న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

డేవిస్‌ కప్‌ సింగిల్స్‌లో సెర్బియా చేతిలో భారత్‌ ఓటమి

Ramkumar, Prajnesh suffer defeats as Serbia lead India 2-0

హైదరాబాద్: సెర్బియాతో శుక్రవారం ప్రారంభమైన డేవిస్‌ కప్‌ వరల్డ్‌ గ్రూప్‌ ప్లే ఆఫ్‌లో తొలి రోజు రెండు సింగిల్స్‌లో భారత ఆటగాళ్లు ఓటమి పాలయ్యారు. యుఎస్‌ ఓపెన్‌ టైటిల్ విజేత నొవాక్‌ జొకోవిచ్‌ లేకపోయినా ఆ అవకాశాన్ని భారత జట్టు సద్వినియోగం చేసుకోలేకపోయింది.

తొలి సింగిల్స్‌లో రామ్‌కుమార్‌ 6-3, 4-6, 6-7 (2/7), 2-6తో ప్రపంచ 86వ ర్యాంకర్‌ లాస్లో జెరె చేతిలో ఓడిపోయాడు. మొదటి సెట్‌ను కోల్పోయిన లాస్లో.. ఆపై అద్భుతంగా పుంజుకొని మ్యాచ్‌ను సొంతం చేసుకున్నాడు. ఇక, రెండో సింగిల్స్‌లో ప్రజ్నేశ్‌ గుణేశ్వరన్‌ 4-6, 3-6, 3-6తో ప్రపంచ 56వ ర్యాంకర్‌ దుసాన్‌ లాజోవిచ్‌ చేతిలో ఓడిపోయాడు.

రామనాథన్‌లానే గుణేశ్వరన్‌ కూడా కీలక బ్రేక్‌ పాయింట్లు సాధించడంలో విఫలమయ్యాడు. దీంతో తనకంటే ఎంతో మెరుగైన సెర్బియా ప్రత్యర్థి లజోవిక్‌ చేతిలో అతడికి ఓటమికి తప్పలేదు. దీంతో శనివారం జరిగే డబుల్స్‌ మ్యాచ్‌లో మిలోజెవిచ్‌--పెట్రోవిచ్‌ జోడీతో రోహన్‌ బోపన్న-శ్రీరామ్‌ బాలాజీ జోడీ తలపడనుంది.

ఈ మ్యాచ్‌లో బోపన్న జోడీ గెలిస్తేనే ఈ పోటీలో భారత ఆశలు సజీవంగా ఉంటాయి. ఆదివారం జరిగే రివర్స్‌ సింగిల్స్‌లో రామ్‌కుమార్‌-లజోవిక్‌ను, ప్రజ్ఞేశ్‌-జెరెను ఢీకొంటారు. భారత్‌, సెర్బియా ఇప్పటికే క్వాలిఫయింగ్‌ రౌండ్‌కు అర్హత పొందడంతో ఈ పోరు ఫలితం ఇరు జట్లపై ఎలాంటి ప్రభావం చూపదు.

Story first published: Saturday, September 15, 2018, 12:01 [IST]
Other articles published on Sep 15, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X