మరో రెండు నెలల పాటు టెన్నిస్‌కు సానియా దూరం

Posted By: Subhan
Sania Mirza to be off court for at least two more months

హైదరాబాద్: భారత స్టార్ టెన్నిస్ ప్లేయర్ సానియా మీర్జా కొంతకాలంగా మ్యాచ్‌కు దూరమైంది. ఇప్పుడు ఈ విరామం ఇంకాస్త పెరగనుంది. కుడి మోకాలి గాయం కారణంగా గత అక్టోబరు నుంచి ఆటకు దూరమైన సానియా ప్రస్తుతం చికిత్స తీసుకుంటోంది.

'ఇలా గాయంకావడం నాకు మొదటి సారి కాదు. ఇప్పటికే మూడు సార్లు సర్జరీలు చేయించుకున్నాను. ఇవన్నీ క్రీడాకారులకు సాధారణ విషయాలే. ఈ కొద్ది నెలల సమయం నా క్రీడా భవిష్యత్తుపై ప్రభావం చూపెడుతుందని అనుకోను. మోకాలి గాయం తగ్గడానికి ఇంకో రెండు నెలలపాటు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు. అందుకే విరామం కోరుకుంటున్నా. అంతేకానీ, పెయిన్ కిల్లర్లు వాడి త్వరగా కోలుకోవాలి అనే ఆలోచన లేదు' అని సానియామీర్జా తన ఆవేదనను వెల్లగక్కింది.

డబుల్స్‌లో గతంలో టాప్‌ర్యాంకుకు చేరిన సానియా ప్రస్తుతం 14వ ర్యాంకుకు పడిపోయింది. ఈ ఏడాది జరిగే ఆసియా క్రీడల్లో పాల్గొనే విషయంలో సందేహం వ్యక్తం చేసింది. ఇటీవలే జరిగిన ఆస్ట్రేలియన్ ఓపెన్ టోర్నీలో సైతం విరామం కారణంగా ఆడలేకపోయింది. మరోవైపు విదేశాల్లో చిన్నతనం నుంచే ప్రతి ఒక్కరికీ ఏదో ఒక క్రీడలో ప్రవేశం ఉంటుందని, ప్రస్తుతం మన దేశంలోనూ అలాంటి పరిస్థితి కనిపించడం శుభ పరిణామంగా ఉందని పేర్కొంది.

'క్రీడలు మనిషిని ఛాంపియన్‌ను చేయవు. అవి జీవనశైలి ఎలా ఉండాలో నేర్పుతాయి. ఓటమిని ఒప్పుకోవడం, విజయాన్ని సమర్థంగా నిలబెట్టుకోవడం వంటివి అలవడతాయి. నాకు ఇక్కడ ఓ టెన్నిస్ అకాడమీ ఉంది. దాని ఉద్దేశం క్రీడాకారులందరినీ వరల్డ్ ఛాంపియన్స్ చేస్తామని కాదు. క్రీడలు చక్కని వ్యక్తిత్వం అలవడేందుకు దోహదపడుతాయనే ఉద్దేశమే' అని సానియా మీర్జా పేర్కొంది.

తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.

Story first published: Monday, February 5, 2018, 10:47 [IST]
Other articles published on Feb 5, 2018
POLLS

Mykhel బ్రేకింగ్ అలర్ట్స్ పొందండి