
క్రీడాకారులను బాధ్యులు చేయడం..
'ప్రభుత్వాల చర్యలు, నిర్ణయాలకు వ్యక్తిగతంగా క్రీడాకాకారుల్ని జవాబుదారీగా చేస్తుండటం ఆందోళన కలిగించే విషయం. రష్యా, బెలారాస్ ప్లేయర్లను టోర్నీలో పాల్గొనడానికి అనుమతించాం'' అని యుఎస్ ఓపెన్ వ్యవహారాలు చూస్తున్న యుఎస్ టెన్నిస్ సంఘం సీఈఓ, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ల్యూ షెర్ పేర్కొన్నాడు. రష్యా, బెలారస్ క్రీడాకారులు తటస్థ పతాకం కింద ఆడతారని తెలిపాడు. ఇటీవల ముగిసిన ఫ్రెంచ్ ఓపెన్‌తో సహా ప్రపంచవ్యాప్తంగా టెన్నిస్ టోర్నీల్లో ఇలాంటి ఏర్పాటు ఉంటుందని చెప్పాడు.

ఆగస్టు 29 నుంచి..
ఆగస్టు 29న న్యూయార్క్‌లో యుఎస్ ఓపెన్ ప్రారంభంకానుంది. ఇక ఫిబ్రవరిలో ఉక్రెయిన్‌పై యుద్ధం మొదలుపెట్టిన తర్వాత ఫుట్‌బాల్ ప్రపంచకప్ క్వాలిఫయర్స్‌తో సహా వివిధ టోర్నీల్లో రష్యా, బెలారస్ క్రీడాకారులు పాల్గొనకుండా నిషేధం విధించారు. ఈనెల 27న ఆల్ ఇంగ్లండ్ క్లబ్‌లో ప్రారంభంకానున్న వింబుల్డన్‌లోనూ రష్యా, బెలారస్ క్రీడాకారులు పాల్గొనకుండా ఏప్రిల్‌లో నిషేధం పడింది. దీంతో ప్రస్తుత నంబర్‌వన్ ఆటగాడు డానిల్ మెద్వదెవ్ (రష్యా) వింబుల్డన్‌కు దూరమయ్యాడు. అయితే తాజా నిర్ణయంతో డిఫెండింగ్ ఛాంపియన్ మెద్వదెవ్ యుఎస్ ఓపెన్‌లో బరిలో దిగనున్నాడు.

సెరెనాకు వైల్డ్ కార్డ్ ఎంట్రీ
23 గ్రాండ్‌స్లామ్ టైటిళ్ల విజేత సెరెనా విలియమ్స్‌కు ఈ ఏడాది వింబుల్డన్‌లో వైల్డ్‌కార్డ్ ఎంట్రీ లభించింది. ఈ విషయాన్ని ఆల్ ఇంగ్లాండ్ క్లబ్ ట్విటర్లో తెలిపింది. గతేడాది వింబుల్డన్ తొలి రౌండ్లో గాయం అయిన నాటి నుంచి సెరెనా మళ్లీ బరిలో దిగలేదు. దీంతో సింగిల్స్ ఎంట్రీల జాబితాలో తొలుత ఆమె పేరును చేర్చలేదు. సెరెనాకు వైల్డ్‌కార్డు ఇచ్చినట్లు తాజాగా ఆల్ ఇంగ్లాండ్ క్లబ్ ప్రకటించింది. ఆమెతో పాటు మరో అయిదుగురికి వైల్డ్‌కార్డ్ ప్రవేశం లభించింది. 40 ఏళ్ల సెరెనా ఏడుసార్లు వింబుల్డన్‌లో ఛాంపియన్‌గా అయింది. 2018, 2019 టోర్నీల్లో రన్నరప్‌గా నిలిచింది.