ఏడిపించిన ఫెదరర్ - నాదల్: కంటతడి పెట్టని అభిమాని లేడు..!!

లండన్: కొన్నేళ్లపాటు టెన్నిస్‌ను శాసించిన స్విస్ స్టార్ రోజర్ ఫెదరర్ శకం ముగిసింది. తన కెరీర్‌లో చిట్ట చివరి మ్యాచ్ ఆడేశాడు. ఓటమితో ముగింపు పలికాడు. తన చిరకాల ప్రత్యర్థి రాఫెల్ నాదల్‌తో కలిసి ఆడిన డబుల్స్‌లో పరాజయాన్ని చవి చూశాడు. ఈ మ్యాచ్ ముగిసిన వెంటనే తన కేరీర్‌కు ముగింపు పలికినట్లు అధికారికంగా ప్రకటించాడు. ఆ సమయంలో కన్నీటి పర్యంతం అయ్యాడు ఫెదరర్. అతన్ని ఈ స్థితిలో చూసిన రాఫెల్ నాదల్ తీవ్ర భావోద్వేగానికి గురయ్యాడు.

లండన్‌లో జరిగిన డబుల్స్ మ్యాచ్‌లో నాదల్-ఫెదరర్ జోడీపై జాక్ సాక్- ఫ్రాన్సిస్ టియాఫో 4-6 7-6 11-9 తేడాతో విజయం సాధించింది. రోజర్ ఫెదరర్, రాఫెల్ నాదల్ బ్లూ కలర్ టీషర్ట్, వైట్ కలర్ షార్ట్స్ ధరించి.. కోర్ట్‌‌లోకి అడుగు పెట్టిన వెంటనే ప్రేక్షకులు లేచి నిల్చుని స్వాగతం పలికారు. గట్టిగా చప్పట్లు కొట్టారు. లెట్స్ గో రోజర్, లెట్స్ గో అంటూ నినదించారు. ఈ మ్యాచ్ ఆశించిన స్థాయిలో ఆడలేకపోయారీ టెన్నిస్ దిగ్గజాలు. ఓటమిని చవి చూశారు.

మ్యాచ్ ముగిసిన తరువాత ఫెదరర్ తన టీమ్‌తో పాటు ఇతర ప్లేయర్లతో కరచాలనం చేశాడు. భావోద్వేగానికి గురయ్యాడు. కన్నీటితో తన కేరీర్‌కు వీడ్కోలు పలకకూడదని నిర్ణయించుకున్నానని మ్యాచ్‌కు ముందు రోజర్ ఫెదరర్ తేల్చిచెప్పినా.. దాన్ని ఆచరణలో పెట్టలేకపపోయాడు. తన భావోద్వేగాలను నియంత్రించుకోలేకపోయాడు. తన కేరీర్‌లో చాలామంది ప్రోత్సహించారని, వారందరికీ కృతజ్ఞతలు చెబుతున్నానని ఫెదరర్ చెప్పాడు.

ప్రత్యేకించిన భార్య సపోర్ట్ కేరీర్‌లో ఎదగడానికి సహాయపడిందని పేర్కొన్నాడు. కేరీర్‌ను ఎప్పుడో ముగించడానికి అవకాశం ఉన్నప్పటికీ.. ఆమె అలా చేయలేదని, చివరివరకూ అండగా నిలిచిందని చెప్పాడు. పేరెంట్స్ లేకపోతే తాను ఇక్కడ ఉండేవాడిని కాదని అన్నాడు. రాకెట్ పట్టకుండా ఉండే రోజులను ఎలా ఎదుర్కోవాలో తెలియట్లేదని, అయినా వాటిని అధిగమించగలనంటూ ఫెదరర్ కన్నీళ్లు పెట్టుకున్నాడు.

అతను మాట్లాడుతున్న సమయంలో ఫెదరర్ భార్య, తల్లిదండ్రులు స్టాండ్స్‌లోనే ఉన్నారు. ఫెదరర్ మాట్లాడుతున్నంత సేపూ అతని చిరకాల ప్రత్యర్థి రాఫెల్ నాదల్ కన్నీరు పెట్టుకుంటూనే కనిపించడు. నోవాక్ జొకోవిచ్ కూడా ఫెదరర్‌ను చూస్తూ కన్నీటి పర్యంతం అయ్యాడు. 41 సంవత్సరాల రోజర్.. ఈ మధ్య టెన్నిస్‌కు వీడ్కోలు పలకబోతోన్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. లావెర్ కప్‌లో చివరి మ్యాచ్ ఆడనున్నట్లు చెప్పాడు. ఈ మ్యాచ్ ముగిసిన తరువాత రాకెట్‌కు దూరం అయ్యాడు.

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
Story first published: Saturday, September 24, 2022, 10:16 [IST]
Other articles published on Sep 24, 2022

Latest Videos

  + More
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Yes No
  Settings X