న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వింబుల్డన్ ఫైనల్లో జొకోవిచ్, ఫెదరర్.. సెమీస్‌లో నాదల్ ఓటమి

Wimbledon 2019: Roger Federer beats Rafael Nadal in Wimbledon classic to set up Novak Djokovic final

డిఫెండింగ్‌ ఛాంపియన్‌, సెర్బియా స్టార్ నోవాక్‌ జకోవిచ్‌ వింబుల్డన్‌-2019 ఫైనల్‌కు చేరుకున్నాడు. శుక్రవారం జరిగిన పురుషుల సింగిల్స్‌ తొలి సెమీఫైనల్లో టాప్‌ సీడ్‌ జొకోవిచ్‌ 6-2, 4-6, 6-3, 6-2తో 23వ సీడ్‌ బాటిస్టా అగుట్‌ (స్పెయిన్‌)పై విజయం సాధించాడు. తొలి సెట్‌ను సులభంగానే కైవసం చేసుకున్న జకోవిచ్‌.. రెండో సెట్‌ను కోల్పోయాడు. ఆ తర్వాత మళ్లీ పుంజుకున్న జకో వరుసగా 6-3, 6-2 తో రెండు సెట్లు గెలిచి మరోసారి ఫైనల్‌కు చేరుకున్నాడు.

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం

2 గంటల 49 నిమిషాల పాటు జరిగిన పోరులో జొకోవిచ్‌కు రెండో సెట్‌ మినహా అంతగా ప్రతిఘటన ఎదురుకాలేదు. జొకోవిచ్‌కు ఇది 25వ గ్రాండ్‌స్లామ్‌ ఫైనల్ కావడం విశేషం. ఈ ఏడాది బాటిస్టా అగుట్‌తో ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ ఓడిపోయిన జొకోవిచ్‌.. మూడోసారి మాత్రం పైచేయి సాధించాడు. 15 గ్రాండ్‌స్లామ్‌ టైటిల్స్‌ నెగ్గిన జొకోవిచ్‌.. 9సార్లు రన్నరప్‌గా నిలిచాడు. ఇక వింబుల్డన్‌ ట్రోఫీని నాలుగుసార్లు (2011, 2014, 2015, 2018) సొంతం చేసుకున్న జొకోవిచ్‌ ఒకసారి (2013లో) రన్నరప్‌గా నిలిచాడు.

రెండో సెమీఫైనల్లో స్విస్ దిగ్గజం, రెండో సీడ్ రోజర్ ఫెడరర్‌ 7-6 (7/3), 1-6, 6-3, 6-4తో మూడో సీడ్‌ రాఫెల్‌ నాదల్‌ (స్పెయిన్‌)పై గెలిచాడు. 3 గంటల 2 నిమిషాల పాటు సాగిన ఈ పోరులో.. 14 ఏస్‌లు సంధించిన ఫెదరర్ 51 విన్నర్లు కొట్టాడు. నువ్వా నేనా అన్నట్లు తలపడ్డా కీలక సమయాల్లో ఆధిక్యం కనబర్చిన ఫెదరర్ విజేతగా నిలిచాడు. దీంతో వరుసగా 21వ ఏడాది వింబుల్డన్‌ టోర్నీలో ఆడుతున్న 37 ఏళ్ల ఫెడరర్‌.. 12వసారి ఫైనల్‌కు చేరాడు. 8 సార్లు (2003, 2004, 2005, 2006, 2007, 2009, 2012, 2017) టైటిల్‌ నెగ్గిన అతను మూడుసార్లు రన్నరప్‌గా నిలిచాడు. ఇక ఆదివారం జరిగే ఫైనల్లో జొకోవిచ్, ఫెదరర్ అమీతుమీ తేల్చుకోనున్నారు.

Story first published: Saturday, July 13, 2019, 8:33 [IST]
Other articles published on Jul 13, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X