న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కెరీర్‌లోనే తొలిసారి: సిలికాన్‌ వాలీ క్లాసిక్‌ టోర్నీ చిత్తుగా ఓడిన సెరెనా

By Nageshwara Rao
Serena Williams suffers worst defeat of career to Johanna Konta in San Jose

వాషింగ్టన్: అమెరికా టెన్నిస్ స్టార్ సెరెనా విలియమ్స్ తన కెరీర్‌లోనే అత్యంత చెత్తగా ఓడింది. ఇటీవలే ఇంగ్లాండ్ వేదికగా జరిగిన వింబుల్డన్‌ టోర్నీలో రన్నర్‌పగా నిలిచి జోరుమీదున్న సెరెనా విలియమ్స్‌కు ఊహించని షాక్ తగిలింది.

సొంతగడ్డపై జరుగుతున్న ముబాదల సిలికాన్‌ వాలీ క్లాసిక్‌ టోర్నీలో సెరెనా ఊహించని విధంగా తొలి రౌండ్‌లోనే అత్యంత దారుణంగా ఓటమిపాలైంది. బ్రిటన్‌ నంబర్‌వన్‌ క్రీడాకారిణి జొహన్నా కొంటా 6-1, 6-0తో సెరెనాను బోల్తా కొట్టించి రెండోరౌండ్‌ చేరింది.

51 నిమిషాల పాటు జరిగిన ఈ మ్యాచ్‌లో జొహన్నా ధాటికి సెరెనా ఏ దశలోనూ బదులివ్వలేకపోయింది. డబ్ల్యూటీఏ ప్రీమియర్ టోర్నీ అయిన ఇందులో ఆరో సీడ్‌గా బరిలోకి దిగిన జొహన్నా మ్యాచ్ ఆద్యంతం అద్భుత ప్రదర్శన చేసింది.

ఈ మ్యాచ్‌లో సెరెనా విలియమ్స్ 9 విన్నర్స్ సాధించి, 25 సార్లు అనవసకర తప్పిదాలు చేసింది. తద్వారా సెరెనా ఒకే ఒక గేమ్‌ నెగ్గింది. సెరెనా కెరీర్‌లోనే ఇలా జరగడం ఇదే తొలిసారి. అంతకు ముందు నాలుగేళ్ల క్రితం డబ్ల్యూటీఏ ఫైనల్స్‌లో సెరెనా 0-6, 2-6తో హలెప్‌ చేతిలో ఓడింది.

మ్యాచ్ అనంతరం సెరెనా విలియమ్స్ మాట్లాడుతూ "రెండో సెట్‌లో జొహన్నా అద్భుత ప్రదర్శన చేసింది. తొలి సెట్‌లో అనవసర తప్పిదాలు చేశా. అక్కడ నుంచి ఆమె మరింత ఆత్మవిశ్వాసంతో ఆడింది. ఇక, రెండో గేమ్‌ పూర్తిగా మారిపోయింది. తొలి గేమ్‌లో నెగ్గినా, రెండో గేమ్‌లో ఓడా" అని పేర్కొంది.

రెండో రౌండ్‌లో బ్రిటిష్‌ నంబర్ వన్ క్రీడాకారిణి జొహన్నా అమెరికాకు చెందిన సోఫియా కెనిన్‌తో తలపడనుంది. ఇతర మ్యాచ్‌ల్లో క్లారీ లుయిపై 6-4, 3-6, 6-4తేడాతో హీథర్ వాట్సన్ విజయం సాధించగా వాంగ్ కీయింగ్‌పై 6-2, 7-5తేడాతో అమన్నాద అనిసిమోవ నెగ్గింది.

Story first published: Thursday, August 2, 2018, 13:03 [IST]
Other articles published on Aug 2, 2018
Read in English: Serena hammered by Konta
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X