న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

టాప్ నుంచి సానియామీర్జా తప్పుకుందా.. తప్పించారా??

Sania Mirza, five wrestlers among eight dropped from TOP Scheme

హైదరాబాద్: ఒలింపిక్స్‌ను దృష్టిలో పెట్టుకుని పతకం సాధించే అవకాశాలున్న క్రీడాకారులకు ప్రత్యేకంగా కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ 'టాప్‌' ద్వారా ప్రోత్సాహాన్ని అందిస్తోంది. ఈ క్రమంలో.. గాయం కారణంగా కొద్దికాలంగా ఆటకు దూరంగా ఉంటున్న టెన్నిస్‌ స్టార్‌ సానియా మీర్జాను టాప్‌ పథకం నుంచి తప్పించింది. ఆమె ప్రస్తుతం గర్భవతి కావడం కూడా ఒక కారణం.

ఈ క్రమంలో.. తల్లి కాబోతున్న భారత టెన్నిస్‌ స్టార్‌ సానియా మీర్జా టార్గెట్‌ టాప్‌ పథకానికి దూరమైంది. భారత స్పోర్ట్స్‌ అథారిటీ (సాయ్‌) బుధవారం ఈ విషయాన్ని వెల్లడించింది. ఆమెతో పాటు ఐదుగురు రెజ్లర్లు, ఇద్దరు బాక్సర్లు కూడా ఈ జాబితాలో చోటు కోల్పోయారు.

కొత్తగా ఇద్దరు ట్రాక్‌ అండ్‌ ఫీల్డ్‌ అథ్లెట్లు ఎ. ధరుణ్, మోహన్‌ కుమార్‌ 'టాప్‌' ద్వారా లబ్ధి పొందనున్నారు. రెజ్లర్లు ప్రవీణ్‌ రాణా, సత్యవర్త్‌ కడియన్, సుమిత్, లలిత, సరిత... బాక్సర్లు ఎల్‌. దేవేంద్రో సింగ్, ఎస్‌. సర్జుబాలా దేవిలను 'టాప్‌' జాబితా నుంచి సాయ్‌ తొలిగించింది.

ప్రస్తుతం 192 మంది ఈ పథకంలో ఉన్నారు. వీరిలో 41 మంది మాత్రమే టోక్యో ఒలింపిక్స్‌ గేమ్స్‌ వరకు ఇందులో కొనసాగుతారు. మిగతా వారికి ఆసియా క్రీడల వరకే ఈ పథకం వర్తిస్తుంది. ఆటగాళ్ల ప్రదర్శనల ఆధారంగా కొత్త ఆటగాళ్లకు చోటు కల్పించడంతో పాటు, పురోగతి లేని క్రీడాకారులకు ఉద్వాసన కూడా పలుకుతారు.

Story first published: Thursday, May 24, 2018, 8:38 [IST]
Other articles published on May 24, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X