలి రౌండ్‌లోనే నిష్క్రమించింది. అలెక్సాండ్రా సస్నోవిచ్‌ (బెలారస్‌)తో మంగళవారం జరిగిన మహిళల సింగిల్స్‌ తొలి రౌండ్‌ మ్యాచ్‌లో తొలి సెట్‌లో స్కోరు 3-3తో సమంగా ఉన్నదశలో సెరెనా చీలమండ గాయం కారణంగా వైదొలిగింది. కెరీర్‌లో 23 గ్రాండ్‌స్లామ్‌ సింగిల్స్‌ టైటిల్స్‌ గెలిచిన సెరెనా వింబుల్డన్‌ టోర్నీలో తొలి రౌండ్‌లోనే వెనుదిరగడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.

 గట్టెక్కిన ఫెడరర్..

గట్టెక్కిన ఫెడరర్..

స్విట్జర్లాండ్‌ దిగ్గజం ఫెడరర్‌ తొలి రౌండ్‌లో గట్టిపోటీ ఎదుర్కొన్నాడు. ప్రపంచ 41వ ర్యాంకర్‌ అడ్రియన్‌ మనారినో (ఫ్రాన్స్‌)తో జరిగిన తొలి రౌండ్‌ మ్యాచ్‌లో నాలుగు సెట్‌లు ముగిసి, ఐదో సెట్‌ ప్రారంభమాయ్యక మనారినో గాయం కారణంగా వైదొలిగాడు. దాంతో ఫెడరర్‌ విజయం ఖాయమైంది. 2 గంటల 44 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో ఫెడరర్‌ తొలి సెట్‌ను 6-4తో గెలిచాడు. అనంతరం మనారినో రెండో సెట్‌ను 7-6 (7/3)తో, మూడో సెట్‌ను 6-3తో నెగ్గి సంచలనం సృష్టించే దిశగా సాగిపోయాడు. అయితే నాలుగో సెట్‌లో ఫెడరర్‌ 5-2తో ఆధిక్యంలో ఉన్నదశలో మనారినో కోర్టులో జారిపడటంతో అతని మోకాలికి గాయమైంది. ఎనిమిదో గేమ్‌లో మనారినో సర్వీస్‌ను బ్రేక్‌ చేసిన ఫెడరర్‌ నాలుగో సెట్‌ను 6-2తో గెల్చుకున్నాడు. ఐదో సెట్‌ తొలి గేమ్‌లో తొలి పాయింట్‌ ముగిశాక మనారినో ఇక ఆడలేనంటూ చైర్‌ అంపైర్‌కు చెప్పేసి మ్యాచ్‌ నుంచి వైదొలిగాడు.

జ్వెరెవ్ అలవోకగా..

జ్వెరెవ్ అలవోకగా..

నాలుగో సీడ్‌ అలెగ్జాండర్‌ జ్వెరెవ్‌ (జర్మనీ) అలవోకగా రెండో రౌండ్‌కు దూసుకెళ్లాడు. తొలి గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌ కోసం ఆరాటపడుతున్న అతడు మొదటి రౌండ్లో 6-3, 6-4, 6-1తో డచ్‌ క్వాలిఫయర్‌ టాలన్‌ గ్రీక్స్‌పూర్‌పై నెగ్గాడు. జ్వెరెవ్‌ 20 ఏస్‌లు కొట్టాడు. 9వ సీడ్‌ ష్వార్జ్‌మాన్‌ (అర్జెంటీనా) తొలి రౌండ్‌ను అధిగమించాడు. అతడు 6-3, 6-4, 6-0తో పైర్‌ (ఫ్రాన్స్‌)ను ఓడించాడు. మరో మ్యాచ్‌లో ఆండీ ముర్రే (బ్రిటన్‌) 6-4, 6-3, 5-7, 6-3తో బసిలష్విలి (జార్జియా)పై విజయం సాధించాడు. ఇతర తొలి రౌండ్‌ మ్యాచుల్లో ఎవాన్స్‌ (బ్రిటన్‌) 7-6 (7-4), 6-2, 7-5తో లోపెజ్‌ (స్పెయిన్‌)పై గెలిచారు.

బార్టీ శుభారంభం..

బార్టీ శుభారంభం..

మహిళల సింగిల్స్‌ తొలి రౌండ్‌లో ఆస్ట్రేలియా క్రీడాకారిణి బార్టీ 6-1, 6-7(1), 6-1తో కార్లా సువారెజ్‌ నవారో (స్పెయిన్‌)పై గెలిచింది. కేన్సర్‌ నుంచి కోలుకొన్న తర్వాత రెండో గ్రాండ్‌స్లామ్‌ బరిలోకి దిగిన సువారెజ్‌.. బార్టీకి గట్టిపోటీనే ఇచ్చి రెండో సెట్‌ను టైబ్రేక్‌లో గెలుచుకుంది. కానీ, మూడో సెట్‌లో బార్టీ జోరు ముందు నిలవలేక పోయింది. చెక్‌ భామ ప్లిస్కోవా 7-5, 6-4తో తమారా జిదాన్‌సెక్‌పై, మరియా సక్కారి (గ్రీస్‌) 6-1, 6-1తో అరంటక్సా రుస్‌పై, 13వ సీడ్‌ ఎలీస్‌ మెర్టిన్స్‌ 6-1, 6-3తో హరీట్‌ డార్ట్‌పై, జర్మన్‌ ప్లేయర్‌ కెర్బర్‌ 6-4, 6-3తో నినా స్టజనోవిచ్‌ (సెర్బియా)పై నెగ్గారు. 23వసారి వింబుల్డన్‌ ఆడుతున్న 41 ఏళ్ల వీనస్‌ విలియమ్స్‌ 7-5, 4-6, 6-3తో మిహేల బుజరెస్కూ (రొమేనియా)పై గెలిచింది. మొత్తంగా వీనస్‌ 90వ సారి గ్రాండ్‌స్లామ్‌ బరిలో నిలిచింది.

 ఒలింపిక్స్‌ నుంచి హలెప్‌ అవుట్‌

ఒలింపిక్స్‌ నుంచి హలెప్‌ అవుట్‌

పారిస్‌: మహిళల మూడో ర్యాంకర్‌ సిమోనా హలెప్‌ (రుమేనియా), పురుషుల్లో మూడుసార్లు గ్రాండ్‌స్లామ్‌ చాంపియన్‌ స్టాన్‌ వావ్రింకా (స్విట్జర్లాండ్‌) గాయాల సమస్యలతో ఒలింపిక్స్‌లో ఆడడం లేదని ప్రకటించారు. పిక్క గాయం కారణంగా హలెప్‌ వింబుల్డన్‌కు కూడా దూరమైంది.

Story first published: Wednesday, June 30, 2021, 7:37 [IST]
Other articles published on Jun 30, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X