న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పాకిస్థాన్‌తో చారిత్రాత్మక డేవిస్‌ కప్‌‌కు ఎంపికైన సాకేత్ మైనేని

Saketh Myneni returns to Indian Davis Cup team for Pakistan tie

హైదరాబాద్: పాకిస్థాన్‌తో జరిగే చారిత్రాత్మక డేవిస్‌ కప్‌ మ్యాచ్‌ కోసం ఎంపిక చేసిన భారత జట్టులో తెలుగు టెన్నిస్ ఆటగాడు సాకేత్‌ మైనేనికి చోటు దక్కింది. ఆసియా ఓసియానియా గ్రూప్‌-1 మ్యాచ్‌ కోసం రోహిత్‌ రాజ్‌పాల్‌ అధ్యక్షతన సోమవారం సమావేశమైన అఖిల భారత టెన్నిస్‌ సంఘం (ఏఐటీఏ) ఐదుగురు సభ్యులతో కూడిన భారత జట్టును ప్రకటించింది.

<strong>నువ్వు నిజమైన చాంపియన్: డేల్ స్టెయిన్ రిటైర్మెంట్‌పై కోహ్లీ</strong>నువ్వు నిజమైన చాంపియన్: డేల్ స్టెయిన్ రిటైర్మెంట్‌పై కోహ్లీ

సింగిల్స్‌ విభాగంలో భారత టాప్‌ ఆటగాళ్లయిన ప్రజ్నేశ్‌ గుణేశ్వరన్, రామ్‌కుమార్‌ రామనాథన్‌లను ఎంపిక చేయగా.... డబుల్స్‌ విభాగంలో రోహన్‌ బోపన్న-దివిజ్‌ శరణ్‌ జోడీని ఎంపిక చేసింది. గాయం కారణంగా తాను అందుబాటులో ఉండనని సుమీత్‌ నగల్‌ సమాచారం అందించడంతో.. సాకేత్‌ను సెలెక్షన్‌ ప్యానెల్‌ ఎంపిక చేసింది.

గతవారం చైనాలో జరిగిన చెంగ్డూ చాలెంజర్‌ టూర్‌ సిరీస్‌ టోర్నీ డబుల్స్‌ టైటిల్‌ను గెలిచిన సాకేత్‌ మైనేని... ఈ ఏడాది ఫిబ్రవరిలో ఇటలీతో కోల్‌కతాలో జరిగిన వరల్డ్‌ గ్రూప్‌ క్వాలిఫయర్‌ మ్యాచ్‌లో మాత్రం ఆడలేదు. గతేడాది సెప్టెంబర్‌లో సెర్బియాతో జరిగిన వరల్డ్‌ గ్రూప్‌ ప్లే ఆఫ్‌ మ్యాచ్‌లో చివరిసారిగా సాకేత్‌ బరిలోకి దిగాడు.

1964 తర్వాత డేవిస్ కప్ కోసం భారత టెన్నిస్ ప్లేయర్లు తొలిసారి పాక్‌ గడ్డపై అడుగుపెట్టబోతున్నారు. ఇస్లామాబాద్‌ వేదికగా సెప్టెంబర్‌ 14, 15 తేదీల్లో డేవిస్‌ కప్‌ పోరులో భారత్‌-పాకిస్తాన్‌ జట్లు తలపడనున్నాయి. యువ ఆటగాడు శశికుమార్‌ ముకుంద్‌ రిజర్వ్‌ సభ్యుడిగా ఎంపికయ్యాడు. ఈ జట్టుకు నాన్‌ ప్లేయింగ్‌ కెప్టెన్‌గా మహేశ్‌ భూపతి, కోచ్‌గా జీషన్‌ అలీ వ్యవహరించనున్నారు.

<strong>యాషెస్‌ సిరీస్: స్మిత్‌ బాగా ఆడాడు.. పునరాగమనం అద్భుతం</strong>యాషెస్‌ సిరీస్: స్మిత్‌ బాగా ఆడాడు.. పునరాగమనం అద్భుతం

పాక్‌తో ఇప్పటిదాకా ఆడిన ఆరు డేవిస్‌ కప్‌ సమరాల్లో భారత్‌ ఎప్పుడూ ఓడిపోలేదు. ఈ డేవిస్ కప్‌లో ఇరు జట్లు ఇప్పటివరకు 6 సార్లు తలపడగా అన్నీ సార్లు టీమిండియానే విజయం సాధించింది.

Story first published: Tuesday, August 6, 2019, 12:45 [IST]
Other articles published on Aug 6, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X