వెకేషన్ ట్రిప్: ఆటే కాదు.. భార్యతో కలిసి పాట కూడా పాడుతా (వీడియో)

హైదరాబాద్: ఇటీవలే ముగిసిన వింబుల్డన్‌ పైనల్లో విజేతగా నిలిచిన సెర్బియా టెన్నిస్ స్టార్ నొవాక్ జొకోవిచ్ ప్రస్తుతం కుటుంబ సభ్యులతో ఎంజాయ్ చేస్తున్నాడు. తన భార్య జెలెనాతో కలిసి క్రొయేషియాలోని కోర్కులా ఐస్‌లాండ్‌లో పాట కూడా పాడాడు. ఈ సందర్భంగా తన భార్యతో కలిసి పాట పాడిన వీడియోని జొకోవిచ్ తన ఇనిస్టాగ్రామ్‌లో పోస్టు చేశాడు.

మీకోసం: ప్రో కబడ్డీ 7వ సీజన్ స్పెషల్ సైట్

"క్రొయేషియాలో జెలెనాతో కలిసి అద్భుతమైన సమయాన్ని గడిపాను. కోర్కులా ఐలాండ్‌లో క్లాపా గ్రూపుతో కలిసి పాట పాడటం అద్భుతమైన ఎక్స్‌పీరియన్స్ #iambetterattennis" అంటూ ఆ వీడియోకి కామెంట్ పెట్టాడు. అంతకముందు క్రొయేషియా దీవుల్లో జొకోవిచ్ తన భార్యతో కలిసి ఎంజాయ్ చేస్తోన్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

గత వారం జొకోవిచ్ తన సోదరుడు డొజోర్డీకు కలిసి దిగిన ఓ ఫోటోని టెన్నిస్ అభిమానులతో పంచుకున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే, వింబుల్డన్‌ చరిత్రలోనే సుదీర్ఘంగా జరిగిన ఫైనల్లో సెర్బియాకు చెందిన ప్రపంచ నంబర్‌వన్‌ నొవాక్‌ జొకోవిచ్‌ విజేతగా నిలిచాడు. సుమారు 4 గంటల 57 నిమిషాలపాటు సాగిన ఈ మ్యాచ్‌లో స్విట్జర్లాండ్‌ దిగ్గజం రోజర్‌ ఫెదరర్‌పై నొవాక్ జొకోవిచ్ 7-6 (7/5), 1-6, 7-6 (7/4), 4-6, 13-12 (7/3)తో గెలుపొందిన సంగతి తెలిసిందే.

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
Story first published: Monday, July 22, 2019, 17:47 [IST]
Other articles published on Jul 22, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X