న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

అర్ధాంతరంగా తప్పుకొన్న టెన్నిస్ స్టార్: గోల్డెన్ ఛాన్స్ మిస్: రీప్లేస్ చేస్తామంటూ

Tokyo Olympics 2021: Britains star Andy Murray withdraws from mens singles with injury

టోక్యో: ప్రతిష్ఠాత్మకంగా సాగుతోన్న టోక్యో ఒలింపిక్స్ నుంచి మరో స్టార్ ప్లేయర్ అర్ధాంతరంగా తప్పుకొన్నాడు. తొడ కండరాలు పట్టేయడంతో ఈ మెగా స్పోర్ట్స్ ఈవెంట్ నుంచి వైదొలగుతున్నట్లు ప్రకటించాడు. పురుషుల టెన్నిస్ సింగిల్స్ కేటగిరీలో తాను పాల్గొనట్లేదని తెలిపాడు. దీనితో ఈ విభాగంలో బ్రిటన్ బంగారు పతకాన్ని కోల్పోయినట్టయింది. అతనే ఆండీ ముర్రే. 2012 లండన్ ఒలింపిక్స్, 2016 రియో డీ జనేరియా గేమ్స్‌ల్లో తన దేశానికి పురుషుల టెన్నిస్ సింగిల్స్ విభాగంలో బంగారం పతకాన్ని అందించాడు.

ఆశల్లేనట్టే: డబుల్స్‌లో సానియా మీర్జా-అంకితా రైనా జోడీ పరాజయం: కవలల చేతిలో చిత్తుఆశల్లేనట్టే: డబుల్స్‌లో సానియా మీర్జా-అంకితా రైనా జోడీ పరాజయం: కవలల చేతిలో చిత్తు

టోక్యో ఒలింపిక్స్‌లో కెనడాకు చెందిన ఫెలిక్స్‌ను అతను ఢీ కొట్టాల్సి ఉంది. తొడ కండరాల గాయంతో ఒలింపిక్స్ నుంచి వైదొలగుతున్నట్లు తెలిపాడు. ఈ మేరకు అతను ఓ ప్రకటన విడుదల చేశాడు. గాయం తనను వేధిస్తోందని, అర్థాంతరంగా తప్పుకోవాల్సి వచ్చిందని స్పష్టం చేశాడు. తొడ కండరాల గాయం వల్ల ఈ కఠిన నిర్ణయాన్ని తీసుకోవాల్సి వచ్చిందని పేర్కొన్నాడతను. దీనికితోడు తిరిక లేని షెడ్యూల్ కూడా అతనిపై కొంత మానసికంగా, శారీరకంగా ఒత్తిడిని తీసుకొచ్చిందని కోచ్ వ్యాఖ్యానించాడు.

డబుల్స్ ఆడతానని ముర్రే స్పష్టం చేశాడు. జో సోలిస్బరితో కలిసి టెన్నిస్ డబుల్స్ ఆడతానని, ఇక తన దృష్టి అంతా డబుల్స్ మీదే ఉంటుందని చెప్పాడు. తొడ కండరాల గాయం తిరగబెట్టకూడదనే ఉద్దేశంతో పురుషుల సింగిల్స్ నుంచి వైదొలగాలని నిర్ణయించుకున్నానని, ఈ నిర్ణయం.. తనను సుదీర్ఘకాలం పాటు వెంటాడుతుందని ముర్రే చెప్పుకొచ్చాడు. ఆండీ ముర్రే-సొలిస్బరీ డబుల్స్ జోడీ.. ఇప్పటికే తొలి రౌండ్ మ్యాచ్‌ను పూర్తి చేసుకుంది. తొలి మ్యాచ్‌లో ఫ్రెంచ్ రెండో సీడ్ నికొలస్ మాహుట్, పియర్-హ్యూజెస్ హ్యూబర్ట్ జోడీని ఓడించింది. రెండో మ్యాచ్‌ను ఆడాల్సి ఉంది.

Tokyo Olympics 2021: Mirabai Chanu Success Story ఎన్నో కష్టాలు... 21 ఏళ్ల నీరీక్షణ | Oneindia Telugu

జర్మనీ పెయిర్ కెవిన్ క్రావీట్జ్, టిమ్ ప్యుట్జ్‌ జంటను ఢీ కొట్టాల్సి ఉంది. డబుల్స్‌లో కొనసాగుతానని ఆండీ ముర్రే స్పష్టం చేయడం వల్ల ఈ కేటగిరీ సజావుగా సాగుతోంది. ఎటొచ్చీ- టెన్నిస్ సింగిల్స్‌ను అతన్ని రీప్లేస్ చేయాల్సి ఉంది. ఆండీముర్రే స్థానాన్ని మరో ఆటగాడితో భర్తీ చేస్తామని బ్రిటన్ టెన్నిస్ అసోసియేషన్ తెలిపింది. సింగిల్స్ మ్యాచ్ ఆరంభం అయ్యే సమయానికి కొత్త ఆటగాడిని టోక్యో ఒలింపిక్స్‌కు పంపిస్తామని స్పష్టం చేసింది.

Story first published: Sunday, July 25, 2021, 11:20 [IST]
Other articles published on Jul 25, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X