న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఫ్రెంచ్ ఓపెన్‌: ఐదో రోజు కూడా ఎలాంటి సంచలనాలు లేవు

By Nageshwara Rao
Rafael Nadal moves up a gear to demolish Guido Pella in French Open

హైదరాబాద్: ఫ్రెంచ్ ఓపెన్‌లో ఐదో రోజు కూడా ఎలాంటి సంచలనాలు నమోదు కాలేదు. అంచనాలకు అనుగుణంగా రాణించిన టాప్‌సీడ్ ప్లేయర్లందరూ మూడోరౌండ్‌లోకి ప్రవేశించారు. కెరీర్‌లో తొలి గ్రాండ్‌స్లామ్‌ సాధించాలని ఆరాటపడుతున్న మహిళల ప్రపంచ నంబర్‌వన్‌ సిమోనా హలెప్‌ (రుమేనియా) ఈ టోర్నీలో దూసుకుపోతోంది.

2014, 2017లో ఫైనల్‌ వరకు చేరినా ఆమెకు నిరాశే ఎదురైంది. దీంతో ఈసారి విజేతగా నిలవాలనుకుంటున్న హలెప్ గురువారం జరిగిన రెండో రౌండ్‌లో అలవోక విజయాన్ని నమోదు చేసింది. అమెరికాకు చెందిన టేలర్‌ టౌన్‌సెండ్‌పై 6-3, 6-1 తేడాతో నెగ్గిన 26 ఏళ్ల హలెప్‌కు ఏదశలోనూ పోటీ ఎదురుకాలేదు.

మూడోరౌండ్‌లోకి అడుగుపెట్టిన ముగురుజా

మూడోరౌండ్‌లోకి అడుగుపెట్టిన ముగురుజా

మరోవైపు మహిళల సింగిల్స్‌లో రెండో ఫ్రెంచ్ టైటిల్ కోసం వేట మొదలుపెట్టిన మాజీ చాంపియన్‌, మూడో సీడ్‌ గాబ్రియేల్ ముగురుజా మరో అడుగు ముందుకేసింది. గురువారం జరిగిన మహిళల సింగిల్స్ రెండోరౌండ్‌లో మూడోసీడ్ ముగురుజా 6-4, 6-3తో ఫియోనా ఫెర్రో (ఫ్రాన్స్)పై గెలిచి మూడోరౌండ్‌లోకి అడుగుపెట్టింది. గంటా 26 నిమిషాల పాటు జరిగిన ఈ మ్యాచ్‌లో ముగురుజా బేస్‌లైన్ గేమ్‌తో అదురగొట్టింది. నాలుగు ఏస్‌లు సంధించిన ముగురుజా రెండు డబుల్‌ ఫాల్ట్‌లు చేయగా 5 బ్రేక్‌ పాయింట్లను కాచుకుంది.

షరపోవాకు గట్టి పోటీ

షరపోవాకు గట్టి పోటీ

మరోవైపు మరియా షరపోవాకు గట్టి పోటీ ఎదురైంది. ఉత్కంఠ భరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో 7-5, 6-4 తేడాతో డోనా వెకిక్‌ (క్రొయేషియా)పై విజయం సాధించింది. చివరి సెట్‌ను గెలిచేందుకు షరపోవా ఐదో మ్యాచ్‌ పాయింట్‌ వరకు ఎదురుచూడాల్సి వచ్చింది. ఇక చెక్‌ రిపబ్లిక్‌ బ్యూటీ కరోలినా ప్లిస్కోవా 3-6, 6-4, 6-1 తేడాతో తన దేశానికే చెందిన లూసీ సఫరోవాపై గెలిచి షరపోవాతో పోరుకు సిద్ధమైంది. ఇతర మ్యాచ్‌ల్లో ఫ్లిస్కోవా (చెక్) 3-6, 6-4, 6-1తో సఫరోవా (చెక్)పై, షరపోవా (రష్యా) 7-5, 6-4తో వికిచ్ (క్రొయేషియా)పై, కెర్బర్ (జర్మనీ) 6-2, 6-3తో బోగ్దాన్ (రొమేనియా)పై, మార్టినెస్ (బెల్జియం) 6-3, 6-4తో వాట్సన్ (బ్రిటన్)పై, సురెంకో (ఉక్రెయిన్) 6-3, 4-6, 6-0తో వాండ్‌వాఘే (అమెరికా) పై, స్టోసుర్ 6-2, 7-6 (7/1)తో పావులుంచెకోపై, గవిరోలోవా 5-7, 7-5, 6-3తో పెరాపై, రెబెరికోవా 6-2, 6-4తో బెనిచ్‌పై, బెర్టెన్స్ 6-4, 6-2తో సన్‌సోవిచ్‌పై, పెట్కోవిచ్ 6-0, 7-6 (7/5)తో మాటెక్ సాండ్‌పై నెగ్గి మూడోరౌండ్‌లోకి ప్రవేశించారు.

మూడోరౌండ్‌లోకి దూసుకెళ్లిన నాదల్

మూడోరౌండ్‌లోకి దూసుకెళ్లిన నాదల్

పురుషుల సింగిల్స్ రెండోరౌండ్‌లో టాప్‌సీడ్ నాదల్ (స్పెయిన్) 6-2, 6-1, 6-1తో గుడియో పెల్లా (అర్జెంటీనా)పై గెలిచి మూడోరౌండ్‌లోకి దూసుకెళ్లాడు. రెండు గంటల 3 నిమిషాల మ్యాచ్‌లో పెల్లా కేవలం నాలుగు గేమ్‌లను మాత్రమే కాపాడుకోగలిగాడు. ప్రత్యర్థి ఎనిమిది ఏస్‌లు సంధించినా ఒక్క బ్రేక్‌పాయింట్‌ను సాధించలేకపోయాడు. తొలిసెట్‌లో నాలుగు బ్రేక్ పాయింట్లను కాచుకున్న స్పెయిన్ బుల్ వరుసగా 9 గేమ్‌లను గెలిచాడు. మ్యాచ్ మొత్తం సాధారణమైన సర్వీస్‌లనే కొట్టిన నాదల్.. చివరి రెండు సెట్లలో మాత్రం మరింత దూకుడుగా ఆడాడు.

రెండో రౌండ్‌లో యుకీ-శరణ్‌ జోడీ

రెండో రౌండ్‌లో యుకీ-శరణ్‌ జోడీ

పురుషుల డబుల్స్‌లో భారత క్రీడాకారులు మెరుగైన ప్రదర్శన చూపెడుతున్నారు. గురువారం జరిగిన రెండోరౌండ్‌లో 13వ సీడ్ బోపన్న-రోజర్ వాసెలిన్ (ఫ్రాన్స్) 6-1, 6-2తో బెంజిమెన్ బోంజి-జార్జ్ జాక్ (ఫ్రాన్స్)పై గెలిచి మూడోరౌండ్‌లోకి ప్రవేశించారు. 48 నిమిషాల పాటు జరిగిన ఈ మ్యాచ్‌లో ఇండో-ఫ్రాన్స్ జంట 4 ఏస్‌లతో చెలరేగింది. మ్యాచ్‌మొత్తంలో ఒక్క డబుల్ ఫాల్ట్ కూడా చేయకపోవడం విశేషం. అంతకుముందు జరిగిన తొలిరౌండ్‌లో భారత డబుల్స్‌ జంట యుకీ భాంబ్రీ-దివిజ్‌ శరణ్‌ జోడీ 6-3, 5-7, 6-4 తేడాతో పూరవ్‌ రాజా (భారత్‌)-ఫ్యాబ్రిక్‌ మార్టిన్‌ (ఫ్రాన్స్‌)పై విజయం సాధించి రెండో రౌండ్‌లోకి అడుగుపెట్టారు.

Story first published: Friday, June 1, 2018, 12:07 [IST]
Other articles published on Jun 1, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X