న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

యుఎస్ ఓపెన్:ఫెదరర్‌కు షాక్, ప్రీ క్వార్టర్స్‌లోనే నిష్క్రమణ

US Open 2018: Five-Time Champion Roger Federer Knocked Out By Australias John Millman In Round Of 16

న్యూయార్క్: సంవత్సరారంభంలో గ్రాండ్‌ స్లామ్‌ టైటిల్‌ సొంతం చేసుకున్న ప్రపంచ రెండో ర్యాంక్‌ ఆటగాడు, స్విస్‌ దిగ్గజం రోజర్‌ ఫెదరర్‌కు .. మరో టైటిల్ సాధించాలనుకునే ప్రయత్నంలో ఫెదరర్‌కు షాక్‌ తగిలింది. యూఎస్‌ గ్రాండ్‌ స్లామ్‌ టోర్నీలో భాగంగా జరిగిన పురుషుల సింగిల్స్‌ ప్రిక్వార్టర్‌ ఫైనల్లో ఫెదరర్‌ పరాజయం చెందాడు. ఫెదరర్‌ 6-5, 5-7, 6-7(7/9), 6-7(3/7) తేడాతో జాన్‌ మిల్మాన్‌(ఆస్ట్రేలియా) చేతిలో ఓటమి పాలయ్యాడు. తొలి సెట్‌ను పోరాడి గెలిచిన ఫెడరర్‌.. రెండో సెట్‌ను కోల్పోయాడు.

ఆపై హోరీహోరీగా సాగిన మూడో సెట్‌ టైబ్రేకర్‌కు దారి తీసింది. ఇందులో మిల్మాన్‌ పైచేయి సాధించి విజయానికి బాటలు వేసుకున్నాడు. అటు తర్వాత జరిగిన సెట్‌ కూడా టైబ్రేక్‌కు వెళ్లడంతో మిల్మాన్‌ వరుస పాయింట్లతో ఫెడరర్‌ను మట్టికరిపించాడు. దాంతో ఫెడరర్‌ పోరు క్వార్టర్స్‌కు చేరకుండానే ముగిసింది. కాగా, యూఎస్‌ ఓపెన్‌ చరిత్రలో 50పైగా ర్యాంకింగ్‌ ఉన్న ఒక క్రీడాకారుడి చేతిలో ఫెడరర్‌ ఓటమి పాలు కావడం ఇదే తొలిసారి.

ఇదిలా ఉంచితే, ఎన్నో ఆశలతో యూఎస్‌ ఓపెన్‌లో అడుగుపెట్టిన రష్యా టెన్నిస్‌ స్టార్‌ మారియా షరపోవాకు నిరాశే ఎదురైంది. మహిళల సింగిల్స్‌ ప్రిక్వార్టర్స్‌లో షరపోవా 4-6, 3-6 తేడాతో సారెజ్‌ నావర్రో(స్పెయిన్‌) చేతిలో ఓటమి చవి చూసింది.

ఫేవరేట్‌గా బరిలోకి దిగిన రఫెల్‌ నాదల్‌ జోరు కొనసాగిస్తూ.. క్వార్టర్‌ఫైనల్‌కు దూసుకెళ్లాడు. పురుషుల సింగిల్స్‌ ప్రిక్వార్టర్స్‌లో టాప్‌సీడ్‌ నాదల్‌ 6-3, 6-3, 6-7 (6-8), 6-4తో బసిల్‌ష్వెలి (జార్జియా)ను ఓడించాడు. మూడో సీడ్‌ డెల్‌పొట్రో 6-4, 6-3, 6-1తో బొర్నా కొరిచ్‌ (క్రొయేషియా)ను ఓడించగా.. తొమ్మిదో సీడ్‌ డొమినిక్‌ థీమ్‌ 7-5, 6-2, 7-6 (7-2)తో ఐదో సీడ్‌ కెవిన్‌ అండర్సన్‌ (దక్షిణాఫ్రికా)పై విజయం సాధించాడు.

Story first published: Tuesday, September 4, 2018, 12:48 [IST]
Other articles published on Sep 4, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X