న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

అమ్మతనం ఆటకు అడ్డంకి కాదు: మళ్లీ సానియా మిర్జా రాకెట్ పట్టేనా!

By Nageshwara Rao
Tennis players who came back after giving birth

హైదరాబాద్: భారత టెన్నిస్ స్టార్ సానియా మిర్జా తల్లి కాబోతోంది. త్వరలోనే తమ జీవితంలోకి ఓ బేబీ రాబోతుందని సానియా మిర్జా ట్విటర్‌ వేదికగా సోమవారం అభిమానులతో పంచుకున్న సంగతి తెలిసిందే. #BabyMirzaMalik అనే హ్యాష్‌ ట్యాగ్‌తో తాను గర్భం దాల్చిన శుభవార్తను సానియా ట్విట్టర్‌లో పోస్టు చేశారు.

దీంతో సానియా మిర్జా పోస్టుకు అభిమానులు అభినందనలు తెలిపిన సంగతి కూడా తెలిసిందే. అయితే, త్వరలో తల్లి కాబోతున్న సానియా మీర్జా భవిష్యత్‌లో మళ్లీ రాకెట్‌ పడుతుందో లేదో తెలియదుకానీ... అమ్మతనం ఆటకు అడ్డంకి కాదని గతంలో పలువురు టెన్నిస్‌ స్టార్లు నిరూపించారు.

ప్రసవానంతరం రాకెట్ బరిలోకి దిగి గ్రాండ్‌స్లామ్‌ టైటిల్స్‌ గెలిచారు. అందుకు సంబంధించిన సమాచారం మీ కోసం...:

అందరికీ ఆదర్శం మార్గరెట్ కోర్ట్

అందరికీ ఆదర్శం మార్గరెట్ కోర్ట్

మార్గరెట్ కోర్ట్... మహిళల టెన్నిస్‌లో అత్యధిక సింగిల్స్‌ గ్రాండ్‌స్లామ్‌ టైటిల్స్‌ గెలిచిన మహిళా టెన్నిస్ క్రీడాకారిణి. తల్లి అయిన తర్వాత మార్గరెట్ కోర్ట్ ఒకే ఏడాది ఏకంగా మూడు గ్రాండ్‌స్లామ్‌ టైటిల్స్‌ నెగ్గి చరిత్ర సృష్టించింది. తొలి సంతానం కోసం 1971, 1972లో ఆటకు విరామం చెప్పిన మార్గరెట్‌ తల్లి అయ్యాక 1973లో పునరాగమనం చేసి ఆస్ట్రేలియన్, ఫ్రెంచ్, యూఎస్‌ ఓపెన్‌ గ్రాండ్‌స్లామ్‌ టైటిల్స్‌ సొంతం చేసుకుంది. అంతేకాదు డబ్ల్యుటీఏ ర్యాంకుల్లో నెంబర్ వన్ ర్యాంకుని కూడా సొంతం చేసుకుంది.

బెల్జియానికి చెందిన కిమ్‌ క్లియ్‌స్టర్స్‌ కూడా

బెల్జియానికి చెందిన కిమ్‌ క్లియ్‌స్టర్స్‌ కూడా

24 ఏళ్ల వయసులో బెల్జియానికి చెందిన కిమ్‌ క్లియ్‌స్టర్స్‌ తన కుమార్తె జేడ్ ఎల్లీకి జన్మనిచ్చిన ఏడాది తర్వాత పునరాగమనం చేసింది. అనంతరం 2009, 2010లలో యూఎస్‌ ఓపెన్‌, 2011లో ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ టైటిల్స్‌ కూడా సాధించింది. అంతేకాదు డబ్ల్యుటీఏ ర్యాంకుల్లో తన కెరీర్‌లోనే అత్యధికంగా 19వ ర్యాంకుని సొంతం చేసుకుంది.

తల్లి అయిన తర్వాత చరిత్ర సృష్టించిన ఇవాన్‌ గూలాగాంగ్‌

తల్లి అయిన తర్వాత చరిత్ర సృష్టించిన ఇవాన్‌ గూలాగాంగ్‌

ఆస్ట్రేలియాకు చెందిన మాజీ వరల్డ్ నంబర్ వన్ ఇవాన్‌ గూలాగాంగ్‌ 1977 మేలో ఓ బిడ్డకు జన్మనిచ్చాక ఆదే ఏడాది డిసెంబర్‌లో జరిగిన ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ టైటిల్‌తోపాటు 1980లో వింబుల్డన్‌ టైటిల్‌ను కూడా కైవసం చేసుకుంది. తద్వారా వింబుల్డన్ టైటిల్‌ను నెగ్గిన తొలి తల్లిగా ఇవాన్‌ గూలాగాంగ్‌ చరిత్ర సృష్టించింది. 1970 నుంచి 1980 మధ్య కాలంలో ఇవాన్‌ గూలాగాంగ్‌ మొత్తం 14 గ్రాండ్ స్లామ్ టైటిళ్లను సొంతం చేసుకుంది.

బిడ్డకు జన్మనిచ్చాక ఏడాది పాటు టెన్నిస్‌కు దూరమైన సెరెనా

బిడ్డకు జన్మనిచ్చాక ఏడాది పాటు టెన్నిస్‌కు దూరమైన సెరెనా

గతేడాది అమెరికా స్టార్‌ సెరెనా విలియమ్స్‌ వారాల గర్భంతోనే ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌ గెలిచింది. అనంతరం ఓ బిడ్డకు జన్మనిచ్చాకు ఏడాది పాటు టెన్నిస్‌కు దూరమైంది. ఇప్పటి వరకు 23 గ్రాండ్‌స్లామ్‌ సింగిల్స్‌ టైటిల్స్‌ సాధించిన సెరెనా వచ్చేనెలలో ఫ్రెంచ్‌ ఓపెన్‌లో తన అదృష్టాన్ని పరీక్షించుకోనుంది.

మగ బిడ్డకు జన్మనిచ్చిన అజరెంకా

మగ బిడ్డకు జన్మనిచ్చిన అజరెంకా

రెండుసార్లు (2012, 2013) ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ టైటిల్‌ నెగ్గిన అజరెంకా (బెలారస్‌) 2016 డిసెంబర్‌లో మగ బిడ్డకు జన్మనిచ్చింది. 2017 జూలైలో వింబుల్డన్‌ టోర్నీలో రాకెట్‌ పట్టి ప్రిక్వార్టర్‌ ఫైనల్‌కు చేరుకుంది. ఈ ఏడాది మయామి ఓపెన్‌ డబ్ల్యూటీఏ ప్రీమియర్‌ టోర్నీలోనూ సెమీఫైనల్‌కు చేరుకుంది.

Story first published: Tuesday, April 24, 2018, 16:08 [IST]
Other articles published on Apr 24, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X