న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

నేను అమ్మాయినే, 4గేళ్ల నుంచి పెళ్లి దాకా: సానియా

హైదరాబాద్: తాను 29 ఏళ్లకే పుస్తకం రాస్తానని అనుకోలేదని, మూడోసారి ఒలింపిక్స్ బరిలో దిగబోతున్నానని, కోట్లాది మంది భారతీయుల ఆకాంక్షలు తన పైన ఉన్నాయని, వారి నమ్మకాన్ని నిలబెట్టేందుకు వంద శాతం ప్రయత్నిస్తానని టెన్నిస్ తార సానియా మీర్జా అన్నారు.

బుధవారం ఫలక్‌నుమా ప్యాలెస్‌లో సానియా ఆత్మకథ 'ఏస్‌ ఎగైనెస్ట్ ఆడ్స్‌'ను ఆమెతో కలిసి బాలీవుడ్ నటుడు షారుక్‌ ఖాన్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడారు. పీటీ ఉష, మేరీ కోమ్‌, సానియా లాంటి క్రీడాకారిణులు తమ ప్రదర్శనలతో దేశంలో ఎంతోమంది అమ్మాయిలు క్రీడల పట్ల ఆసక్తి చూపేలా చేశారన్నారు.

ఉద్వేగానికి లోనైన సానియా మిర్జా: షారుఖ్ చేతుల మీదగా ఆటోబయోగ్రఫీఉద్వేగానికి లోనైన సానియా మిర్జా: షారుఖ్ చేతుల మీదగా ఆటోబయోగ్రఫీ

సానియా ఎన్నో అడ్డంకులను అధిగమించిందని, క్రీడలపై వచ్చే సినిమాలు అందరిలోనూ స్ఫూర్తి రగిలిస్తాయని,నేను గతంలో చక్‌దే ఇండియా సినిమా తీశానని, కుదిరితే సానియా మీర్జా పైనా సినిమా తీస్తానని చెప్పారు. సానియా సాధించిన ఘతన ఇప్పటి క్రీడాకారులకు స్ఫూర్తిదాయకమన్నారు. ఆరేళ్ళ వయసులో రాకెట్‌ పట్టిన సానియా ఎన్నో ఒడుదొడుకులు ఎదుర్కొని ఈస్థాయికి చేరుకుందన్నారు.

 ఏస్‌ ఎగైనెస్ట్ ఆడ్స్‌

ఏస్‌ ఎగైనెస్ట్ ఆడ్స్‌

ధృడమైన సంకల్పం ఉంటే ఏదైనా సాధించొచ్చని, అందుకు టెన్నిస్ స్టార్ సానియా మీర్జా జీవితమే ఆదర్శమని బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ అన్నారు.

 ఏస్‌ ఎగైనెస్ట్ ఆడ్స్‌

ఏస్‌ ఎగైనెస్ట్ ఆడ్స్‌

అందరిలాగే సానియా జీవితంలోనూ ఒడిదుడుకులున్నాయనీ, కానీ వాటన్నింటినీ విజయవంతంగా అధిగమించి రాకెట్ రారాణిగా ఎదిగిన ఆమె తీరు అందరికీ స్ఫూర్తిదాయకమన్నారు.

 ఏస్‌ ఎగైనెస్ట్ ఆడ్స్‌

ఏస్‌ ఎగైనెస్ట్ ఆడ్స్‌

ఓ పీటీ ఉష, ఓ మేరీకామ్ స్థాయిలో సానియా దేశం గర్వించదగ్గ స్థాయిలో విజయాలు సాధించారన్నారు. సానియా స్ఫూర్తితో దేశంలో ఎంతోమంది చిన్నారులు ఆటలపట్ల మక్కువ చూపుతుండడం మనకు గర్వకారణమని, సానియా విజయాల్లో తల్లిదంవూడుల పాత్ర చాలా ప్రశంసనీయమైనదన్నారు.

ఏస్‌ ఎగైనెస్ట్ ఆడ్స్‌

ఏస్‌ ఎగైనెస్ట్ ఆడ్స్‌

ఇంత చిన్నవయసులోనే ఆత్మకథ పూర్తిచేయగలిగేంత అనుభవాన్ని సంపాదించుకున్న సానియాను ప్రశంసించకుండా ఉండలేమని షారుక్ అన్నారు.

ఏస్‌ ఎగైనెస్ట్ ఆడ్స్‌

ఏస్‌ ఎగైనెస్ట్ ఆడ్స్‌

ప్రత్యేకంగా తన పుస్తక ఆవిష్కరణ కోసం హైదరాబాద్ వచ్చినందుకు షారుక్‌కు కృతజ్ఞతలు చెబుతున్నానని సానియా మీర్జా అన్నారు.

ఏస్‌ ఎగైనెస్ట్ ఆడ్స్‌

ఏస్‌ ఎగైనెస్ట్ ఆడ్స్‌

గతంలో చాలా సందర్భాల్లో తాను చెప్పాలనుకొని ఆగిపోయిన అనేక అంశాలను ఈ పుస్తకంలో పొందుపర్చినట్లు సానియా చెప్పారు.

ఏస్‌ ఎగైనెస్ట్ ఆడ్స్‌

ఏస్‌ ఎగైనెస్ట్ ఆడ్స్‌

చాలామంది తనపై అహంకారి, కఠినమైన వ్యక్తి అని ముద్ర వేశారని, అయితే తాను సాధారణ అమ్మాయినేనని, తనలో భావోద్వేగాలు ఉంటాయని, ఈ పుస్తకం చదివితే తెలుస్తుందని సానియా చెప్పారు.

ఏస్‌ ఎగైనెస్ట్ ఆడ్స్‌

ఏస్‌ ఎగైనెస్ట్ ఆడ్స్‌

వివాదాస్పద రీతిలో జరిగిన తన పెళ్లి గురించి కూడా పుస్తకంలో ప్రస్తావించానని చెప్పారు. 2010లో వరుస గాయాల కారణంగా జీవితంలో క్లిష్టమైన దశను అనుభవించానని సానియా అన్నారు.

ఏస్‌ ఎగైనెస్ట్ ఆడ్స్‌

ఏస్‌ ఎగైనెస్ట్ ఆడ్స్‌

మొత్తం 40 అధ్యాయాలుగా ఉన్న ఆత్మకథ పుస్తకంలో నాలుగేళ్ల వయసు నుంచి సానియా జీవితంలో జరిగిన సంఘటనలను పొందుపరిచారు.

ఏస్‌ ఎగైనెస్ట్ ఆడ్స్‌

ఏస్‌ ఎగైనెస్ట్ ఆడ్స్‌

ప్రపంచ టెన్నిస్ మహిళల డబుల్స్‌లో నంబర్‌వన్ క్రీడాకారిణిగా ఎదిగే క్రమంలో తాను ఎదుర్కొన్న సవాళ్లు, ఆటుపోట్లను సానియా ఆత్మకథలో వివరించింది. హార్పర్ కొలిన్స్ సంస్థ ప్రచురించిన ఈ ఆత్మకథ దేశంలోని ప్రముఖ బుక్‌షాపుల్లో లభ్యమవుతుంది.

Story first published: Wednesday, November 15, 2017, 12:24 [IST]
Other articles published on Nov 15, 2017
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X