న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Rules are rules!: అక్రిడేషన్ పాస్ మరిచిపోయాడు.. ఫెదరర్‌కు చేదు అనుభవం

Rules are rules! Roger Federer forgets accreditation pass, denied entry into Australian Open locker room

హైదరాబాద్: ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో టెన్నిస్ దిగ్గజం రోజర్ ఫెదరర్‌కు చేదు అనుభవం ఎదురైంది. అక్రిడేషన్ మర్చిపోయినందుకు గాను రోజర్ ఫెదరర్‌ను డ్రెస్సింగ్‌ రూంలో వెళ్లకుండా అక్కడి సిబ్బంది అడ్డుకున్నారు. అక్రిడేషన్ పాస్ లేకపోవడంతో ఫెదరర్ తన సపోర్ట్ సిబ్బంది వచ్చే వరకు అక్కడే వేచి ఉండాల్సి పరిస్థితి తలెత్తింది.

ఈ బంతిని తీసుకో... లేదంటే నేను రిటైరవుతున్నానని మళ్లీ అంటారేమో: ధోని ఛలోక్తిఈ బంతిని తీసుకో... లేదంటే నేను రిటైరవుతున్నానని మళ్లీ అంటారేమో: ధోని ఛలోక్తి

అందరితో పాటే రోజర్ ఫెదరర్ ఓపికగా నిలబడగా.. ఆయన కోచ్ ఇవాన్ జుబిసిస్ వెంటనే అక్కడికి వచ్చాడు. ఆయన ఐడీ కార్డ్ చూపించిన తర్వాత గానీ ఫెదరర్‌ను ఆస్ట్రేలియన్ ఓపెన్ నిర్వాహకులు లోపలికి అనుమతిచలేదు. ఇందుకు సంబంధించిన వీడియోని ఆస్ట్రేలియన్ ఓపెన్ తన అధికారిక ట్విట్టర్‌లో అభిమానులతో పంచుకుంది.

రోజర్ ఫెదరర్‌కి కూడా అక్రిడేషన్ కావాలంటూ ట్వీట్ చేసింది. దీంతో ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఆస్ట్రేలియన్ ఓపెన్ నిబంధనల ప్రకారం ఆటగాళ్లు, కోచ్‌లు, అధికారులు, మీడియా ప్రతినిధులు అక్రిడేషన్ కార్డులను తీసుకెళ్లడం తప్పనిసరి. ఐడీ కార్డులు లేకపోవడంతో ఆటగాళ్లను నిలిపేయడం ఇదే తొలిసారి కాదు.

గతంలో మరియా షరపోవాను కూడా ఐడీ కార్డు కోసం కారిడార్లో నిలిపేశారు. ఆటగాళ్లకు ఇచ్చిన అక్రిడేషన్ కార్డుపై సంబంధిత వ్యక్తుల ప్రాథమిక సమాచారంతోపాటు బార్ కోడ్ కూడా ఉంటుంది. సెక్యూరిటీ చెక్ పాయింట్లలో దాన్ని స్కాన్ చేస్తారు. ఇదిలా ఉంటే ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో రోజర్ ఫెదరర్ ప్రిక్వార్టర్‌‌కు ప్రవేశించాడు.

శుక్రవారం రాడ్‌ లావెర్‌ ఎరీనాలో జరిగిన మూడో రౌండ్‌ పోరులో డిఫెండింగ్‌ చాంపియన్‌ ఫెదరర్‌ 6-2, 7-5, 6-2 స్కోరుతో భారీ సర్వీసుల అమెరికా ఆటగాడు టేలర్‌ ఫ్రిట్జ్‌ను చిత్తు చేసిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో 10 ఏస్‌లతో పాటు 34 విన్నర్లు కొట్టాడతను. సెంటర్‌ కోర్టులో 100వ విజయం సాధించిన ఫెదరర్‌కు ఈ టోర్నీలో 17వ సారి నాలుగో రౌండ్‌కు చేరడం విశేషం.

Story first published: Saturday, January 19, 2019, 16:47 [IST]
Other articles published on Jan 19, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X