న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

యుఎస్ ఓపెన్: ప్రైజ్ మనీ వివరాలు తెలిస్తే కళ్లు బైర్లు కమ్మాల్సిందే

By Nageshwara Rao
US Open prize money: How much could Federer, Nadal, Williams and Halep take home?

హైదరాబాద్: వరుసగా రెండో ఏడాది యుఎస్‌ ఓపెన్‌ టైటిల్‌ తనదేనని అంటున్నాడు ప్రపంచ నంబర్ వన్ ఆటగాడు రఫెల్ నాదల్. సోమవారం నుంచి యుఎస్ ఓపెన్ ఆరంభం కానున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రఫెల్ నాదల్ మాట్లాడుతూ స్టార్ ప్లేయర్లు ఎంతమంది ఉన్నా ఈసారి టైటిల్ తనదేనని ధీమా వ్కక్తం చేశాడు.

"గత ఏడాది యుఎస్‌ ఓపెన్‌ విజయం నాకెంతో ప్రత్యేకం. రెండేళ్ల విరామం తర్వాత ఆ టైటిల్‌ సాధించాను. 2017 ఫ్రెంచ్‌ ఓపెన్‌ కూడా గెలిచాను. కానీ హార్డ్‌ కోర్టులో టైటిల్‌ సాధించడం, అందులోనూ అది యుఎస్‌ ఓపెన్‌లో కావడం నాకెంతో ప్రత్యేకం. ఈసారీ వదలను" అని రఫెల్ నాదల్ అన్నాడు.

సోమవారం ఆరంభమయ్యే యుఎస్ ఓపెన్‌లో పురుషుల టెన్నిస్‌ను శాసిస్తోన్న రోజర్‌ ఫెదరర్‌, రఫెల్‌ నాదల్‌, నొవాక్‌ జకోవిచ్‌, ఆండీ ముర్రే బరిలోకి దిగుతున్నారు. ఈ మధ్య కాలంలో ఈ నలుగురూ మంచి ఫామ్‌లో ఉండి బరిలోకి దిగుతోన్న టెన్నిస్ గ్లాండ్ స్లామ్ ఇదే కావడం విశేషం.

చాన్నాళ్ల తర్వాత ఈ నలుగురూ కలిసి పూర్తి ఫిట్‌నెస్‌, చక్కటి ఫామ్‌తో బరిలోకి నిలుస్తున్న టోర్నీ యుఎస్‌ ఓపెనే కావడం విశేషం. రోజర్ ఫెదరర్‌, రఫెల్ నాదల్‌ రెండేళ్ల నుంచి మంచి ఫామ్‌లో కొనసాగుతుండగా.. జొకోవిచ్ ఇటీవలే వింబుల్డన్ టైటిల్‌‌ను నెగ్గి తిరిగి ఫామ్‌లోకి వచ్చాడు.

మరోవైపు ఆండీ ముర్రే సైతం గాయం నుంచి కోలుకుని ఫామ్‌ అందుకున్నాడు. ఇక, మహిళల సింగిల్స్‌లో అందరి చూపూ సెరెనా విలియమ్స్‌ మీదే. మార్గరెట్‌ కోర్ట్‌ పేరిట ఉన్న అత్యధిక గ్రాండ్‌స్లామ్‌ల రికార్డు (24) అందుకోవడానికి సెరెనా ఒక టైటిల్‌ దూరంలో ఉంది. టోర్నీ నిర్వహాకులు ఈసారి ప్రైజ్ మనీని పెద్ద మొత్తంలో పెంచారు.

యుఎస్ ఓపెన్ ప్రైజ్ మనీ: పురుషుల/మహిళల సింగిల్స్
విన్నర్: £2.69million (సుమారు రూ. 25 కోట్లు)
రన్నరప్: £1.44m (సుమారు రూ. 13 కోట్లు)
సెమీ ఫైనల్స్: £720,120
క్వార్టర్ ఫైనల్స్: £369,792
Round of 16: £207,083
Round of 32: £121,447
Round of 64: £72,401
Round of 128: £42,039
మొత్తం: £31.85m

US Open 2018 latest odds:
Men's singles:
నొవాక్ జొకోవిచ్ 9/4
రఫెల్ నాదల్ 11/4
రోజర్ ఫెదరర్ 11/2
అలెగ్జాండర్ జెర్వ్ 11/1
డెల్ పోట్రో 14/1
మారిన్ సిలిచ్ 18/1

Women's singles:
సెరెనా విలియమ్స్ 11/2
సిమోనా హలెప్ 6/1
ఏంజెలినా కెర్బర్ 15/2
స్టీఫెన్స్ 8/1
పెట్రో క్విటోవా 14/1
ఎలీనా స్టిటోలినా 18/1

యుఎస్‌ ఓపెన్‌ రాత్రి 8.30 నుంచి స్టార్‌ స్పోర్ట్స్‌లో..

Story first published: Tuesday, August 28, 2018, 9:07 [IST]
Other articles published on Aug 28, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X