న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

యుఎస్ ఓపెన్‌: హలెప్‌ ఔట్, పిన్న వయస్కురాలిగా కోరీ గాఫ్ రికార్డు

US Open 2019: Taylor Townsend stuns Wimbledon champion Simona Halep

హైదరాబాద్: యుఎస్‌ ఓపెన్‌లో నాలుగో సీడ్‌ సిమోనా (రొమేనియా) నిష్క్రమించింది. శుక్రవారం జరిగిన మహిళల సింగిల్స్ రెండో రౌండ్‌లో అమెరికా క్వాలిఫయర్‌ టేలర్‌ టౌన్‌సెండ్‌ 2-6, 6-3, 7-6 (7-4)తో వింబుల్డన్‌ ఛాంపియన్‌ సిమోనా హలెప్‌కు షాకిచ్చింది. 2 గంటల 4నిమిషాల పాటు సాగిన ఆ మ్యాచ్‌లో ఇద్దరూ ఒక్క ఏస్ కూడా సంధించలేకపోయారు.

తొలి సెట్‌ను అలవోకగా గెలుచుకున్న హలెప్‌.. రెండో సెట్‌ ఆరంభంలోనే రెండు సర్వీసులు కోల్పోయింది. ఆ సెట్‌ను గెలుచుకున్న టౌన్‌సెండ్‌ చివరి వరకు అదే జోరుని కొనసాగించి రెండో సెట్‌ని సొంతం చేసుకుంది. రసవత్తరంగా సాగిన నిర్ణయాత్మక మూడో సెట్లో హలెప్‌.. ఓ మ్యాచ్‌ పాయింట్‌ను వృథా చేసుకుంది.

టైబ్రేక్‌లో 4-4తో సమంగా

టైబ్రేక్‌లో 4-4తో సమంగా

టైబ్రేక్‌లో 4-4తో సమంగా ఉన్న దశలో టౌన్‌సెండ్‌ వరుసగా మూడు పాయింట్లు సాధించి విజేతగా నిలిచింది. ఈ మ్యాచ్‌లో టేలర్‌ టౌన్‌సెండ్‌ 39 విన్నర్లు కొట్టింది. అమెరికాకు చెందిన టేలర్‌ టౌన్‌సెండ్‌ గత ఆరేళ్లుగా గ్రాండ్‌స్లామ్‌ టోర్నీలు ఆడుతోంది. కానీ... ఏ సీజన్‌లోనూ, ఏ టోర్నీలోనూ ఇప్పటి వరకు రెండో రౌండే దాటలేదు.

పిన్నవయస్కురాలిగా కోరీ గాఫ్ రికార్డు

పిన్నవయస్కురాలిగా కోరీ గాఫ్ రికార్డు

ఇప్పుడు మాత్రం తన గ్రాండ్‌స్లామ్‌ కెరీర్‌లోనే అద్భుత ప్రదర్శనతో అందరి దృష్టిని ఆకర్షించింది. మరోవైపు రెండో రౌండ్‌లో అమెరికా 15ఏళ్ల సంచనలం కోరీ గాఫ్ 6-2, 4-6, 6-4 తేడాతో టిమా బాబోస్(హంగేరీపై) విజయం సాధించింది. 32 ఏళ్లలో యూఎస్ ఓపెన్ మూడో రౌండ్‌కు చేరిన పిన్నవయస్కురాలిగా రికార్డు సృష్టించింది.

ప్రిక్వార్టర్స్‌కు కరోలినా ప్లిస్కోవా

ప్రిక్వార్టర్స్‌కు కరోలినా ప్లిస్కోవా

మూడో రౌండ్‌లో మూడో సీడ్ కరోలినా ప్లిస్కోవా(చెక్‌రిపబ్లిక్) 6-1, 4-6, 6-4 తేడాతో ఓన్స్ జాబెర్ (టునీసియా)పై గెలిచి ప్రిక్వార్టర్స్‌కు చేరింది. ఆరోసీడ్ క్విటోవా(చెక్ రిపబ్లిక్) 4-6, 4-6 తేడాతో అన్‌సీడెడ్ పెట్కోవిక్(జర్మనీ)పై ఓడి టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఇక, పురుషుల సింగిల్స్ మూడో రౌండ్‌లో స్విస్ దిగ్గజం మూడో సీడ్ రోజర్ ఫెదరర్ 6-2, 6-2, 6-1తేడాతో డేనియల్ ఎవాన్(బ్రిటన్)పై గెలిచి ప్రిక్వార్టర్స్‌లోకి ప్రవేశించాడు.

ముగిసిన దివీజ్ శరణ్ పోరు

ముగిసిన దివీజ్ శరణ్ పోరు

యుఎస్ ఓపెన్ పురుషుల డబుల్స్ భారత ఆటగాడు దివీజ్ శరణ్ పోరు ముగిసింది. డబుల్స్‌ తొలి రౌండ్‌లో భారత ఆటగాడు లియాండర్‌ పేస్‌-డ్యురన్‌ (అర్జెంటీనా) జోడీ 5-7, 2-6తో కెమెనొవిక్‌ (సెర్బియా)-కాస్పెర్‌ రుడ్‌(నార్వే) జోడీ చేతిలో ఓడగా... దివిజ్‌ శరణ్‌-హ్యూగో నిస్‌ (మొనాకొ) జంట 4-6, 4-6తో రాబర్ట్‌ కార్బలెస్‌-ఫెడెరికో డెల్బనిస్‌ (క్రొయేషియా) జోడీ చేతిలో ఓడింది.

Story first published: Saturday, August 31, 2019, 12:28 [IST]
Other articles published on Aug 31, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X