India vs Australia: గబ్బా కోటకు బీటలు.. నమోదైన పలు రికార్డులు ఇవే!!

హైదరాబాద్: 'విరాట్ కోహ్లీ లేకుండా ఆస్ట్రేలియా గడ్డపై భారత జట్టు టెస్టు సిరీస్ గెలిస్తే.. ఏడాది మొత్తం సంబురాలు చేసుకోవచ్చు' అని సిరీస్ ఆరంభానికి ముందు ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ క్లార్క్ అన్నాడు. మైఖేల్ వాన్ నుంచి రికీ పాంటింగ్ వరకు ప్రతీ ఒక్కరు ప్రతికూల వ్యాఖ్యలు చేసినవారే. అయితే వారి అంచనాలు తప్పని నిరూపిస్తూ టీమిండియా చెలరేగింది. గాయాల కారణంగా ప్రధాన ఆటగాళ్లు దూరమైనా.. ఆసీస్ బౌలింగ్‌ను యువ ఆటగాళ్లు ఉతికి ఆరేస్తుంటే.. ఆసీస్ కెప్టెన్ టిమ్ పైన్ ముఖంలో నెత్తురు చుక్కలేక వెలవెలబోయిన తీరును భారత అభిమానులు ఇప్పట్లో మరిచిపోరు. బోర్డర్-గావస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో జరిగిన నాలుగో టెస్టులో రహానే సేన 3 వికెట్లతో ఘన విజయం సాధించింది. ఆసీస్ నిర్దేశించిన 328 పరుగుల లక్ష్యాన్ని 97 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి ఛేదించింది.

గోడకు కొట్టిన బంతిలా:
తొలి టెస్టులో 36 పరుగులకే కుప్పకూలిన టీమ్‌ఇండియా ఇక కోలుకోవడం కష్టమే అనుకుంటే.. గోడకు కొట్టిన బంతిలా మిగిలిన మూడు మ్యాచ్‌ల్లో రెండింట నెగ్గి సిరీస్ చేజిక్కించుకుంది. కెప్టెన్ కోహ్లీ వ్యక్తిగత కారణాలతో స్వదేశానికి తిరుగు పయనమైనా.. అతడి స్థానంలో పగ్గాలు అందుకున్న రహానే జట్టును అద్భుతంగా ముందుకు నడిపాడు. నయావాల్ చతేశ్వర్ పుజారా గురించి ఎంతచెప్పినా తక్కువే. మూడో టెస్టు డ్రా కావడంతో పాటు నాలుగో టెస్టు చివర్లో ఆసీస్ పేసర్లు అలసిపోయేందుకు ప్రధాన కారణం అతడే. ఇక గిల్, పంత్ భయం లేని బ్యాటింగ్.. సుందర్, శార్దూల్ ఆల్‌రౌండ్ నైపుణ్యం భారత జట్టు భవిష్యత్తుపై భరోసానిచ్చాయి. అందరూ హీరోలవ్వడంతో కంగారూ గడ్డపై భారత్ రెండోసారి చిరస్మరణీయ విజయం సాధించింది. ఈ నేపథ్యంలోనే టెస్టు క్రికెట్‌లో పలు రికార్డులు నమోదయ్యాయి. అవేంటో ఓసారి చూద్దాం.

తొలి టెస్టు ఓడాక భారత్ సిరీస్ గెలిచిన సందర్భాలు:
1972/73 సీజన్‌లో స్వదేశంలో ఇంగ్లాండ్‌పై 2-1 తేడాతో గెలుపు
2000/01 సీజన్‌లో స్వదేశంలో ఆస్ట్రేలియాపై 2-1 తేడాతో గెలుపు
2015లో శ్రీలంక గడ్డపై ఆ జట్టుపైనే 2-1 తేడాతో విజయం
2016/17 సీజన్‌లో స్వదేశంలో ఆస్ట్రేలియాపై 2-1 తేడాతో విజయం
2020/21 సీజన్‌లో ఆస్ట్రేలియా గడ్డపై 2-1 తేడాతో గెలుపు

టెస్టుల్లో చివరి రోజు అత్యధిక పరుగులు చేసిన సందర్భాలు:
1948 లీడ్స్ : 404(ఆస్ట్రేలియా vs ఇంగ్లాండ్)
1984 లార్డ్స్ : 344 (వెస్టిండీస్ vs ఇంగ్లాండ్)
2020/21 బ్రిస్బేన్ : 325(భారత్ vs ఆస్ట్రేలియా)
1977/78 పెర్త్: 317(ఆస్ట్రేలియా vs భారత్)
2017 లీడ్స్: 317(వెస్టిండీస్ vs ఇంగ్లాండ్)

ఆస్ట్రేలియా గడ్డపై అత్యధిక పరుగుల ఛేదన:
2008/09 : పెర్త్ వేదికగా జరిగిన టెస్టులో దక్షిణాఫ్రికా 414 పరుగుల రికార్డు ఛేదన
1928/29 : మెల్‌బోర్న్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లాండ్ 332 పరుగుల ఛేదన
2020/21 : గబ్బా వేదికగా జరిగిన నాలుగో టెస్టులో భారత్ 329 పరుగుల ఛేదన

టెస్టుల్లో భారత్ అత్యధిక లక్ష్య ఛేదనలు:
1975/76 సీజన్‌లో వెస్టిండీస్‌పై 406 పరుగుల ఛేదన
2008/09 సీజన్‌లో ఇంగ్లాండ్‌పై 387 పరుగుల ఛేదన
2020/21 సీజన్‌లో ఆస్ట్రేలియాపై 328 పరుగుల ఛేదన
2011/12 సీజన్‌లో వెస్టిండీస్‌పై 276 పరుగుల ఛేదన
2001లో శ్రీలంకపై 264 పరుగుల ఛేదన

ఒకే వేదికపై ఓటమి లేకుండా అత్యధిక టెస్టులు ఆడిన జట్లు:
1955-2000 వరకు కరాచి స్టేడియంలో పాకిస్థాన్ 34 మ్యాచ్‌లు ఆడింది
1989-2019 వరకు గబ్బా మైదానంలో ఆస్ట్రేలియా 31 మ్యాచ్‌లు ఆడింది.
1948-1993 వరకు కెన్‌సింగ్టన్ ఓవల్ మైదానంలో వెస్టిండీస్ 27 మ్యాచ్‌లు ఆడింది
1905-1954 వరకు ఓల్డ్ ట్రాఫోర్డ్ మైదానంలో ఇంగ్లాండ్ 25 మ్యాచ్‌లు ఆడింది
1958-1989 వరకు సెబీనా పార్క్‌లో వెస్టిండీస్ 19 మ్యాచ్‌లు ఆడింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications