French Open 2021:అర్ధంతరంగా తప్పుకున్న ఫెడరర్..సెరెనా, అజరెంకాలకు షాక్‌!క్వార్టర్స్‌లో బోపన్న జోడీ!

పారిస్‌: మాజీ టెన్నిస్ నంబర్‌వన్, స్విట్జర్లాండ్‌ స్టార్‌ రోజర్‌ ఫెడరర్ ఫ్రెంచ్‌ ఓపెన్‌ 2021 నుంచి అర్ధంతరంగా వైదొలిగాడు. డొమినిక్‌ కెఫర్‌ (జర్మనీ)తో హోరాహోరీగా సాగిన మూడో రౌండ్‌ పోరులో 7-6 (7/5), 6-7 (3/7), 7-6 (7/4), 7-5తో గెలిచి ప్రిక్వార్టర్స్‌ చేరిన తర్వాత ఫెడెక్స్ ఈ నిర్ణయాన్ని వెల్లడించాడు. మోకాలికి శస్త్ర చికిత్స చేయించుకున్న తనకు మరింత విశ్రాంతి కావాలని చెప్పాడు. ఆపరేషన్ తర్వాత మూడు గంటల 35 నిమిషాలు ఓ మ్యాచ్ ఆడటం సాధారణ విషయం కాదని ఫెడరర్ పేర్కొన్నాడు. స్విస్ మాస్ట‌ర్‌.. త‌న ఆల్‌టైమ్ ఫేవ‌రెట్ వింబుల్డ‌న్‌కే ఎక్కువ ప్రాధాన్య‌త ఇస్తున్నాడు. జూన్ 28 నుంచి వింబుల్డ‌న్ ప్రారంభం కాబోతోంది.

'టీమిండియాకు మంచి ఫినిషర్ కావాలి.. ఆ బాధ్యతను నేను తీసుకుంటా! టీ20 ప్రపంచకప్‌లలో ఆడతా'

'మా బృందంతో చర్చించిన తర్వాత ఫ్రెంచ్‌ ఓపెన్‌ నుంచి వైదొలగాలని నిర్ణయించుకున్నా. మోకాలికి రెండు శస్త్ర చికిత్సలు జరిగాయి. ఆటకు ఏడాదికి పైగా విరామం వచ్చింది. ఈ స్థితిలో నా శరీర స్పందనలకు తగ్గట్టుగా నడుచుకోవడం ముఖ్యం. పూర్తిగా కోలుకునే దిశగా ఉన్న స్థితిలో శరీరాన్ని ఎక్కువ శ్రమ పెట్టాలనుకోవట్లేదు. ఈసారి రొలాండ్‌ గారోస్‌లో 3 మ్యాచ్‌లు గెలిచాను.. అది చాలు! త్వరలోనే మళ్లీ కలుస్తా' అని 20 సార్లు గ్రాండ్‌స్లామ్ టైటిల్ విజేత రోజర్‌ ఫెదరర్‌ ట్వీట్‌ చేశాడు. ఫెడెక్స్ తప్పుకోవడంతో ప్రిక్వార్టర్స్‌లో అతడి ప్రత్యర్థి మాటో బెరిటిని (ఇటలీ) నేరుగా క్వార్టర్‌ఫైనల్‌ చేరుకున్నాడు.

గ్రీసు కుర్రాడు స్టెఫానోస్‌ సిట్సిపాస్‌ ఫ్రెంచ్‌ ఓపెన్‌ క్వార్టర్‌ఫైనల్లో ప్రవేశించాడు. ఆదివారం జరిగిన పురుషుల సింగిల్స్‌ ప్రిక్వార్టర్స్‌లో అయిదో సీడ్‌ సిట్సిపాస్‌ 6-3, 6-2, 7-5తో పాబ్లో కారెనో బస్టా (స్పెయిన్‌)పై సునాయాస విజయం సాదించాడు. రెండో సీడ్‌ డానియల్‌ మెద్వెదెవ్‌ (రష్యా) కూడా క్వార్టర్స్‌ చేరాడు. ప్రిక్వార్టర్స్‌లో మెద్వెదెవ్‌ 6-2, 6-1, 7-5తో క్రిస్టియన్‌ గారిన్‌ (చిలీ)పై విజయం సాధించాడు. మట్టికోట మహారాజు రఫేల్‌ నాదల్‌ తరహాలో.. ఎర్రమట్టిపై తనకు ఎదురులేదన్నట్లు విజృంభిస్తున్న మెద్వెదెవ్‌ ప్రత్యర్థికి ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా వరుస సెట్లలో మ్యాచ్‌ను సొంతం చేసుకున్నాడు. క్వార్టర్స్‌లో సిట్సిపాస్‌తో మెద్వెదెవ్‌ అమీతుమీ తేల్చుకోనున్నాడు.

అమెరికా దిగ్గజం సెరెనా విలియమ్స్‌కు షాక్‌ తగిలింది. ప్రిక్వార్టర్స్‌లో 21వ సీడ్‌ ఎలీనా రిబకినా (ఉక్రెయిన్‌) 6-3, 7-5తో ఏడో సీడ్‌ విలియమ్స్‌ను ఓడించింది. తొలి సెట్‌ కోల్పోయినా.. రెండో సెట్లో పోరాడిన సెరెనా ఒక దశలో 5-5తో స్కోరు సమం చేసింది. కానీ పదకొండో గేమ్‌లో సర్వీస్‌ కోల్పోయిన విలియమ్స్‌.. ఆ తర్వాత సెట్‌తో పాటు మ్యాచ్‌ను కూడా చేజార్చుకుని టోర్నీ నుంచి నిష్క్రమించింది. బెలారస్‌ స్టార్‌ విక్టోరియా అజరెంకాకు చెక్‌ పెడుతూ అనస్తేసియా పవ్లిచెంకోవా క్వార్టర్స్‌కు దూసుకెళ్లింది. ప్రిక్వార్టర్స్‌లో ఈ రష్యా అమ్మాయి 5-7, 6-3, 6-2తో అజరెంకాను ఓడించింది. 2011లో చివరిగా ఆమె రొలాండ్‌ గారోస్‌లో క్వార్టర్స్‌ చేరింది.

పురుషుల డబుల్స్‌లో రోహన్‌ బోపన్న-ఫ్రాంకో కుగర్‌ (క్రొయేషియా) జంట క్వార్టర్‌ఫైనల్‌ చేరింది. ప్రిక్వార్టర్స్‌లో మిడిల్‌కాప్‌ (నెదర్లాండ్స్‌)-మార్సెలో (ఎల్‌ సాల్వడార్‌)తో బోపన్న జంట తలపడాల్సి ఉండగా.. ప్రత్యర్థి పోటీ నుంచి తప్పుకుంది. సోమవారం జరిగే క్వార్టర్స్‌లో బోపన్న జంట మార్టినెజ్‌-అండుజార్‌ (స్పెయిన్‌)తో తలపడనున్నారు.

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
Story first published: Monday, June 7, 2021, 7:27 [IST]
Other articles published on Jun 7, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X