న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

టెన్నిస్ హేమాహేమీలు అందరు ఒకే ఫ్రేంలో.. కెరీర్ చివరి టోర్నీ ఆడుతున్న ఫెదరర్ పోస్ట్..!

Roger Federer Posted A High Class Selfie With Tennis Legends Rafa, murray, Djokovic

టెన్నిస్ లెజెండ్ రోజర్ ఫెదరర్ రిటైర్మెంట్‌కు సిద్ధమయ్యాడు. తన కెరీర్ చివరి ఘడియల్లో ప్రతి క్షణాన్ని ఆస్వాదిస్తున్నాడు. తన కెరీర్‌లో చివరి మ్యాచ్ శుక్రవారం లావర్ కప్‌లో భాగంగా ఆడనున్నాడు. డబుల్స్‌లో రాఫెల్ నాదల్‌తో జతకట్టి ఈ దిగ్గజం తన చివరి మ్యాచ్ స్పెషల్‌గా ముగించబోతున్నాడు. గురువారం రాత్రి లావర్ కప్ ప్రారంభోత్సవం సందర్భంగా టెన్నిస్ ఫ్యాబ్ 4లోని ఇతర స్టార్ ప్లేయర్లతో కలిసి లండన్లో షికారుకు వెళ్లాడు. 'కొందరు స్నేహితులతో డిన్నర్‌కు వెళుతున్నాను' అని రోజర్ క్యాప్షన్‌ ఇచ్చి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. లండన్ బ్రిడ్జ్ వద్ద రాఫెల్ నాదల్, ఆండీ ముర్రే, నోవాక్ జొకోవిచ్‌లతో కలిసి దిగిన ఫోటోకు క్యాప్షన్ ఇచ్చాడు.

20గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ విజేత అయిన రోజర్ ఫెడరర్ లావర్ కప్ తన కెరీర్‌లో చివరి టెన్నిస్ టోర్నీ అని ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ స్విట్జర్లాండ్ స్టార్ ట్విటర్ వేదిక ఓ సుదీర్ఘ ప్రకటనను కూడా పోస్టు చేశాడు. 'లండన్ వేదికగా వచ్చే వారం జరగనున్న ది లావర్ కప్‌తో నా 24 ఏళ్ల సుదీర్ఘ కెరీర్‌కు ముగింపు పలకాలనుకుంటున్నానను. ఈ 24 ఏళ్ల టెన్నిస్ జీవితం 24 గంటల్లా అనిపిస్తోంది.'అంటూ ఆ ప్రకటనలో పేర్కొన్నాడు. 2003వింబుల్డన్‌లో విజేతగా నిలిచి తొలి గ్రాండ్‌స్లామ్ టైటిల్‌ను సొంతం చేసుకున్న ఫెడరర్.. కెరీర్ మొత్తం 6 ఆస్ట్రేలియా ఓపెన్, 8 వింబుల్డన్, 5 యూఎస్ ఓపెన్ టైటిళ్లతో పాటు ఒక ఫ్రెంచ్ ఓపెన్ గెలిచి పురుషుల సింగిల్స్‌లో 20గ్రాండ్‌స్లామ్‌ టైటిళ్లు సాధించిన తొలి ప్లేయర్‌గా చరిత్రకెక్కాడు.

ఇక గతేడాది వింబుల్డన్ క్వార్టర్ ఫైనల్లో ఓడిన ఫెడరర్.. మోకాలి గాయంతో ఆటకు దూరమయ్యాడు. టోక్యో ఒలింపిక్స్‌తో పాటు ఈ ఏడాది జరిగిన ఏ టోర్నీలోనూ పాల్గొనలేదు. ఫెడరర్‌కు ప్రస్తుతం 41ఏళ్లు. ఇప్పటికే రెండు సార్లు అతని మోకాలికి సర్జరీ కూడా చేయించుకున్నాడు. అయితే వయో భారం అతని ఆటపై ప్రభావం చూపింది. ఇటీవలే మహిళా టెన్నిస్ దిగ్గజం సెరెనా విలియమ్స్ వీడ్కోలు పలకగా..ఇప్పుడు ఫెడరర్ కూడా రిటైర్మెంట్ ప్రకటించడం టెన్నిస్ అభిమానులను కలవరపాటుకు గురిచేసింది. రాఫెల్ నాదల్(22), నొవాక్ జకోవిచ్ (21) తర్వాత అత్యధిక గ్రాండ్ స్లామ్ టైటిల్స్ నెగ్గిన ఆటగాడిగా ఫెడరర్ (20) గుర్తింపు పొందాడు.

Story first published: Friday, September 23, 2022, 9:36 [IST]
Other articles published on Sep 23, 2022
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X