న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

అలాగైతే నిన్నెవరూ పెళ్లి చేసుకోరు: సానియా మీర్జా ఈ వ్యాఖ్యలు ఎందుకు చేసింది..?

Stop telling a girl that none will marry you Sania Mirza at WEF

న్యూఢిల్లీ: భారత టెన్నిస్ సంచలనం, మన హైదరాబాదీ సానియా మీర్జా తన అంతరంగాన్ని ఆవిష్కరించింది. న్యూఢిల్లీలో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో భాగంగా మహిళా నాయకత్వం అనే చర్చలో పాల్గొని ఆమె మాట్లాడింది. తన చిన్నతనంలో టెన్నిస్ ఆడటం ఆపివేయాలని చాలామంది చెప్పినట్లు గుర్తు చేసుకుంది. టెన్నిస్ ఆడే అమ్మాయిలను పెళ్లి చేసుకునేందుకు ఎవరూ ముందుకు రారని చెప్పేవారని సానియా తెలిపింది.

ఎండకు చర్మం నల్లగా అవుతుంది

ఎండకు చర్మం నల్లగా అవుతుంది

టెన్నిస్ క్రీడ బయట ఆడేది కాబట్టి ఎండకు చర్మం నల్లగా తయారవుతుందని అందుకే ఎవరూ పెళ్లి చేసుకోరని తల్లిదండ్రుల నుంచి బంధు మిత్రుల వరకు ప్రతి ఒక్కరూ చెప్పేవారని సానియా వెల్లడించింది. ఇలా చెప్పినప్పుడు తన వయస్సు 8 ఏళ్లు అని వెల్లడించింది. తను నల్లగా తయారైతే తనను ఎవరూ పెళ్లి చేసుకోరనే భయం వీరిలో నెలకొందని ఆమె చెప్పారు. అయితే అప్పుడు తను చిన్నపిల్లనే కాబట్టి ఈ మాటలను పట్టించుకోకుండా టెన్నిస్ ఆడేందుకే మొగ్గు చూపినట్లు సానియా చెప్పుకొచ్చింది.

అమ్మాయిపై సమాజం ఆలోచన మారాలి

అమ్మాయిపై సమాజం ఆలోచన మారాలి

అమ్మాయి అంటే అందంగానే ఉండాలి, మంచి రంగులో ఉండాలన్న ఆలోచనలో నుంచి సమాజం బయటకు రావాలని సానియా పిలుపునిచ్చింది. ఈ సంస్కృతి మారాలని చెప్పింది. పాకిస్తాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్‌ను వివాహమాడిన ఈ టెన్నిస్ బ్యూటీ ప్రస్తుతం తల్లి కావడంతో ఆటకు కాస్త బ్రేక్ ఇచ్చింది. త్వరలోనే రాకెట్ పట్టుకుని అభిమానులను అలరించేందుకు సిద్ధమవుతోంది. ఒకప్పుడు భారత మహిళా అథ్లెట్ పీటీ ఉషా మాత్రమే ఉండేదని ఇప్పుడు చాలా మంది అమ్మాయిలు క్రీడారంగంలో రాణిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారని సానియా మీర్జా చెప్పింది.

సమానావకాశాలు ఇస్తే పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించండి?

సమానావకాశాలు ఇస్తే పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించండి?

అమ్మాయిలకు ఇంకా సమానావకాశాలు లేవని... ఇప్పుడే అమ్మాయిలు క్రీడారంగంలో దూసుకెళుతుంటే సమానావకాశాలు కల్పిస్తే వారు ఏ స్థాయిలో ఉంటారో ఊహించొచ్చని సానియా మీర్జా చెప్పుకొచ్చింది. ఇప్పటికీ మహిళలను గృహిణులు ఆధారం చేసుకునే ర్యాంకింగ్ ఇస్తున్నట్లు చెప్పింది. ఇందుకు ఓ అనుభవం చెప్పింది సానియా మీర్జా. ముంబై ఎయిర్‌పోర్టులో తనను ఓ వ్యక్తి కలిసి ఫోటో దిగాడని ఆ తర్వాత తన కొడుకు గురించి ఆరా తీశాడని సానియా చెప్పింది. హైదరాబాదులో ఉన్నాడని చెప్పగానే కొడుకుతో ఉండాల్సిన నీవు ఇక్కడున్నావేంటే ప్రశ్న వేశాడని సానియా చెప్పింది. వెంటనే ఆ వ్యక్తి కొడుకు ఎక్కడున్నాడని తాను ప్రశ్నించగా ఇంట్లో ఉన్నాడనే సమాధానం ఆ వ్యక్తి నుంచి వచ్చిందని అయితే నువ్వెందుకు ఇక్కడున్నావని తాను ప్రశ్నించినట్లు సానియా చెప్పింది.

బయట వ్యక్తుల నుంచి వచ్చే ప్రశ్నలు ఇలా ఉంటే అన్నీ తెలిసిన సొంత బంధువులు కూడా ఇలాంటి ప్రశ్నలు వేయడం చాలా ఆవేదన కలిగిస్తుందని సానియా మీర్జా చెప్పుకొచ్చింది. వారు వేసే ప్రశ్నలతో మనపై మనకే అనుమానం వచ్చేలా ఉంటాయని చెప్పుకొచ్చింది.

Story first published: Thursday, October 3, 2019, 16:58 [IST]
Other articles published on Oct 3, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X