టెన్నిస్ దిగ్గ‌జం ర‌ఫెల్ నాద‌ల్‌కు క‌రోనా.. ఆస్ట్రేలియన్ ఓపెన్ ఆడేది డౌటే!

టెన్నిస్ దిగ్గ‌జ ఆట‌గాడు ర‌ఫెల్ నాద‌ల్ క‌రోనా బారిన ప‌డ్డాడు. నాద‌ల్ ఇటీవ‌ల అబుదాబిలో నిర్వ‌హించిన దుబాయ్ టోర్న‌మెంట్‌లో పాల్గొన్నాడు. అయితే టోర్నీ మ‌ధ్య‌లో నాద‌ల్ కాలికి గాయ‌మైంది. దీంతో టోర్నీ నుంచి మ‌ధ్య‌లోనే నిష్క్రమించాడు నాద‌ల్‌. ఈ క్ర‌మంలోనే త‌న స్వదేశ‌మైన స్పెయిన్ వెళ్లిపోయాడు. నిబంధ‌న‌ల్లో భాగంగా అక్క‌డ నాద‌ల్‌కు క‌రోనా ప‌రీక్ష‌లు నిర్వ‌హించారు. అందులో నాద‌ల్‌కు పాజిటివ్‌గా తేలింది. దీంతో ప్ర‌స్తుతం నాద‌ల్ హోంఐసోలేష‌న్‌లో ఉంటున్నాడు. త‌న‌క క‌రోనా సోకిన విష‌యాన్ని నాద‌లే స్వ‌యంగా ట్విట్ట‌ర్ ద్వారా వెల్ల‌డించాడు.

ట్విట్ట‌ర్ ద్వారా

ట్విట్ట‌ర్ ద్వారా

ఇటీవ‌ల ఆర్టీపీఆర్ టెస్టులు చేయించుకోగా త‌న‌కు పాజిటివ్‌గా తేలింద‌ని, ప్ర‌స్తుతం గ‌డ్డు కాలాన్ని ఎదుర్కొంటున్నాన‌ని ట్విట్ట‌ర్ ద్వారా అభిమానుల‌తో పంచుకున్నాడు. అయితే త్వ‌ర‌లోనే కోలుకుంటాన‌ని ఆత్మ‌విశ్వాసం వ్య‌క్తం చేశాడు. క‌రోనా సోకండంతో తాను భ‌విష్య‌తుల్లో జ‌ర‌గ‌బోయే టోర్నీలో పాల్గొంటానా? లేదా? అనేది త్వ‌ర‌లోనే స‌మాచారం అందిస్తాన‌ని తెలిపాడు. కాగా త‌న‌తో స‌న్నిహితంగా మెలిగిన‌వారంతా క‌రోనా ప‌రీక్ష‌లు చేయించుకోవాల‌ని ఈ సంద‌ర్భంగా నాద‌ల్ కోరాడు.

ఆస్ట్రేలియ‌న్ ఓప్‌న్‌లో ఆడేది డౌటే!

ఆస్ట్రేలియ‌న్ ఓప్‌న్‌లో ఆడేది డౌటే!

35 సంవ‌త్స‌రాల నాద‌ల్ కొంత కాలంగా కాలి గాయంతో బాధ‌ప‌డుతున్నాడు. దీనికి తోడు ప్ర‌స్తుతం క‌రోనా కూడా సోకింది. దీంతో వ‌చ్చే నెల‌లో జ‌ర‌గ‌నున్న ఆస్ట్రేలియ‌న్ ఓపెన్‌లో నాద‌ల్ ఆడుతాడా? లేదా? అనేది తెలియాల్సి ఉంది. కాగా కాలి గాయం కార‌ణంగా ఇప్ప‌టికే నాద‌ల్ ప‌లు మేజ‌ర్ టోర్నీల‌కు దూర‌మ‌యిన సంగ‌తి తెలిసిందే. ఆస్ట్రేలియ‌న్ ఓపెన్ జ‌న‌వ‌రి 17 నుంచి ప్రారంభం కానుంది.

ఫెద‌ర‌ర్ స‌ర‌స‌న నాద‌ల్‌

ఫెద‌ర‌ర్ స‌ర‌స‌న నాద‌ల్‌

కెరీర్‌లో ఇప్ప‌టికే 20 గ్రాండ్ స్లామ్‌లు నెగ్గిన ర‌ఫెల్ నాద‌ల్‌.. అత్య‌ధిక గ్రాండ్ స్లామ్‌లు నెగ్గిన రోజ‌ర్ ఫెద‌ర‌ర్‌తో స‌మంగా ఉన్నాడు. దీంతో ఇంకోక్క గ్రాండ్ స్లామ్ నెగ్గితే టెన్నిస్‌లో అత్య‌ధిక గ్రాండ్ స్లామ్‌లు నెగ్గిన ఆట‌గాడిగా నాద‌ల్ టెన్నిస్ చ‌రిత్ర‌లో నిలిచిపోతాడు. త‌న కెరీర్‌లో తొలి గ్రాండ్ స్లామ్‌ను 2005లో నెగ్గిన నాద‌ల్, చివ‌రి గ్రాండ్ స్లామ్‌ను 2020లో నెగ్గాడు.

ఈ రెండు ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్ స్లామ్‌లే కావ‌డం గ‌మనార్హం. కెరీర్‌లో నాద‌ల్ అత్య‌ధికంగా ఫ్రెంచ్ ఓపెన్‌ను 13 సార్లు గెలిచాడు. ఇక యూఎస్ ఓపెన్‌ను 4 సార్లు, వింబుల్డ‌న్ ఓపెన్‌ను రెండు సార్లు, ఆస్ట్రేలియ‌న్ ఓపెన్‌ను ఒక సారి గెలిచాడు. అంతేకాకుండా సుదీర్ఘ కాలం నంబ‌ర్ వ‌న్ ర్యాంకులో నిలిచిన ఆట‌గాడిగా కూడా నాద‌ల్ నిలిచాడు.

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
Story first published: Tuesday, December 21, 2021, 13:16 [IST]
Other articles published on Dec 21, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X