న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

US Open 2019: ప్రిక్వార్టర్స్ చేరిన ఫెదరర్, రఫెల్ నాదల్‌కు వాకోవర్

US Open 2019: Roger Federer beats Dan Evans to reach fourth round


హైదరాబాద్: యుఎస్ ఓపెన్‌లో స్విస్ దిగ్గజం రోజర్ ఫెదరర్ తన హవాని కొనసాగిస్తున్నాడు. పురుషుల సింగిల్స్ మూడో రౌండ్‌లో మూడో సీడ్ రోజర్ ఫెదరర్ 6-2, 6-2, 6-1తేడాతో డేనియల్ ఎవాన్(బ్రిటన్)పై సునాయాసంగా గెలిచి ప్రిక్వార్టర్స్‌లోకి ప్రవేశించాడు. గంటా 19 నిమిషాల్లోనే తన ప్రత్యర్థిని చిత్తుచేసి టోర్నీలో తొలిసారి స్థాయికి తగ్గ ప్రదర్శన చేశాడు.

యాషెస్ 2019: టూర్ మ్యాచ్‌లో విఫలం, 4వ టెస్టులో స్మిత్ ఆడతాడా?యాషెస్ 2019: టూర్ మ్యాచ్‌లో విఫలం, 4వ టెస్టులో స్మిత్ ఆడతాడా?

ఈ మ్యాచ్‌లో ఫెదరర్ 10 ఏస్‌లు, 48 విన్నర్లు, 7 బ్రేక్ పాయింట్లు సాధించాడు. ఈ క్రమంలో రోజర్ ఫెదరర్ ఖాతాలో అరుదైన రికార్డు చేరింది. ప్రపంచ టూర్ ఫైనల్స్ ఏటీపీ టోర్నీకి రికార్డు స్థాయిలో 17వ సారి అర్హత సాధించిన ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. గతేడాది జిమ్మీ కానర్స్(16 సార్లు) రికార్డుని సమం చేసిన ఫెదరర్ ఇప్పుడు ఆ రికార్డుని బద్దలు కొట్టాడు.

యుఎస్ ఓపెన్ తొలి రౌండ్‌లో భారత టెన్నిస్ ప్లేయర్ సుమిత్ నగల్‌పై గెలిచిన ఫెదరర్ ఈ సీజన్‌లో మొత్తం 40 విజయాలతో ప్రపంచ టూర్ ఫైనల్స్ ఆడే అవకాశాన్ని దక్కించుకున్నాడు. ఫెదరర్ ఇప్పటివరకు ఆరుసార్లు(2003, 2004, 2006, 2007, 2010, 2011) ప్రపంచ టూర్ ఫైనల్స్‌లో విజేతగా నిలిచాడు.

యుఎస్ ఓపెన్‌: హలెప్‌ ఔట్, పిన్న వయస్కురాలిగా కోరీ గాఫ్ రికార్డు

మరోవైపు మూడుసార్లు యుఎస్‌ ఓపెన్‌ చాంపియన్‌ రఫెల్ నాదల్‌ రెండో రౌండ్‌లో కోర్టులోకి అడుగుపెట్టకుండానే ముందంజ వేశాడు. నాదల్‌తో తలపడాల్సిన ఆస్ట్రేలియాకు చెందిన కొకినాకిస్‌ గాయంతో మ్యాచ్‌నుంచి వైదొలిగాడు. నాదల్ మూడో రౌండ్‌లో దక్షిణకొరియాకు చెందిన క్వాలిఫయర్‌ చుంగ్‌ ఇయాన్‌తో తలపడనున్నాడు.

Story first published: Saturday, August 31, 2019, 13:37 [IST]
Other articles published on Aug 31, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X