న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

నాకూ కరోనా వచ్చింది.. వైరస్ జోక్ కాదు: సానియా

Sania Mirza reveals being tested positive for coronavirus, Shared emotional post

హైదరాబాద్: ఇటీవలే తాను కరోనా వైరస్ పాజిటివ్‌గా తేలినట్లు భారత టెన్నిస్‌ స్టార్‌ సానియా మీర్జా ఆలస్యంగా తెలిపారు. ఈ నెల ఆరంభంలో తనకు కరోనా పాజిటివ్‌గా వచ్చినట్టు ఇన్‌స్టాగ్రామ్‌ పోస్టులో చెప్పారు. దేవుడి దయ వల్ల ప్రస్తుతం అంతా బాగానే ఉందని, అయినప్పటికీ తన అనుభవాన్ని పంచుకోవాలన్న ఉద్దేశంతో ఈ విషయాన్ని వెల్లడిస్తున్నట్టు సానియా పేర్కొన్నారు. వైరస్ బారినపడినప్పటికీ పెద్దగా లక్షణాలు కనిపించలేదని, అయినప్పటికీ తాను ఐసోలేషన్‌లోనే ఉన్నానని హైదరాబాద్ స్టార్ చెప్పారు.

నాకూ కరోనా వచ్చింది:

నాకూ కరోనా వచ్చింది:

'కొత్త ఏడాదిలో ఏం జరిగిందో చెప్పాలనుకుంటున్నా. నాకు కరోనా పాజిటివ్‌ వచ్చింది. అయితే దేవుడి దయ వల్ల ఇప్పుడు పూర్తి ఆరోగ్యంగా ఉన్నా. నా అనుభవాల్ని పంచుకోవాలని అనుకుంటున్నా. వైరస్ లక్షణాలేవీ లేకపోవడం నా అదృష్టం. అయినా కూడా ఐసోలేషన్‌లో ఉన్నా. నా రెండేళ్ల కుమారుడికి, కుటుంబానికి దూరంగా ఉండటమే అత్యంత కష్టంగా అనిపించింది' అని సానియా మీర్జా తన ఇన్‌స్టాగ్రామ్‌ పోస్టులో పేర్కొన్నారు.

నేను అదృష్టవంతురాలిని:

నేను అదృష్టవంతురాలిని:

కరోనా బారినపడి అందరికీ దూరంగా ఆసుపత్రులలో ఉన్నప్పుడు వారి కుటుంబాలు ఎలా గడిపాయోనన్న విషయాన్ని తాను ఊహించుకోలేకపోతున్నానని సానియా మీర్జా ఆవేదన వ్యక్తం చేశారు. రోజుకో కొత్త లక్షణం కనిపించినప్పుడు ఎదుర్కోవడం కష్టంగా ఉంటుందని..భౌతికంగా, మానసికంగా ఎంతో మథనపడతామన్నారు. మహమ్మారి నుంచి బయటపడిన తర్వాత తానో విషయాన్ని చెప్పాలనుకుంటున్నానని, కొద్దో గొప్పో తాను అదృష్టవంతురాలినని సానియా అన్నారు.

వైరస్ జోక్ కాదు:

వైరస్ జోక్ కాదు:

కుటుంబం నుంచి దూరంగా ఉండడం మాత్రం భయంకరమైన విషయమని భారత టెన్నిస్‌ స్టార్‌ సానియా మీర్జా చెప్పుకొచ్చారు. కుటుంబ సభ్యులను తిరిగి ఎప్పుడు చూస్తామో తెలియదని, ఎందుకంటే ఈ వైరస్ జోక్ కాదన్నారు. వైరస్ ఇప్పటికీ వ్యాప్తి చెందుతూనే ఉందని.. స్నేహితులు, కుటుంబాలను కాపాడుకోవడానికి అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సానియా సూచించారు. మనల్ని, మన ఆత్మీయుల్ని కాపాడుకోవడానికి మాస్కులు ధరించాలని, చేతులు శుభ్రంగా కడుక్కోవాలని సానియా కోరారు.

India vs Australia: గబ్బా కోటకు బీటలు.. నమోదైన పలు రికార్డులు ఇవే!!

Story first published: Wednesday, January 20, 2021, 8:59 [IST]
Other articles published on Jan 20, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X