న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ నుంచి బియాంక ఔట్!!

Recovering Bianca Andreescu to miss Australian Open 2020

పారిస్‌: గతేడాది యూఎస్‌ ఓపెన్‌ విజేత, కెనడా టెన్నిస్‌ స్టార్‌ బియాంక ఆండ్రీస్కు సీజన్‌ తొలి గ్రాండ్‌స్లామ్‌ ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ నుంచి వైదొలిగింది. మోకాలి గాయం కారణంగా ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ నుంచి వైదొలగుతున్నానని ఆండ్రీస్కు ప్రకటించింది. చైనాలోని షెన్‌జెన్‌లో జరిగిన సీజన్-ఎండింగ్ డబ్ల్యూటీఏ ఫైనల్స్‌లో ఆమె మోకాలికి గాయమైంది.

మెరిసిన ధావన్.. శ్రీలంకపై భారత్ ఘన విజయం.. సిరీస్‌ కైవసం!!మెరిసిన ధావన్.. శ్రీలంకపై భారత్ ఘన విజయం.. సిరీస్‌ కైవసం!!

'నేను మెల్‌బోర్న్‌లో ఆడడానికి ఇష్టపడుతున్నా. కానీ.. గాయం నుంచి ఇంకా కోలుకోలేదు. ఇది చాలా కఠినమైన నిర్ణయం. ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌లో ఆడడం లేదు. నా పునరావాసం బాగా జరుగుతోంది. చికిత్స తీసుకొంటున్నా. నా ఆరోగ్యం రోజురోజుకూ మెరుగుపడుతోంది. అయితే, పూర్తిగా కోలుకునేందుకు కొంచెం సమయం పడుతుంది' అని 19 ఏళ్ల బియాంక ట్వీట్‌ చేసింది.

మరోవైపు ఆ్రస్టేలియన్‌ ఓపెన్‌లో రష్యా అందం మరియా షరపోవా ఆడనుంది. వైల్డ్‌ కార్డు ద్వారా మాజీ విజేత షరపోవా ఆ్రస్టేలియన్‌ ఓపెన్‌లో నేరుగా అడుగుపెట్టనుంది. గాయం కారణంగా గతేడాది మాజీ నంబర్‌వన్ షరపోవా ఎక్కువగా ఆటకు దూరమైంది. దాంతో ఆమె ర్యాంక్‌ 147కు పడిపోయింది. ర్యాంక్‌ ప్రకారం ఆ్రస్టేలియన్‌ ఓపెన్‌లో షరపోవాకు మెయిన్‌ 'డ్రా'లో చోటు దక్కలేదు. అయితే ఆ్రస్టేలియన్‌ ఓపెన్‌లో షరపోవా గత రికార్డును పరిగణనలోకి తీసుకొని టోర్నీ నిర్వాహకులు వైల్డ్‌ కార్డు ద్వారా అవకాశం ఇచ్చారు.

షెడ్యూల్ ప్రకారమే ఆ్రస్టేలియన్‌ ఓపెన్‌ గ్రాండ్‌స్లామ్‌ టెన్నిస్‌ టోర్నీ జరుగనుంది. ఈ నెల 20 నుంచి వచ్చే నెల 2 వరకు మెల్‌బోర్న్‌ పార్క్‌లో ఆ్రస్టేలియన్‌ ఓపెన్‌ గ్రాండ్‌స్లామ్‌ టెన్నిస్‌ టోర్నీ జరగనుంది. ఈ మేరకు టోర్నీ నిర్వాహకులు ఓ ప్రకటనలో తెలిపారు. ప్రస్తుతం ఆ్రస్టేలియాను ఉక్కిరిబిక్కిరి చేస్తున్న కార్చిచ్చు సెగ టోర్నీకి తగులుతుందనే వార్తల్ని నిర్వాహకులు కొట్టిపారేశారు.

ఈ టోర్నీ ప్రైజ్‌మనీ రూ.350 కోట్లు. గతేడాది పోల్చుకుంటే 13.6 శాతం పెరిగింది. ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ పురుషుల, మహిళల సింగిల్స్‌ విజేతలకు నగదు బాహుమతి రూపంలో రూ.20 కోట్లు దక్కనుంది. ఇక తొలి రౌండ్‌లో నిష్క్రమించే వారికి రూ.44 లక్షలు, రెండో రౌండ్‌లో నిష్క్రమించే వారికి రూ.63 లక్షలు దక్కనుంది.

Story first published: Sunday, January 12, 2020, 11:18 [IST]
Other articles published on Jan 12, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X