హైదరాబాద్: థాయ్‌లాండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో సింధుని మినహాయించి మిగిలిన భారత క్రీడాకారులంతా.. ప్రీ క్వార్టర్ ఫైనల్స్‌కు ముందే వెనుదిరిగారు. హెచ్‌ఎస్ ప్రణయ్, పారుపల్లి కశ్యప్‌లకు నిరాశే ఎదురైంది. గురువారం బ్యాంకాక్‌లో జరిగిన మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో సింధు 21-16, 21-14తో యిప్ పుయ్ యిన్ (హాంకాంగ్)పై గెలిచింది.
శుక్రవారం జరగనున్న ప్రీ క్వార్టర్ ఫైనల్స్‌లో భారత ప్రత్యర్థి.. మలేసియన్ సోనియా చీహ్‌తో తలపడనుంది. గతంలో.. అండర్ 19 ఆసియా యూత్ ఛాంపియన్‌షిప్‌లో పోటీపడ్డారు. అంతకంటే ముందు ఇదే ప్రత్యర్థిపై సింధు.. 2010లో వరల్డ్ జూనియర్ ఛాంపియన్ షిప్ పోటీపడిన వీరిద్దరిలో సింధూనే పైచేయి సాధించింది.
పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్స్‌లో ప్రణయ్ ఇండోనేషియా క్వాలిఫైయర్ సోనీ ద్వి కున్‌కొరోతో 35 నిమిషాల పాటు జరిగిన సమరంలో.. 18-21, 14-21తో, 2012 ఒలింపిక్ పోటీ దారు అయిన కశ్యప్ 18-21, 21-18, 19-21తో జపాన్‌కు చెందిన సునెయామా (జపాన్) చేతిలో పరాజయం చవిచూశారు. వీరిద్దరి పోరాటం గంటా ఎనిమిది నిమిషాల పాటు జరిగింది.
పురుషుల డబుల్స్‌లో మను అత్రి-సుమీత్ రెడ్డి జంట, మిక్స్‌డ్ డబుల్స్‌లో సాత్విక్ సాయిరాజ్-అశ్విని పొన్నప్ప జోడీలు ఓడిపోయారు. ఇక వీరు టోర్నీ నుంచి నిష్క్రమించినట్లే. శుక్రవారం జరుగనున్న క్వార్టర్స్‌లో సోనియా చెహ్ (మలేసియా)తో సింధు తలపడనుంది.