న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

సెరెనా 'బ్లాక్ ఫాంథర్' డ్రస్సు వెనుక పెద్ద కథే ఉంది (ఫోటోలు)

By Nageshwara Rao
Serena Williams on her Black Panther catsuit: Its my way of being a superhero

హైదరాబాద్: మాజీ ఛాంపియన్‌ సెరెనా విలియమ్స్‌ ప్రతిష్టాత్మక ఫ్రెంచ్‌ ఓపెన్‌లో శుభారంభం చేసింది. మంగళవారం జరిగిన మహిళల సింగిల్స్‌లో సెరెనా విలియమ్స్ రెండో రౌండ్‌కు దూసుకెళ్లింది. తొలి రౌండ్లో ఆమెకు గట్టి పోటీ ఎదురైంది. 23 గ్రాండ్‌స్లామ్‌ టైటిళ్ల విజేత సెరెనా 7-6 (4), 6-4తో ప్లిస్కోవా (చెక్‌)పై విజయం సాధించింది.

2017 ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ తర్వాత సెరెనాకు ఆడుతోన్న తొలి గ్రాండ్‌స్లామ్‌ ఇదే. గతేడాది సెప్టెంబర్‌లో సెరెనా విలియమ్స్ పండంటి బిడ్డకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత కొంత కాలం ఆమె టెన్నిస్ నుంచి విరామం తీసుకున్నారు. కోర్టులోకి సెరెనా రాగానే అభిమానులు హర్షధ్వానాలతో స్వాగతం పలికారు.

చాలా కాలం తర్వాత గ్రాండ్‌స్లామ్‌ టోర్నీ బరిలోకి దిగిన సెరెనా తన ఆటతోనే పాటు దుస్తులతోనూ అందరినీ ఆకర్షించింది. రోలాండ్ గారోస్ టోర్నీలో సెరెనా విలియమ్స్ నల్లటి 'క్యాట్‌సూట్'ను ధరించి 'బ్లాక్ ఫాంథర్'ను తలపించింది. సెరెనా గతంలో ఇలాంటి దుస్తులు ధరించినప్పటికీ, తల్లి అయిన తర్వాత ఈ 'క్యాట్‌సూట్‌' ధరించడంపై అంతా చర్చించుకున్నారు.

క్యాట్ సూట్ ధరించడం వెనుక పెద్ద కథ

అయితే, సెరెనా విలియమ్స్ ఈ క్యాట్ సూట్ ధరించడం వెనుక పెద్ద కథే ఉంది. గతేడాది సెప్టెంబర్‌లో సెరెనా విలియమ్స్ బిడ్డకు జన్మనిచ్చిన సమయంలో ప్రాణాలతో పోరాడింది. సెరెనా బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత వేరే గదికి తరలించారు. ఒకరోజు సెరెనాకు ఊపిరాడక పోవడంతో నోటితో శ్వాస తీసుకుంటూ గదిలో నుంచి బయటికి వచ్చి సీటీ స్కాన్‌ తీయాలని నర్సుకి చెప్పిందంట.

అల్ట్రాసౌండ్‌ స్కాన్‌ తీస్తానని చెప్పి

దీంతో వెంటనే నర్సు తాను ఇచ్చిన నొప్పి మందు వల్ల అలా జరిగిందేమోనని భావించి అల్ట్రాసౌండ్‌ స్కాన్‌ తీస్తానని చెప్పి అందుకు తగ్గ ఏర్పాట్లు చేసుకుంది. అయితే వెంటనే సెరెనా 'కడుపులో నొప్పి వల్ల కాదు.. నా శరీరంలో ఇంకేదో జరుగుతుంది సీటీ స్కానే తీయండి' అని మరోసారి నర్సును కోరింది. అయితే సెరెనా చెప్పిందేమీ వినిపించుకోకుండా వైద్యులు తొలుత అల్ట్రాసౌండ్‌ స్కాన్‌ చేసి అందులో ఏమీ లేదని తేల్చారు.

ఊపిరితిత్తుల్లో రక్తపు గడ్డలు

ఆ తర్వాత సీటీ స్కాన్‌ నిర్వహించగా.. ఊపిరితిత్తుల్లో రక్తపు గడ్డలు ఉన్నట్లు తేలింది. అప్రమత్తమైన వైద్యులు వెంటనే ఆమెకు ఆపరేషన్ చేసిన ఆ రక్తపు గడ్డలను తొలగించేశారు. అలా బిడ్డకు జన్మనిచ్చిన సమయంలో సెరెనా వైద్యపరమైన సమస్యలను ఎదుర్కొంది. దీని కారణంగానే ఈ తరహా సూట్‌ ధరించాల్సి వచ్చిందని మ్యాచ్‌ అనంతరం సెరెనా వెల్లడించింది.

పోరాట యోధురాలిగా ఫీలవుతాను

‘ఈ డ్రస్సులో నేను పోరాట యోధురాలిగా ఫీలవుతాను. ఓ రాణిలా నేను పోరాట యోధురాలినని అనుకుంటున్నా. నేను ఎప్పుడూ ఊహా ప్రపంచంలో జీవిస్తాను. సూపర్‌ హీరో అవ్వాలని అనుకుంటాను. ఇందులో భాగంగానే సూపర్‌ హీరో దుస్తులు ధరించాను' అని సరదాగా వ్యాఖ్యానించిన సెరెనా ఆ తర్వాత అసలు విషయం విలేకరులకు తెలిపింది.

రక్తపు గడ్డల కారణంగా చాలా సమస్యలు

‘నా శరీరంలో ఉన్న రక్తపు గడ్డల కారణంగా చాలా సమస్యలు ఎదుర్కొన్నాను. గత 12 నెలల్లో ఏం జరిగిందో ఆ దేవుడికే తెలుసు. ఇలాంటి బిగుతు దుస్తులు ధరించడం వల్ల రక్త ప్రసరణ సజావుగా ఉంటుందని వైద్యులు చెప్పారు. భవిష్యత్తులో ఎలాంటి సమస్యలు లేకుండా నా ఆటను కొనసాగించాలనుకుంటున్నా' అని సెరెనా విలియమ్స్ తెలిపింది.

Story first published: Wednesday, May 30, 2018, 12:51 [IST]
Other articles published on May 30, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X