న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

యుఎస్ ఓపెన్: ఫైనల్లో సెరెనా, మార్గరెట్ రికార్డుని సమం చేసేనా?

By Nageshwara Rao
US Open 2018: Sublime Serena Williams thunders into final

హైదరాబాద్: అమెరికన్ టెన్నిస్ స్టార్ సెరెనా విలియమ్స్ మరో గ్రాండ్‌‌స్లామ్‌ టైటిల్‌పై కన్నేసింది. న్యూయార్క్ వేదికగా జరుగుతున్న యుఎస్ ఓపెన్ టైటిల్ సాధించడానికి ఒక్క అడుగు దూరంలో నిలిచింది. లాత్వియన్ సంచలనం అనస్టీసియా సెవాత్సోవాతో జరిగిన సెమీఫైనల్‌ పోరులో 6-3 6-0తేడాతో సెరెనా విజయం సాధించి ఫైనల్లోకి ప్రవేశించింది.

మహిళల సింగిల్స్ టైటిల్ కోసం ఫైనల్లో జపనీస్ సంచలనం నవోమీ ఒసాకాతో అమీతుమీ తేల్చుకోనుంది. సెరెనా విలియమ్స్ యుఎస్ ఓపెన్ ఫైనల్‌‌ చేరడం ఇది 9వ సారి. ప్రస్తుత టోర్నీకి ముందు వరకూ 8 సార్లు ఫైనల్‌‌కు అర్హత సాధించగా 6సార్లు టైటిల్ విజేతగా నిలిచింది. సెరెనా గనుక ఈ టైటిల్‌ను నెగ్గితే అరుదైన రికార్డుని సొంతం చేసుకుంటుంది.

సెరెనాకు ఇది 24వ గ్రాండ్ స్లామ్ కావడం విశేషం. దీంతో ఓపెన్ యుగంలో ఆస్ట్రేలియన్ టెన్నిస్ దిగ్గజం మార్గరెట్ కోర్ట్ ఆల్ టైమ్ రికార్డుని సమం చేయగలుగుతుంది. యుఎస్ ఓపెన్ సెమీ ఫైనల్ పోరులో సెరెనా వరుస సెట్లలో సెవాత్సోవాను చిత్తు చేసి మహిళల సింగిల్స్ ఫైనల్ చేరింది. తొలి సెట్ నుంచే సెరెనా తన అధిక్యాన్ని ప్రదర్శించింది.

తన కెరీర్‌లో తొలి గ్రాండ్ స్లామ్ సెమీపైనల్ మ్యాచ్ ఆడిన సెవాత్సోవా విఫలమైంది. సెరెనాకు కనీస పోటీ కూడా ఇవ్వలేక చేతులెత్తేసింది. తొలి సెట్‌లో కొద్దిసేపు ప్రతిఘటించినప్పటికీ రెండో సెట్‌లో మాత్రం ప్రత్యర్ధి అనుభవం ముందు తేలిపోయింది. మొదటి సెట్‌ను 6-3తో సొంతం చేసుకున్న సెరెనా రెండో సెట్‌లో మరింతగా రెచ్చిపోయింది.

STATISTICAL BREAKDOWN
Williams bt Sevastova 6-3 6-0

WINNERS/UNFORCED ERRORS
Williams - 31/20
Sevastova - 10/12

ACES/DOUBLE FAULTS
Williams - 4/1
Sevastova - 1/2

BREAK POINTS WON
Williams - 5/10
Sevastova - 1/2

FIRST SERVE PERCENTAGE
Williams - 64
Sevastova - 60

PERCENTAGE OF POINTS WON ON FIRST/SECOND SERVE
Williams - 76/50
Sevastova - 64/18 TOTAL

POINTS
Williams - 60
Sevastova - 40

Story first published: Friday, September 7, 2018, 13:34 [IST]
Other articles published on Sep 7, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X