న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

సరిగా నిద్ర పట్టడం లేదు.. నా కొడుకు షోయబ్‌ను ఎప్పుడు చూస్తాడో: సానియా

Sania Mirza said I don’t know when my son will be able to see his father again


హైదరాబాద్: మహమ్మారి కరోనా వైరస్ ప్రపంచాన్ని అతలాకుతలం చేసిన విషయం తెలిసిందే. ప్రమాదకర వైరస్ దెబ్బకు అన్ని దేశాలు లాక్‌డౌన్ విధించాయి. దీంతో ఎంతో మంది ప్రజలు ఆందోళన చెందుతున్నారు. భారత టెన్నిస్‌ స్టార్‌ సానియా మీర్జా కూడా తన కుటుంబం విషయంలో ఆందోళన పడుతున్నారు. సానియా, కొడుకు ఇజాన్ హైదరాబాద్‌లోని ఉండగా.. పాకిస్థాన్‌ సీనియర్‌ బ్యాట్స్‌మన్, భర్త‌ షోయబ్‌ మాలిక్ పాకిస్తాన్‌లోని సియాల్‌కోట్‌లో ఉన్నారు. దీంతో సానియా ఆందోళన చెందుతున్నారు.

తన బ్యాటింగ్ విజయ సూత్రాన్ని వెల్లడించిన రోహిత్ శర్మ!!తన బ్యాటింగ్ విజయ సూత్రాన్ని వెల్లడించిన రోహిత్ శర్మ!!

 షోయబ్‌ను ఇజాన్ ఎప్పుడు చూస్తాడో:

షోయబ్‌ను ఇజాన్ ఎప్పుడు చూస్తాడో:

అమెరికాకు టెన్నిస్ టోర్నమెంట్ కోసం వెల్లిన సానియా లాక్‌డౌన్ ముందు హైదరాబాద్ చేరుకోగా.. పాకిస్తాన్ సూపర్ లీగ్‌లో ఆడుతూ షోయబ్ మాలిక్ అక్కడే చిక్కుకుపోయారు. ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌ నిర్వహించిన ఫేస్‌బుక్ లైవ్‌లో సానియా మాట్లాడుతూ... 'పాకిస్తాన్ సూపర్ లీగ్‌లో ఆడుతూ షోయబ్ అక్కడే చిక్కుకున్నాడు. నేను లాక్‌డౌన్ ముందు అమెరికా నుంచి హైదరాబాద్ వచ్చా. దీంతో ఇజాన్‌ను చూసుకోవడం కొంచెం కష్టంగా ఉంది. ప్రస్తుత పరిస్థితిలో ఇజాన్ తన తండ్రిని ఎప్పుడు చూస్తాడో తెలియదు' అని తెలిపారు.

సరిగా నిద్ర పట్టడం లేదు:

సరిగా నిద్ర పట్టడం లేదు:

'షోయబ్‌, నేను ప్రాక్టికల్. ఇద్దరం చాలా సానుకూలంగా ఆలోచిస్తాం. షోయబ్‌కు 65 ఏళ్లు పైబడిన తల్లి ఉంది. ఈ కఠిన సమయంలో అతను అక్కడ ఉండడమే మంచిది. మేము ఆరోగ్యంగా ఉన్నాం. ఈ వైరస్ భారి నుండి అందరం సురక్షితంగా బయటపడాలని నేను కోరుకుంటున్నా. గత రెండు రోజుల నుండి సరిగా నిద్ర పట్టడం లేదు. కొన్ని విషయాలు నా మనసులో మెదులుతుండడంతో అనిశ్చితిగా ఉంది. ఇంట్లో చిన్న పిల్లాడు, తల్లిదండ్రులు ఉన్నారు. వారిని ఎలా కాపాడుకోవాలని నా మెదడులో ఆలోచనలు తిరుగుతున్నాయి. ఈ సమయంలో టెన్నిస్ గురించి ఆలోచించడం లేదు' అని సానియా పేరొన్నారు. ఇది రంజాన్ నెల కాబట్టి అవసరమైన వారికి సహాయపడటానికి సానియా ముందగువేసిన విషయం తెలిసిందే. మరోవైపు వలస కూలీల కోసం కూడా రూ .3.3 కోట్లు సేకరించారు.

 సాంప్రదాయ పద్దతిలో పెళ్లి:

సాంప్రదాయ పద్దతిలో పెళ్లి:

సానియా మీర్జా, షోయబ్‌ మాలిక్‌ల వివాహం 2010 ఏప్రిల్ 12న జరిగింది. హైదరాబాద్‌లో సాంప్రదాయ పద్దతిలో షోయబ్ మాలిక్‌ను సానియా మీర్జా వివాహం చేసుకుంది. వీరికి 2018లో ఓ కుమారుడు జన్మించాడు. అతని పేరు ఇజాన్ మీర్జా మాలిక్. ఇటీవల ఫెడ్‌ కప్‌ టెన్నిస్‌ టోర్నమెంట్‌ సందర్భంగా సానియా తన కొడుకును కూడా అక్కడకు తీసుకెళ్లిన విషయం తెలిసిందే. అక్కడి ఓ ఫొటోను తన ఇన్‌స్ట్రాగ్రామ్‌లో పోస్ట్‌ చేస్తూ... 'ఈ ఫొటోలోనే నా జీవితం. నాకు మరో మార్గం లేదు. నా పని నేను ఉత్తమంగా చేయడానికి ఇజాన్ నన్ను ఎక్కువగా ప్రోత్సహిస్తాడు' అనే క్యాప్షన్‌ సానియా పెట్టారు.

 ఫెడ్ క‌ప్ హార్ట్ అవార్డు కైవ‌సం:

ఫెడ్ క‌ప్ హార్ట్ అవార్డు కైవ‌సం:

ప్రతిష్టాత్మక ఫెడ్ కప్ హార్ట్ అవార్డును సానియా మీర్జా ఇటీవలే కైవసం చేసుకున్నారు. దీంతో ఈ ఘ‌న‌త సాధించిన తొలి ఇండియ‌న్ ప్లేయ‌ర్‌గా రికార్డుల‌కెక్కారు. ఆసియా/ఓషియానియా జోన్ నుంచి సానియా ఈ అవార్డుకు ఎంపికయ్యారు. ఆన్‌లైన్ ద్వారా నిర్వ‌హించిన పోలింగ్‌లో ఇండోనేసియాకు చెందిన ప్రిస్కా మాడెలీన్ నుగ్రోహోను సానియా ఓడించారు. మొత్తం పోలైన ఓట్ల‌లో 60 శాతానికి ‌పైగా ఓట్లు సానియా సాధించ‌డం విశేషం.

Story first published: Saturday, May 16, 2020, 11:20 [IST]
Other articles published on May 16, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X