న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కావాలని చెత్తగా ఆడినందుకు.. 39 లక్షలు జరిమానా!!

Wimbledon 2019: Bernard Tomic fined for not meeting professional standards

నిత్యం వార్తల్లో ఉండే వివాదాస్పద ఆస్ట్రేలియా ఆటగాడు బెర్నార్డ్‌ టామిక్‌ మరోసారి వార్తల్లో నిలిచాడు. కావాలని చెత్తగా ఆడినందుకు వింబుల్డన్‌ నిర్వాహకుల ఆగ్రహానికి గురయ్యాడు. ప్రస్తుతం లండన్ వేదికగా ప్రతిష్టాత్మక వింబుల్డన్‌ టోర్నీ జరుగుతున్న విషయం తెలిసిందే. టోర్నీలో భాగంగా జో విల్‌ఫ్రెడ్‌ సోంగా (ఫ్రాన్స్‌)తో జరిగిన తొలి రౌండ్‌లో బెర్నార్డ్‌ 2-6, 1-6, 4-6 తేడాతో చిత్తుగా ఓడిపోయాడు. కేవలం 58 నిమిషాల్లోనే ఈ మ్యాచ్ ముగిసింది. తొలి సెట్‌ను 18 నిమిషాల్లో.. రెండో సెట్‌ను 17 నిమిషాల్లోనే ఓడాడు.

39 లక్షలు జరిమానా:

39 లక్షలు జరిమానా:

2004 తర్వాత వింబుల్డన్‌లో ఇంత త్వరగా ఓ పురుషుల మ్యాచ్‌ ముగియడం ఇదే తొలిసారి. బెర్నార్డ్‌ టామిక్‌ కావాలని చెత్తగా ఆడాడని, సామర్థ్యానికి తగినట్లుగా ఆడలేదని రిఫరీ ఫిర్యాదు చేసాడు. దీంతో టామిక్‌కు తొలి రౌండ్‌ ఆడినందుకు వచ్చే ప్రైజ్‌మనీని 45 వేల పౌండ్లను (సుమారు రూ. 39 లక్షలు) జరిమానాగా చెల్లించాలని ఆల్‌ ఇంగ్లండ్‌ క్లబ్‌ ఆదేశించింది.

జరిమానా రెండోసారి:

జరిమానా రెండోసారి:

'సోంగాతో జరిగిన తొలి రౌండ్‌ మ్యాచ్‌లో టామిక్‌ ఆట ప్రొఫెషనల్‌ ప్రమాణాల స్థాయిలో లేదని మ్యాచ్ రిఫరీ అభిప్రాయపడ్డారు. దీంతో ఈ శిక్ష విధిస్తున్నాం' అని నిర్వాహకులు ప్రకటించారు. 'తాను అత్యుత్తమ ప్రదర్శనే ఇచ్చానని, అయినా ఓడిపోయానని' టామిక్‌ వివరణ ఇచ్చాడు. టామిక్‌కు జరిమానా పడడం రెండోసారి. రెండేళ్ల క్రితం వింబుల్డన్‌లోనే జ్వెరేవ్‌తో జరిగిన మ్యాచ్‌లో 'ఆడటం బోరింగ్‌' అంటూ గాయమైనట్లు నాటకం ఆడి ఓడాడు. దీంతో అప్పుడు కూడా అతనిపై జరిమానా పడింది.

కెర్బర్ ఔట్:

కెర్బర్ ఔట్:

ప్రతిష్టాత్మక వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో సంచనాల పర్వం కొనసాగుతూనే ఉంది. గురువారం డిఫెండింగ్ చాంపియన్ అంజెలిక్ కెర్బర్ (జర్మనీ) రెండో రౌండ్‌లోనే లారెన్ డేవిస్ (95వ ర్యాంకు) చేతిలో పరాజయం పాలైంది. మహిళల సింగిల్స్‌ రెండో రౌండ్లో కెర్బర్ 6-2, 2-6, 1-6తో పేలవ ప్రదర్శన చేసి లారెన్ డేవిస్ చేతిలో అనూహ్యంగా ఓడిపోయింది. టాప్ సీడ్ ఆష్లే బార్టీ 6-1, 6-3 తేడాతో వాన్ యుత్వాంక్(బెల్జియం)పై విజయం సాధించింది. మరో మ్యాచ్‌లో యువ సంచనలం కోరీ గాఫ్ (313) 6-3, 6-3తేడాతో రైబోరికోవా (స్లోవేకియా,139) పై గెలుపొందింది.

ఫెదరర్‌, నాదల్‌, సెరెనా ముందంజ:

ఫెదరర్‌, నాదల్‌, సెరెనా ముందంజ:

సెరెనా 2-6, 6-2, 6-4తో జువాన్‌ (స్లొవేనియా)పై గెలిచింది. క్విటోవా 7-5, 6-2తో క్రిస్టినా మ్లెదెనోవిచ్‌ (ఫ్రాన్స్‌)పై, స్టీఫెన్స్‌ (అమెరికా) 6-0, 6-2తో యఫాన్‌ వాంగ్‌ (చైనా)పై నెగ్గారు. పురుషుల సింగిల్స్‌లో రెండో సీడ్‌ రోజర్‌ ఫెదరర్‌ మూడో రౌండ్లో అడుగుపెట్టాడు. ఫెదరర్‌ 6-1, 7-6 (7-3), 6-2తో క్లార్క్‌ (బిట్రన్‌)ను ఓడించాడు. స్పెయిన్ బుల్ రఫెల్ నాదల్‌ 6-3, 3-6, 7-6 (7-5), 7-6 (7-3)తో కిర్గియోస్‌పై నెగ్గాడు. నిషికోరి (జపాన్‌) 6-4, 6-4, 6-0తో నోరీ (బ్రిటన్‌)పై గెలిచాడు.

Story first published: Friday, July 5, 2019, 13:28 [IST]
Other articles published on Jul 5, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X