టెన్నిస్: సంచలన విజయాన్ని నమోదు చేసిన యుకీ బాంబ్రీ

Posted By:
Treating Indian Wells Masters as any other tournament: Yuki Bhambri

హైదరాబాద్: భారత సింగిల్స్ స్టార్ ఆటగాడు యుకీ బాంబ్రి తన కెరీర్‌లోనే అతిపెద్ద విజయం నమోదు చేశాడు. ఇండియన్‌వెల్స్‌ మాస్టర్స్‌ ఏటీపీ టోర్నీలో ప్రపంచ నంబర్ 12 ఫ్రాన్స్‌కు చెందిన లూకాస్ పోయిల్లేను ఓడించి సంచలన విజయంతో మూడోరౌండ్‌కు చేరుకున్నాడు.

సోమవారం జరిగిన రెండోరౌండ్ మ్యాచ్‌లో 6-4,6-4 స్కోరుతో గంట 19 నిమిషాల్లో వరుస సెట్లలో తనకన్నా ఎన్నోరెట్లు మెరుగైన లూకాస్‌ను బాంబ్రి చిత్తు చేసి అబ్బురపరిచాడు. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో బాంబ్రి ప్రస్తుతం 110వ ర్యాంకులో కొనసాగుతున్నాడు. కాగా, యుకీ మూడోరౌండ్‌లో అమెరికా స్టార్ ప్రపంచ 21వ ర్యాంకర్ శామ్ కెర్రీతో తలపడనున్నాడు.

యుకి ప్రస్తుతం ర్యాంకింగ్స్‌లో 110వ స్థానంలో ఉన్నాడు. అతడు తన తర్వాతి రౌండ్లో ప్రపంచ 21వ ర్యాంకు ఆటగాడు సామ్‌ క్వెరీ (అమెరికా)ను ఢీకొంటాడు. ''నేను బాగా సర్వ్‌ చేశా. దూకుడుగా ఆడా. అదే కీలకం'' అని యుకి చెప్పాడు. యుకి గత ఆగస్టులో ప్రపంచ నంబర్‌-22 గేల్‌ మోన్‌ఫిల్స్‌ (ఫ్రాన్స్‌)కు షాకిచ్చాడు.

మిగిలిన ఆటగాళ్లు:
వర్షం పలుమార్లు అంతరాయం కలిగించిన మ్యాచ్‌లో ప్రపంచ నంబర్‌వన్, స్విస్ స్టార్ రోజర్ ఫెదరర్ విజయంతో మూడోరౌండ్ చేరగా..మాజీ ప్రపంచ నంబర్‌వన్, సెర్బియా స్టార్ జొకోవిచ్ ఓటమితో టోర్నీ నుంచి నిష్క్రమించాడు. ఫెదరర్ 6-3,7-6(8-6) స్కోరుతో ఫెడెరికో డెల్బోనిస్‌ను ఓడించి మూడోరౌండ్ చేరుకున్నాడు.

Story first published: Tuesday, March 13, 2018, 10:41 [IST]
Other articles published on Mar 13, 2018

Mykhel బ్రేకింగ్ అలర్ట్స్ పొందండి